...
...
Next Story

Netflix Trending: నెట్‌ఫ్లిక్స్‌ను ఏలుతున్న ఇండియన్ సినిమాలు.. గ్లోబల్ టాప్-10లో ఏకంగా 5.. ఓటీటీ మస్ట్ వాచ్ మూవీస్

Netflix Trending: గ్లోబల్ స్టేజీపై బాక్సాఫీస్ దగ్గరే కాదు ఓటీటీలోనూ మన ఇండియన్ సినిమాలు సత్తాచాటుతున్నాయి. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పుడు గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో అయిదు మన భారత చిత్రాలే. ఈ సినిమాలను ఓటీటీలో తప్పక చూడాల్సిందే. మరి అవేంటో ఓ లుక్కేయండి.

Published on: Oct 1, 2026, 21:50:12 IST
Advertisement

Netflix Trending: ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లేటెస్ట్ 'గ్లోబల్ టాప్ 10 నాన్-ఇంగ్లీష్ మూవీస్' (Global Top 10 Non-English Movies) చార్ట్‌లో ఇండియన్ సినిమాలదే హవా. తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఇరుముడి' (Irumudi) 34 లక్షల వ్యూస్ తో టాప్ ప్లేసుకు చేరుకుంది. 'మోధ రాత్రి' (Modha Rathri) 29 లక్షల వ్యూస్‌తో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

నెట్‌‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10

నెట్‌ఫ్లిక్స్‌ను ఏలుతున్న ఇండియన్ సినిమాలు.. గ్లోబల్ టాప్-10లో ఏకంగా 5.. ఓటీటీ మస్ట్ వాచ్ మూవీస్
నెట్‌ఫ్లిక్స్‌ను ఏలుతున్న ఇండియన్ సినిమాలు.. గ్లోబల్ టాప్-10లో ఏకంగా 5.. ఓటీటీ మస్ట్ వాచ్ మూవీస్

ప్రపంచవ్యాప్తంగా నెట్‌‌ఫ్లిక్స్ ఓటీటీలో వీక్షకులు అత్యధికంగా చూసిన నాన్-ఇంగ్లీష్ చిత్రాల లిస్ట్ ఇలా ఉంది.

  1. ఇరుముడి

2 మోధ రాత్రి

3. ఫేసింగ్ ఎల్ చాపొ

4. ది సీక్రెట్ ఉమెన్

5. విశ్వనాథ్ అండ్ సన్స్

6. లస్ట్ స్టోరీస్ 3

7. బేబీ డు డై డు

8. ది అల్టిమేట్ డ్యూయో

9. గాంధారి

10. జనరల్ మేహెమ్

ఇండియా మ్యాజిక్

ఈ వారపు నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్‌ను పరిశీలిస్తే, భారతీయ సినిమాలు ఏ స్థాయిలో విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయో అర్థమవుతోంది.

  • ఇరుముడి (No. 1): వరుసగా రెండో వారంలో కూడా 34 లక్షల వ్యూస్‌‌తో పాటు 81 లక్షల గంటల వాచ్ టైమ్‌ను సాధించి ప్రపంచంలోనే అత్యధికంగా చూసిన నాన్-ఇంగ్లీష్ సినిమాగా నిలిచింది.
  • మోధ రాత్రి (No. 2): నచ్చని పెళ్లి, ఆ తర్వాత జరిగే పరిణామాల కథతో వచ్చిన ఈ తమిళ చిత్రం 29 లక్షల వ్యూస్‌తో రెండో స్థానంలో నిలిచింది.
  • విశ్వనాథ్ అండ్ సన్స్ (No. 5): గత వారం నంబర్ 1లో ఉన్న సూర్య చిత్రం.. మూడో వారంలోనూ 21 లక్షల వ్యూస్‌ సాధించి స్థిరమైన వ్యూవర్‌షిప్‌ను కొనసాగిస్తోంది.
  • లస్ట్ స్టోరీస్ 3 & గాంధారి: హిందీ ఆంథాలజీ 'లస్ట్ స్టోరీస్ 3' 20 లక్షల వ్యూస్‌తో 6వ స్థానంలో నిలవగా, 'గాంధారి' చిత్రం వరుసగా 4వ వారం కూడా గ్లోబల్ టాప్-10లో కొనసాగుతూ సరికొత్త రికార్డు సృష్టించింది. క్రైమ్ థ్రిల్లర్ బేబీ డు డై డు కూడా అదరగొడుతోంది.

అసలు రహస్యమేంటి?

'ఇరుముడి', 'మోధ రాత్రి', 'విశ్వనాథ్ అండ్ సన్స్' వంటి దక్షిణాది చిత్రాలు కేవలం స్థానిక భారతీయ వీక్షకులకే కాక, సబ్‌టైటిల్స్/డబ్బింగ్ ద్వారా లాటిన్ అమెరికా, ఆసియా-పసిఫిక్, యూరోపియన్ రీజియన్లలో భారీగా స్ట్రీమ్ అవుతున్నాయి. హ్యూమన్ ఎమోషన్స్, బలమైన కుటుంబ నేపథ్యాలు గ్లోబల్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్నాయి.

డిజిటల్ లాంగ్ లైఫ్

ఒకప్పుడు ఓటీటీలలో సినిమాలు తొలి వారానికే పరిమితమయ్యేవి. అయితే 'గాంధారి' వరుసగా 4 వారాలు, 'విశ్వనాథ్ అండ్ సన్స్' 3 వారాలు గ్లోబల్ చాట్‌లో నిలవడం అనేది డిజిటల్ వేదికలపై కంటెంట్‌కు పెరుగుతున్న రీపీట్ వాల్యూ, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్‌ను స్పష్టం చేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks