Weekend OTT: జూన్ మొదటి వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమయ్యాయి. యాక్షన్ డ్రామాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు, గుండెలను పిండేసే ఎమోషనల్ కథలతో కూడిన సరికొత్త చిత్రాలు ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే పాత సినిమాల లిస్టులు కాకుండా, ఈ వారం ఏ సినిమా ఎందుకు చూడాలో హిందూస్థాన్ టైమ్స్ ఎడిటోరియల్ ప్రత్యేక విశ్లేషణ ఇక్కడ చూద్దాం.
అగ్లీ స్టోరీ (Ugly Story)

శ్రీ నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ 'అగ్లీ స్టోరీ'. థియేటర్లలో విడుదలైన కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం 'ఆహా' ఓటీటీలోకి రావడం విశేషం. ఇప్పుడు జియోహాట్ స్టార్, ప్రైమ్ వీడియోలోనూ ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ హైప్ ఉన్న పెద్ద సినిమాలు థియేటర్లను ఆక్రమించడంతో 'అగ్లీ స్టోరీ' లాంటి చిన్న బడ్జెట్ సినిమాకు స్క్రీన్లు దక్కలేదు. దీంతో మేకర్స్ ఆలస్యం చేయకుండా వెంటనే ఓటీటీ డీల్ లాక్ చేశారు.
వీళ్ల యాక్టింగ్
అతి ప్రేమ, పొసెసివ్‌నెస్ ఒక సైకోలా ఎలా మారుస్తాయనే ఇంటెన్స్ ఎమోషన్స్‌ను దర్శకుడు ప్రణవ స్వరూప్ అద్భుతంగా తెరకెక్కించాడు. సైకో భర్తగా శ్రీ నందు నటన, బాధితురాలిగా అవికా గోర్ పర్ఫార్మెన్స్ ఈ వీకెండ్‌కు బెస్ట్ వాచ్‌గా నిలుస్తాయి.
మూల్యం (Moolyam)
ఆత్మాభిమానం, నైతిక విలువలు, సత్ప్రవర్తన చుట్టూ తిరిగే ఒక ప్యూర్, హృదయానికి హత్తుకునే తెలుగు రూటెడ్ డ్రామా 'మూల్యం'. ఇది ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎందుకు చూడాలి?
కమర్షియల్ హంగామా, గన్ షాట్లు, రక్తం చిందే క్రైమ్ థ్రిల్లర్ల మధ్య నలిగిపోతున్న ప్రేక్షకులకు ఒక స్వచ్ఛమైన ఫ్యామిలీ డ్రామా కావాలనుకుంటే 'మూల్యం' పర్ఫెక్ట్ ఛాయిస్. క్లిష్ట పరిస్థితుల్లో ఒక సామాన్య వ్యక్తి తన నైతిక విలువలను ఎలా కాపాడుకున్నాడు అనే పాయింట్‌ను ఇందులో చాలా ఎమోషనల్‌గా ఆవిష్కరించారు.
కార్మేని సెల్వం
{{/usCountry}}కమర్షియల్ హంగామా, గన్ షాట్లు, రక్తం చిందే క్రైమ్ థ్రిల్లర్ల మధ్య నలిగిపోతున్న ప్రేక్షకులకు ఒక స్వచ్ఛమైన ఫ్యామిలీ డ్రామా కావాలనుకుంటే 'మూల్యం' పర్ఫెక్ట్ ఛాయిస్. క్లిష్ట పరిస్థితుల్లో ఒక సామాన్య వ్యక్తి తన నైతిక విలువలను ఎలా కాపాడుకున్నాడు అనే పాయింట్‌ను ఇందులో చాలా ఎమోషనల్‌గా ఆవిష్కరించారు.
కార్మేని సెల్వం
{{/usCountry}}సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన తమిళ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా తెలుగులో డబ్బింగ్ వెర్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. సొంతంగా ఒక టాక్సీ వ్యాపారం ప్రారంభించి కుటుంబ భవిష్యత్తును మార్చాలని కలలు కనే ఒక మిడిల్ క్లాస్ డ్రైవర్ కథ ఇది. ఈ కార్మేని సెల్వం మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పడే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పుడు తండ్రి పడే వేదనను సముద్రఖని తన సహజ నటనతో కన్నీళ్లు తెప్పించేలా చూపించాడు. వీకెండ్‌లో కుటుంబంతో కలిసి చూడదగ్గ క్లీన్ డ్రామా ఇది.
కేడీ: ది డెవిల్
కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన అత్యంత భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా 'కేడీ: ది డెవిల్'. ప్రేమ్ దర్శకత్వంలో ధ్రువ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి కీలక పాత్రల్లో నటించారు. 1970ల నాటి బెంగళూరు అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ కథలో, కాళిదాస్ అలియాస్ కేడీ అనే యువకుడు తన కుటుంబానికి వచ్చిన ముప్పు కారణంగా క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఈ చిత్రం జీ5లో ఉంది.
పేట్రియాట్
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటించిన హై-వోల్టేజ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'పేట్రియాట్'. మహేష్ నారాయణన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, నయనతార కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఇది కూడా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
29
ప్రముఖ దర్శకులు లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణ భాగస్వామ్యంలో వచ్చిన తమిళ కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా '29'. జీవితంలో ఎలాంటి ఆశయాలు లేకుండా, ఏం చేయాలో తెలియక సతమతమయ్యే 29 ఏళ్ల సత్య జీవితంలోకి విజి అనే యువతి ప్రవేశిస్తుంది. ఆమె పరిచయం తర్వాత సత్య తనను తాను ఎలా మార్చుకున్నాడు, జీవితాన్ని ఎలా కొత్త కోణంలో చూడటం ప్రారంభించాడనేది ఎమోషనల్ నరేషన్‌తో చూపించారు. ఇది నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది.
People Also Ask (FAQ)
- అగ్లీ స్టోరీ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది?
నందు, అవికా గోర్ జంటగా నటించిన అగ్లీ స్టోరీ మూవీ ఆహా, ప్రైమ్ వీడియో, జియోహాట్ స్టార్ ఓటీటీల్లో రిలీజైంది.
2. కార్మేని సెల్వం స్టోరీ ఏంటీ?
సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన కార్మేని సెల్వం మూవీ.. ఓ ట్యాక్సీ డ్రైవర్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతోంది.
3. ఈ వారం నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన తమిళ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ ఏదీ?
ఈ వారం నెట్‌ఫ్లిక్స్ లో తమిళ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ 29 రిలీజైంది.