...
...
Next Story

OTT Show: ప్రతిరోజూ కొత్త అమ్మాయి అయితే తప్పు లేదు, భర్త అఫైర్లను ప్రోత్సహించిన భార్య- ఓటీటీ షోపై డైరెక్టర్ లక్ష్మీ ఫైర్

Netflix OTT Show Desi Bling Tabinda Sanpal Controversy: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ లగ్జరీ రియాలిటీ షో దేశీ బ్లింగ్ వివాదాలకు వేదికగా మారింది. భర్త ప్రతిసారీ వేరే అమ్మాయిలతో పార్టీలకు వెళ్తే తప్పేమీ లేదంటూ బిలియనీర్ సతీష్ సన్‌పాల్ భార్య తాబిందా చేసిన వ్యాఖ్యలపై దర్శకురాలు లక్ష్మీ ఆర్ అయ్యర్ మండిపడ్డారు.

Published on: May 25, 2026, 12:14:07 IST
Advertisement

Netflix OTT Show Desi Bling Tabinda Sanpal Controversy Lakshmi R Iyer: దుబాయ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లగ్జరీ రియాలిటీ ఓటీటీ షో 'దుబాయ్ బ్లింగ్' ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దానికి సీక్వెల్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న భారతీయ వెర్షన్ 'దేశీ బ్లింగ్' (Desi Bling) ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

నమ్మకద్రోహాన్ని సాధారణ విషయంగా

OTT Show: ప్రతిరోజూ కొత్త అమ్మాయి అయితే తప్పు లేదు, భర్త అఫైర్లను ప్రోత్సహించిన భార్య- ఓటీటీ షోపై డైరెక్టర్ లక్ష్మీ ఫైర్
OTT Show: ప్రతిరోజూ కొత్త అమ్మాయి అయితే తప్పు లేదు, భర్త అఫైర్లను ప్రోత్సహించిన భార్య- ఓటీటీ షోపై డైరెక్టర్ లక్ష్మీ ఫైర్

కోటీశ్వరుల విలాసవంతమైన జీవితాలు, లగ్జరీ పార్టీలు, వారి వ్యక్తిగత గొడవలను చూపే ఈ ఓటీటీ షోలో ఇటీవల ఒక జంట చేసిన వ్యాఖ్యలు పెను వివాదాన్ని రేపాయి. పెళ్లి బంధంలో నమ్మకద్రోహాన్ని (Infidelity) చాలా సాధారణ విషయంగా చిత్రీకరిస్తూ ఒక సెలబ్రిటీ భార్య మాట్లాడిన తీరుపై నెటిజన్లు, సినీ ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు.

మన సంస్కృతిలో వివాహ బంధానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. అలాంటిది ఆధునికత, విదేశీ జీవనశైలి ముసుగులో నైతిక విలువలను వదిలేస్తున్నారంటూ భారతీయ వీక్షకులు ఈ నెట్‌ఫ్లిక్స్ షోపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిరోజూ కొత్త అమ్మాయైతే పర్లేదు..

ఈ షోలో పాల్గొన్న ప్రముఖ వ్యాపారవేత్త సతీష్ సన్‌పాల్, ఆయన భార్య తాబిందా సన్‌పాల్ తమ వైవాహిక జీవితం గురించి మాట్లాడిన క్లిప్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. "సతీష్ పార్టీలకు వెళ్తాడు, అక్కడ వేరే అమ్మాయిలతో కలిసి తిరుగుతాడని నాకు తెలుసు. ప్రతిసారీ ఒక కొత్త అమ్మాయితో వెళ్తే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, రోజూ ఒకే అమ్మాయితో కనిపిస్తేనే అది సమస్య అవుతుంది. సతీష్ పార్టీలలో అమ్మాయిలు లేకపోతే అసలు ముచ్చటగా ఉండదు" అని తాబిందా ఒక ఎపిసోడ్‌లో చాలా సాధారణంగా మాట్లాడారు.

తాబిందా చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకురాలు లక్ష్మీ ఆర్ అయ్యర్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. 'అప్పా', 'ఫస్ట్ సెకండ్ ఛాన్స్' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ ఆర్ అయ్యర్ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

"రియాలిటీ షోలో ఒక భార్య తన భర్త తప్పు చేసినా పర్లేదు, కానీ ఆ అమ్మాయి మారితే చాలు అన్నట్లు మాట్లాడిన క్లిప్ చూశాను. ఆధునికత, కూల్ సంస్కృతి అనే ముసుగులో ఇలాంటి తప్పుడు సంకేతాలను సమాజానికి ఇవ్వడం ఆపండి. వైవాహిక బంధంలో భాగస్వామికి నమ్మకంగా ఉండటం, నిజాయితీగా జీవించడమే ఎప్పటికీ అందమైన విషయం. సోషల్ మీడియా భ్రమల్లో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు" అని లక్ష్మీ ఆర్ అయ్యర్ స్పష్టం చేశారు.

ఈ పోస్ట్‌పై బుల్లితెర నటి దేవోలీనా భట్టాచార్జీ కూడా స్పందిస్తూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఒకే అమ్మాయిని పదే పదే కలిస్తే సదరు భర్త ప్రేమలో పడిపోతాడనే భయంతోనే ఆ భార్య అలా మాట్లాడి ఉంటుందని దేవోలీనా ఎద్దేవా చేశారు.

అసలు ఏంటి ఈ 'దేశీ బ్లింగ్' షో?

విదేశాల్లో, ముఖ్యంగా యూఏఈ (UAE) లో స్థిరపడిన అత్యంత సంపన్న భారతీయ వ్యాపారవేత్తలు, బిలియనీర్ల జీవనశైలి చుట్టూ ఈ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ షో తిరుగుతుంది. రిజ్వాన్ సజన్, సతీష్ సన్‌పాల్, అడెల్ సజన్, సనా సజన్, పమేలా సెరెనా, జాన్వీ గౌర్ వంటి ప్రముఖులు ఇందులో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు.

వీరితో పాటు టెలివిజన్ స్టార్స్ కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్ కూడా ఈ ఓటీటీ షోలో సందడి చేస్తున్నారు. ఇటీవలే కరణ్ కుంద్రా తన ప్రియురాలైన తేజస్వికి భారీ డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేసి నిశ్చితార్థం చేసుకున్న విజువల్స్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయ్యాయి.

తెలుగులోనూ ఓటీటీ రిలీజ్

అయితే కరణ్-తేజస్విల ప్రేమ కథ అందించిన ఆనందం కంటే, సతీష్-తాబిందాల వివాదాస్పద వ్యాఖ్యలే ఇప్పుడు ఈ షోను నెగెటివ్ టాపిక్‌గా మార్చాయి. కాగా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు భాషలో కూడా దేశీ బ్లింగ్ ఓటీటీ రిలీజ్ అయింది. మే 22 నుంచి ఈ దేశీ బ్లింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'దేశీ బ్లింగ్' వివాదానికి అసలు కారణం ఏమిటి?

షోలో పాల్గొన్న తాబిందా సన్‌పాల్ తన భర్త వేరే అమ్మాయిలతో తిరిగినా తనకు అభ్యంతరం లేదని, ప్రతిసారీ కొత్త అమ్మాయి అయితే ఓకేనని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిని నెటిజన్లు నమ్మకద్రోహాన్ని ప్రోత్సహించడంగా భావిస్తున్నారు.

2. తాబిందా వ్యాఖ్యలపై ఫిల్మ్‌మేకర్ లక్ష్మీ ఆర్ అయ్యర్ ఎలా స్పందించారు?

ఆధునికత లేదా కూల్ సంస్కృతి పేరుతో వివాహ బంధంలో నమ్మకద్రోహాన్ని సాధారణీకరించవద్దని లక్ష్మీ ఆర్ అయ్యర్ హితవు పలికారు. భాగస్వామికి నమ్మకంగా, నిజాయితీగా ఉండటమే ఎప్పటికీ గొప్ప విషయమని ఆమె స్పష్టం చేశారు.

3. 'దేశీ బ్లింగ్' షో ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది?

ఈ లగ్జరీ రియాలిటీ షో ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

4. ఈ షోలో నిశ్చితార్థం చేసుకున్న క్రేజీ కపుల్ ఎవరు?

ప్రముఖ టెలివిజన్ నటీనటులు కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్ ఈ షో వేదికగానే అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. దుబాయ్‌లో జరిగిన వీరి ప్రపోజల్ సీన్ బాగా వైరల్ అయింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks