OTT Releases This Week: తెలుగు డిజిటల్ ఆడియన్స్‌కు ఈ వారం థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను మించిపోయేలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ భారీ కంటెంట్‌తో రెడీ అయ్యాయి. సస్పెన్స్, క్రైమ్, లవ్, కామెడీ ఇలా అన్ని జోనర్ల సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ జూన్ మూడో వారంలో సందడి చేయబోతున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ లెవెల్లో క్రేజ్ ఉన్న సరికొత్త కథలతో పాటు, ఇండియాలోనే బిగ్గెస్ట్ సస్పెన్స్ ఫ్రాంచైజీల అప్‌డేట్స్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
దృశ్యం 3 (Drishyam 3)

ఈ వారం ఓటీటీ ఆడియన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్న బిగ్గెస్ట్ మూవీ 'దృశ్యం 3'. జార్జ్‌కుట్టి (మోహన్ లాల్) తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఇన్ని రోజులు దాచిన రహస్యాలు ఇప్పుడు మళ్లీ కొత్త భయాల రూపంలో అతని ముందుకు వస్తాయి. నిజం బయటకు వస్తే జరిగే పరిణామాలు ఏంటి? తన ఫ్యామిలీ కోసం జార్జ్‌కుట్టి ఈసారి ఎలాంటి త్యాగాలు చేయాల్సి వచ్చింది అనే ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లేతో ఈ థ్రిల్లర్ పార్ట్ 3 సాగనుంది.
ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
భాషలు: మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ
రిలీజ్ డేట్: జూన్ 18, 2026
సేవ్ ది టైగర్స్ 3 (Save The Tigers 3)
తెలుగులో సూపర్ హిట్ అయిన 'సేవ్ ది టైగర్స్' కామెడీ వెబ్ సిరీస్ ఇప్పుడు సీజన్ 3 తో డిజిటల్ స్క్రీన్స్ పైకి వస్తోంది. తమ పెళ్లి తర్వాత జీవితాలను చూసి బాధ పడే ముగ్గురు భర్తల కథే ఈ వెబ్ సిరీస్. వాళ్లు చేసిన రచ్చ ఎలా న్యూస్ హెడ్‌లైన్స్ లోకి ఎక్కింది, ఆ తర్వాత వాళ్ల లైఫ్ లో జరిగిన మరిన్ని కామెడీ ఘటనలతో ఈ సీజన్ 3 ఫుల్ ఎంటర్‌టైన్ చేయనుంది.
ఎక్కడ చూడాలి: జియోహాట్‌స్టార్ (JioHotstar)
{{/usCountry}}ఎక్కడ చూడాలి: జియోహాట్‌స్టార్ (JioHotstar)
{{/usCountry}}భాష: తెలుగు
రిలీజ్ డేట్: జూన్ 19, 2026
కెనాతా కాణోమ్ (Kenatha Kanom)
ఈ వారం ఓటీటీ రేస్ లో మొదటగా రాబోతున్న సినిమా 'కెనాతా కాణోమ్'. తీవ్రమైన కరవుతో అల్లాడిపోతున్న ఒక ఊరి జనం.. నీళ్ల కోసం ఒక కొత్త బావిని తవ్వడం స్టార్ట్ చేస్తారు. అయితే నీళ్లు పడతాయనుకున్న ఆ బావిలో వాళ్లకు ఒక డైనోసార్ అస్థిపంజరం (Fossil) దొరుకుతుంది. ఆ తర్వాత ఆ గ్రామంలో జరిగిన ఊహించని పరిణామాలు ఏంటి అనేదే ఈ సినిమా కథ.
ఎక్కడ చూడాలి: జియోహాట్‌స్టార్ (JioHotstar)
భాష: తమిళం (తెలుగు డబ్బింగ్ అప్‌డేట్ త్వరలో)
రిలీజ్ డేట్: జూన్ 16, 2026
అబ్ హోగా హిసాబ్ (Ab Hoga Hisaab)
పంజాబ్ బ్యాక్‌డ్రాప్ లో సాగే ఈ క్రైమ్ డ్రామా అమెజాన్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్ లో రిలీజ్ కానుంది. రీసెంట్‌గా కెనడా నుంచి డిపోర్ట్ అయిన బాబీ అనే ఎన్‌ఆర్‌ఐ.. కనిపించకుండా పోయిన తన తమ్ముడి కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో కెనడా ఇమ్మిగ్రేషన్ సర్వీస్ పేరుతో సాగుతున్న ఒక పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణం) నెట్‌వర్క్ గురించి అతనికి తెలుస్తుంది. ఇన్‌స్పెక్టర్ దోసాంజ్, తన వదినతో కలిసి బాబీ ఆ కరప్షన్ పై ఎలా ఫైట్ చేశాడనేది అసలు కథ.
ఎక్కడ చూడాలి: అమెజాన్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్ (Amazon MX Player)
భాష: హిందీ
రిలీజ్ డేట్: జూన్ 18, 2026
ఐ విల్ ఫైండ్ యూ (I Will Find You)
నెట్‌ఫ్లిక్స్ లో రాబోతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఒక తండ్రి పోరాటం. తన సొంత కొడుకునే హత్య చేశాడనే తప్పుడు నేరంతో జైలుకు వెళ్తాడు ఒక తండ్రి. కానీ కొన్నేళ్ల తర్వాత తన కొడుకు బతికే ఉన్నాడనే షాకింగ్ నిజం అతనికి తెలుస్తుంది. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి తన కొడుకుని కాపాడుకోవడానికి ఆ తండ్రి చేసిన సాహసాలే ఈ సినిమా.
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్ (Netflix)
భాష: ఇంగ్లీష్
రిలీజ్ డేట్: జూన్ 18, 2026
యువర్ ఫాల్ట్: లండన్ (Your Fault: London)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్న 'యువర్ ఫాల్ట్: లండన్' వెబ్ సిరీస్.. నిక్, నోవా అనే జంట మధ్య సాగే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ స్టోరీ. నోవా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తన కొత్త లైఫ్ స్టార్ట్ చేయగా, నిక్ లండన్ లో తన తండ్రి కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. దూరం, అసూయ, వాళ్ల ఆశయాల వల్ల లవ్ లైఫ్ లో ఎలాంటి సమస్యలు వచ్చాయనేది ఇందులో చూడొచ్చు.
ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
భాష: ఇంగ్లీష్
రిలీజ్ డేట్: జూన్ 17, 2026
వాయిస్‌మెయిల్స్ ఫర్ ఇసబెల్ (Voicemails for Isabelle)
చనిపోయిన తన సోదరికి ఒక యువతి ఎమోషనల్, హ్యూమరస్ వాయిస్ మెసేజెస్ పంపుతుంటుంది. అయితే ఆ వాయిస్‌మెయిల్స్ పొరపాటున ఒక తెలియని వ్యక్తికి రీడైరెక్ట్ అవుతాయి. ఆ మెసేజెస్ వింటూ అతను ఆమెతో ఎలా లవ్ లో పడ్డాడనే డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ మూవీ తెరకెక్కింది.
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్ (Netflix)
భాష: ఇంగ్లీష్
రిలీజ్ డేట్: జూన్ 19, 2026
ఆండ్రీ ఈజ్ యాన్ ఇడియట్ (Andre Is An Idiot)
సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డు గెలుచుకున్న ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్ లో ప్రీమియర్ కానుంది. ఆండ్రీ రిక్కార్డి అనే వ్యక్తి లైఫ్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. తను ముందే ఊహించి, కాపాడుకోగలిగే ఒక ఆరోగ్య సమస్య వల్ల ఎదురైన తుది ప్రయాణాన్ని ఇందులో చాలా బాగా చూపించారు. ఇదో డాక్యుమెంటరీ సిరీస్.
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్ (Netflix)
భాష: ఇంగ్లీష్
రిలీజ్ డేట్: జూన్ 17, 2026
ఓయాసిస్ (Oasis)
ఒక లగ్జరీ రిసార్ట్ లో ఓ యువతి అనూహ్య పరిస్థితుల్లో మిస్ అవుతుంది. ఆ రిసార్ట్ స్టాఫ్ తో పాటు అక్కడికి వచ్చిన గెస్టులు కూడా ఈ కేసులో అనుమానితులుగా మారుతారు. ఆ మిస్టరీ ఎలా పరిష్కారం అయిందనే కాన్సెప్ట్ తో ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ థ్రిల్లర్ రాబోతోంది.
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్ (Netflix)
భాష: ఇంగ్లీష్
రిలీజ్ డేట్: జూన్ 19, 2026
హస్బెండ్స్ ఇన్ యాక్షన్ (Husbands in Action)
ఇది ఒక కొరియన్ యాక్షన్-కామెడీ మూవీ. కిడ్నాప్ అయిన తన ఎక్స్-వైఫ్ (మాజీ భార్య) ను కాపాడటానికి ఒక డిటెక్టివ్, ఆమె ప్రస్తుత భర్తతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేస్తారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ అండ్ కామెడీ సీన్స్ ఈ సినిమాకు హైలైట్.
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్ (Netflix)
భాష: కొరియన్
రిలీజ్ డేట్: జూన్ 19, 2026
ది ఏజెన్సీ: సీజన్ 2 (The Agency: Season 2)
హై-వోల్టేజ్ స్పై డ్రామా ‘ది ఏజెన్సీ: సీజన్ 2’. లండన్ కు తిరిగి వచ్చిన ఒక సీక్రెట్ సీఐఏ (CIA) ఆపరేటివ్ పాత లవ్ స్టోరీ మళ్లీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరూ అంతర్జాతీయ కుట్రలు, ప్రమాదకరమైన నెట్‌వర్క్ లో ఎలా ఇరుక్కుపోయారనేది ఈ సీజన్ లో చూడొచ్చు.
ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
భాష: ఇంగ్లీష్
రిలీజ్ డేట్: జూన్ 21, 2026