Niharika Konidela Pocket Rockets JD Chakravarthy: మెగా డాటర్ నిహారిక కొణిదెల నేతృత్వంలోని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నిర్మాణం నుంచి వస్తున్న తదుపరి చిత్రం కావడంతో టాలీవుడ్‌లో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.
అర్బన్ డ్రామాగా పాకెట్ రాకెట్స్

పాకెట్ రాకెట్స్ సినిమాకు రుద్ర ఆత్రి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. అర్బన్ డ్రామాగా తెరకెక్కుతోన్న పాకెట్ రాకెట్స్ సినిమా షూటింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర (పోస్ట్ ప్రొడక్షన్) పనుల్లో శరవేగంగా ముందుకుసాగుతోంది.
పాకెట్ రాకెట్స్ చిత్రంలో 'కమిటీ కుర్రోళ్లు' ఫేమ్ త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ కథానాయకులుగా నటిస్తుండగా, 'శుభం' ఫేమ్ శ్రియా కొంతం కథానాయికగా అలరించనుంది. వర్ధమాన నటీనటులతో పాటు సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ఒక కీలక పాత్రలో కనిపించనుండటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. .
పేదరికం, ఆశయం.. మధ్యలో ప్రమాదకరమైన జూదం!
జేడీ చక్రవర్తి నటనానుభవం వెండితెరపై సరికొత్త ఎనర్జీని తీసుకువస్తుందని చిత్రబృందం నమ్ముతోంది. 'పాకెట్ రాకెట్స్' కథాంశం ఒక పేద కుటుంబానికి చెందిన ప్రతిభావంతుడైన విద్యార్థి చుట్టూ తిరుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ, ఆర్థిక స్థోమత లేకపోవడం అతడికి పెద్ద అవరోధంగా మారుతుంది.
ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సులువైన మార్గంగా జూదాన్ని ఎంచుకుంటాడు ఆ విద్యార్థి. ఆ క్రమంలో ఒక క్రూరమైన, మాయగాడైన జూదం ముఠా నాయకుడి కంటపడతాడు. అక్కడి నుంచి అతడి జీవితం ఎలా మలుపు తిరిగింది? కష్టపడి సాధించాల్సిన భవిష్యత్తు కోసం ఎంచుకున్న తప్పుడు దారి అతడిని ఎలాంటి ప్రమాదంలోకి నెట్టింది? అనే కోణంలో తీవ్ర ఉత్కంఠభరితంగా సాగుతుంది.
బలమైన సాంకేతిక బృందం
ఒక మంచి జీవితం కోసం విలువలను పణంగా పెట్టాల్సి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూపే అర్బన్ థ్రిల్లర్‌గా పాకెట్ రాకెట్స్ చిత్రాన్ని మలిచారు. ఈ చిత్రాన్ని పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రమేష్ మాన్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
{{/usCountry}}ఒక మంచి జీవితం కోసం విలువలను పణంగా పెట్టాల్సి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూపే అర్బన్ థ్రిల్లర్‌గా పాకెట్ రాకెట్స్ చిత్రాన్ని మలిచారు. ఈ చిత్రాన్ని పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రమేష్ మాన్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
{{/usCountry}}సాంకేతిక విభాగంలో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఎడురోలు రాజు ఛాయాగ్రహణం సమకూరుస్తుండగా, జ్ఞాని సంగీతాన్ని ఇస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటింగ్, విష్ణు వర్ధన్ పుల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజేష్ లంక స్టంట్ మాస్టర్‌గా, జేడీ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
'కమిటీ కుర్రోళ్లు' విజయం తర్వాత మరో ప్రయత్నం
పబ్లిసిటీ బాధ్యతలను బియాండ్ మీడియాకు చెందిన ఎస్.కె. నాయుడు, ఫణి కందుకూరి చూసుకుంటున్నారు. యదు వంశీ దర్శకత్వంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది.
డిజిటల్ కంటెంట్ నుంచి
ఓటీటీ సిరీస్‌లు, డిజిటల్ కంటెంట్ నుంచి వెండితెరకు ప్రయాణమైన పింక్ ఎలిఫెంట్ సంస్థకు ఈ అవార్డు ఒక మైలురాయిగా నిలిచింది. ఆ వరుస విజయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు 'పాకెట్ రాకెట్స్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే విడుదల తేదీ, ఇతర వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.