నిన్ను కోరి డిసెంబర్ 10 ఎపిసోడ్: చంద్ర ఛాలెంజ్-శాలిని మాట‌లు రికార్డు చేసేలా పెన్ కెమెరాతో ప్లాన్‌

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 10 ఎపిసోడ్ లో ముందే డాక్టర్ ను ప్రిపేర్ చేసి పెట్టానని శాలిని ట్విస్ట్ ఇస్తుంది. కొడుకులను ఇలా చూసి రఘురాం బాధ పడతాడు. క్రాంతి చేతులతోనే శాలిని మెడ పట్టి గెంటిస్తానని చంద్ర ఛాలెంజ్ చేస్తుంది. శాలినిని ఎక్స్ పోజ్ చేసేందుకు పెన్ కెమెరాతో మరో ప్లాన్ వేస్తారు.

Published on: Dec 10, 2025 7:35 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 10 ఎపిసోడ్ లో తప్పు తనది కాదు నీది. ఇందుకేనా మీరు హాస్పిటల్ కు వచ్చింది? తప్పు చేసిన వాళ్లు ఎవరో వాళ్లకు తెలుసు. అది బయటపడ్డ రోజూ నేనే శిక్షిస్తా. శాలిని కడుపు పోవడానికి చంద్ర కారణమనే నింద భరించడం కష్టమే. అది నిజమని నేనూ అనుకోవడం లేదు. అది అబద్దం చేసే ప్రయత్నంలో నువ్వు తప్పు చేయకు. విరాట్ కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. మీ నాన్న కోసమైన మనస్పర్థలు మానుకోండని జగదీశ్వరి అంటుంది.

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)

ముందే ఊహించానని శాలిని

శాలిని చిటికెలు వేసుకుంటూ చంద్రకళ దగ్గరికి వస్తుంది. పంతానికి పోకుండా తట్టాబుట్టా సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి. నా మీద గెలవడం ఇంపాజిబుల్ అని శాలిని అంటుంది. ఏది ఇంపాజిబుల్ కాదని చంద్ర చెప్తుంది. నేను ముందే ఊహించి లేడీ డాక్టర్ ను చాలా ప్రిపేర్డ్ గా ఉంచానని శాలిని ట్విస్ట్ ఇస్తుంది. డాక్టర్ తో కలిసి చేసిన ప్లాన్ ను చంద్రకు చెప్తుంది శాలిని.

తెలివికి జోహార్లు

చాలా బాగా ప్లాన్ చేశావ్ శాలిని. నీ తెలివికి జోహార్లు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు. నీ గోల్ ఏంటో అర్థం కావడం లేదు. ఏదైనా అయితే నేను, మా ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోతాం. అన్నదమ్ములు విడిపోతారు. అత్తమామలను కూడా క్రాంతికి దూరం చేస్తావు. కానీ క్రాంతిని దూరం చేసుకోగలవా? క్రాంతి వచ్చి సారీ అంటే చాలు ఫ్యామిలీ మొత్తం కలిసిపోతుంది. నువ్వు మెడలో తాళితో ఒంటరిగా బతుకుతావా? నీ పగకు అర్థమే లేదు కదా. నీకు క్రాంతి అంటే ఏ మూలనో ప్రేమ ఉందని చంద్ర అంటుంది.

క్రాంతి ఛీ కొట్టేలా

నీ రహస్యాలు బయటపెట్టి క్రాంతి ఛీ కొట్టేలా చేస్తా. అతని చేతితోనే మెడ పట్టి బయటకు గెంటేలా చేస్తా. దమ్ముంటే నన్ను ఆపు శాలిని అని ఛాలెంజ్ చేస్తుంది చంద్ర. బయట బాధలో ఉన్న క్రాంతిని చూసి అసలు ఏం జరిగింది? అని జగదీశ్వరిని అడుగుతాడు రఘురాం. ఏ విషయంలో గొడవ పడ్డారని అడిగితే, చిన్నా పెద్దా తేడా లేకుండా గొడవలు పెట్టుకుంటున్నారని జగదీశ్వరి చెప్తుంది. నా ముందు నటిస్తున్నారని నాకు అర్థమవుతోందని రఘురాం అంటుంటే విరాట్ అది ఉంటాడు.

నిజంగానే నాకు ఏదైనా జరిగితే వాళ్లు కలిసిపోతారా? అని రఘురాం అంటాడు. ఇలాంటి విషయాల గురించి ఆలోచించకండి. వాళ్లు రేపైనా కలుసుకుంటారు. కానీ మీకేమైనా అయితే నేను తట్టుకోలేనని జగదీశ్వరి బాధ పడుతుంది.

పెన్ కెమెరాతో

నాన్నకు అన్నీ తెలుసు చంద్ర. ఏం తెలియనట్లు యాక్ట్ చేస్తున్నారు. మా మధ్య దూరం రోజురోజుకూ పెరుగుతుందని విరాట్ అంటాడు. శాలినిని ఎక్స్ పోస్ చేసేందుకు మనం ట్రై చేస్తూనే ఉండాలి. డాక్టర్ ను శాలిని ముందే ప్రిపేర్ చేసి పెట్టింది. శాలిని ఓపెన్ గా మాట్లాడేది నా ముందే బావ అని చంద్ర అంటుంది.

నువ్వు శాలినిని మాటల్లో పెట్టి నిజాలు చెప్పించు, అది రికార్డు చేస్తే మనకు ప్రూఫ్ దొరికినట్లేనని భార్యకు పెన్ కెమెరా ఇస్తాడు విరాట్. మరోవైపు శ్రుతిని పెళ్లికి తొందరపెట్టాలని జల్ రాజ్ అనుకోవడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.