పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మాతలుగా నిర్మించిన సినిమా నిలవే. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తి చేసుకుంది.
నిలవే రిలీజ్ డేట్

ప్రస్తుతం నిలవే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ క్రమంలో తాజాగా నిలవే రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ప్రేమికుల దినోత్సవం కానుకగా 2026 ఫిబ్రవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.
భావోద్వేగాలతో పాటు కొత్త ఆలోచనలు
బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందిన నిలవే సినిమా భావోద్వేగాలతో పాటు కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇలాంటి లవ్ డ్రామా చిత్రంలో సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించారు.
నిలవే ముఖ్య పాత్రలు
వీరు మాత్రమే కాకుండా హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు నిలవే సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. విభిన్నమైన పాత్రలతో ప్రతి నటుడు తనదైన ముద్ర వేయనున్నారని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
మంచి మ్యూజికల్ హిట్‌గా
ఇక మంచి మ్యూజికల్ హిట్‌గా పేరు తెచ్చుకుంటూన్న నిలవే సినిమాకు కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు. అలాగే, దిలీప్ కే కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు. ఎమ్‌వి.ఎస్. భరద్వాజ్ రాసిన పాటలకు కోటి అదనపు లిరిక్స్ అందించారు. సత్య.జి ఎడిటింగ్‌తో సినిమా మరింత ఆసక్తికరంగా రూపుదిద్దుకుంది ఈ సినిమా.
నిలవే సాంకేతిక వర్గం
ప్రొడక్షన్ డిజైనర్స్గా కట్ట శివరామ కృష్ణ, జియా ఘోష్ పనిచేయగా, నూరా సయ్యద్ అదనపు ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. సహ-నిర్మాతలుగా వెంకట్ కొణకండ్ల, సంజనా కృష్ణ వ్యవహరించిన ఈ చిత్రం కంటెంట్ పరంగా ప్రత్యేకంగా నిలుస్తుందని, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
వాలంటైన్స్ డే కోసం
{{/usCountry}}ప్రొడక్షన్ డిజైనర్స్గా కట్ట శివరామ కృష్ణ, జియా ఘోష్ పనిచేయగా, నూరా సయ్యద్ అదనపు ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. సహ-నిర్మాతలుగా వెంకట్ కొణకండ్ల, సంజనా కృష్ణ వ్యవహరించిన ఈ చిత్రం కంటెంట్ పరంగా ప్రత్యేకంగా నిలుస్తుందని, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
వాలంటైన్స్ డే కోసం
{{/usCountry}}మొత్తంగా, కొత్తదనంతో పాటు భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన నిలవే చిత్రం ఫిబ్రవరి 13న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైందని మేకర్స్ చెప్పారు. కాబట్టి వాలంటైన్స్ డేకి ప్రేమికుల కోసం ఓ తెలుగు సినిమా వచ్చేస్తోందని తెలుస్తోంది.