...
...
Next Story

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ఆ రెండు సినిమాలు ఔట్.. సమంత కామెడీ మూవీ, తాప్సీ సైకలాజికల్ థ్రిల్లర్.. వెంటనే చూసేయండి

Netflix: నెట్‌ఫ్లిక్స్ నుంచి మరో రెండు సౌత్ సినిమాలు డిలీట్ కాబోతున్నాయి. అందులో ఒకటి సమంత నటించిన తెలుగు కామెడీ మూవీ ఓ బేబీ కాగా.. మరొకటి తాప్సీ నటించిన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గేమ్ ఓవర్.

Published on: Aug 4, 2026, 14:13:24 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Netflix: ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సౌత్ మూవీ లవర్స్‌కు ఒకేసారి రెండు బిగ్ షాక్స్ ఇచ్చేందుకు రెడీ అయింది. లేడీ సూపర్‌స్టార్ సమంత రుత్ ప్రభు నటించిన 'ఓ బేబీ' (Oh Baby), బాలీవుడ్ భామ తాప్సీ పన్ను ప్రయోగాత్మక చిత్రం 'గేమ్ ఓవర్' (Game Over) సినిమాలు త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీ నుంచి వెళ్లిపోనున్నాయి.

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ఆ రెండు సినిమాలు ఔట్.. సమంత కామెడీ మూవీ, తాప్సీ సైకలాజికల్ థ్రిల్లర్.. వెంటనే చూసేయండి
Netflix: నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ఆ రెండు సినిమాలు ఔట్.. సమంత కామెడీ మూవీ, తాప్సీ సైకలాజికల్ థ్రిల్లర్.. వెంటనే చూసేయండి

2019లో కేవలం నెల రోజుల తేడాతో థియేటర్లలోకి వచ్చిన ఈ రెండు వుమెన్ సెంట్రిక్ సినిమాలు, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కాంట్రాక్ట్ ముగియడంతో ఈ వేదికకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పబోతున్నాయి.

ఆగస్టు 12 నుంచి 'గేమ్ ఓవర్'.. సెప్టెంబర్ 2న 'ఓ బేబీ' డిలీట్!

మొదటగా తాప్సీ పన్ను మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'గేమ్ ఓవర్' ఆగస్టు 12, 2026న నెట్‌ఫ్లిక్స్ నుంచి వెళ్లిపోనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 2, 2026 నాటికి సమంత సూపర్ హిట్ ఎంటర్‌టైనర్ 'ఓ బేబీ' లైబ్రరీ నుంచి కనుమరుగవుతుంది.

కేవలం తెలుగు, తమిళ ఒరిజినల్ వెర్షన్లు మాత్రమే కాకుండా, ఇతర భాషల్లో అందుబాటులో ఉన్న డబ్బింగ్ వెర్షన్లను కూడా ఓటీటీ నుంచి పూర్తిగా తీసేస్తున్నారు.

రూ. 40 కోట్ల కలెక్షన్లు.. సమంత కెరీర్‌లోనే మైలురాయి

నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఓ బేబీ' కొరియన్ ఫిల్మ్ 'మిస్ గ్రానీ'కి అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కింది. 70 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువతిగా మారే ఈ ఫాంటసీ కామెడీలో సమంత తన కామెడీ టైమింగ్‌తో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపింది.

మరోవైపు అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేసిన 'గేమ్ ఓవర్' చిత్రం డిఫరెంట్ గేమ్ లూప్, హోమ్ ఇన్‌వేషన్ కాన్సెప్ట్‌తో సైకలాజికల్ థ్రిల్లర్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంది. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడుతూ వీల్‌చైర్‌కే పరిమితమైన యువతిగా తాప్సీ పండించిన నటన సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్, ప్రశాంతీ అమర్‌నాథ్ మ్యూజిక్‌తో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది.

లైసెన్సింగ్ డీల్ ముగింపు.. మీరూ వాచ్‌లిస్ట్‌లో పెట్టుకున్నారా?

సాధారణంగా ఓటీటీ దిగ్గజాలు 5 నుంచి 7 ఏళ్ల కాలపరిమితితో ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి స్ట్రీమింగ్ హక్కుల లైసెన్సింగ్ అగ్రిమెంట్లు చేసుకుంటాయి. ఆ కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత అగ్రిమెంట్‌ను రెన్యూ చేసుకోకపోతే సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుంచి డిలీట్ అవుతాయి.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వీటి లైసెన్స్‌ను మళ్లీ రీన్యూ చేస్తుందో లేదో ఇంకా అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఈ రెండు సూపర్ హిట్ సినిమాలను ఇప్పటివరకు చూడనివారు లేదా మళ్లీ రీవాచ్ చేయాలనుకునే ఫ్యాన్స్, అవి నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగిపోకముందే చూసేయడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks