...
...
Next Story

నిన్ను కోరి డిసెంబర్ 16 ఎపిసోడ్: శ్రుతి పెళ్ల‌ని తెలుసుకున్న కామాక్షి-శాలిని ప్లాన్ ప్ర‌కారం చంద్ర‌కు ఫోన్‌-తాళితో రాజ్

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 16 ఎపిసోడ్ లో గుడిలో శ్రుతి పెళ్లి అని కామాక్షికి తెలుస్తుంది. చంద్రను ఇరికించాలని ఆమెకు మధును ఫోన్ చేయమంటుంది శాలిని. మరోవైపు పెళ్లి ఎక్కడ? రాజ్ ఎవరు? అని రఘురాం ఫ్యామిలీ వెతుకుతుంది.

Published on: Dec 16, 2025, 07:20:09 IST
Advertisement

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 16 ఎపిసోడ్ లో చంద్ర గురించి మాయ మాటలు చెప్తూ క్రాంతిలో విషం నింపుతూనే ఉంటుంది శాలిని. ఆ మహాతల్లి కారణంగానే అన్నదమ్ముల మధ్య డిఫరెన్స్ వచ్చాయి శాలిని. నిజంగా అన్నయ్య అన్నట్లు పంతాలు, పట్టింపులు మర్చిపోయి క్షణాల్లో కలిసిపోయే రోజులు మళ్లీ వస్తే బాగుండని క్రాంతి అంటాడు. బయట నుంచి అందంతా విన్న విరాట్ అలాంటి రోజులు వస్తాయని అనుకుని వెళ్లిపోతాడు.

కామాక్షి కంగారు

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

గుడిలో రాజ్, శ్రుతి పెళ్లి జరుగుతుంది. రాజ్ తొందరపెడుతుంటే, శ్రుతి మాత్రం నెమ్మదిగానే చేయమంటుంది. శాలినికి మధు ఫోన్ చేసి ముహూర్తానికి ఇంకా గంట టైమ్ ఉందని చెప్తాడు. కాసేపు ఆగి చంద్రకళకు కాల్ చేసి చెప్పమంటుంది శాలిని. మరోవైపు ఇంట్లోనే ఉన్న శ్రుతి ఫోన్ కు ఫ్రెండ్ కాల్ చేసి గుడిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్నావ్ కదా అని చెప్తుంది. ఆ మాటలు కామాక్షి విని కంగారు పడుతుంది.

చేపలు అమ్మేవాడు

అందరిని పిలిచి శ్రుతి పెళ్లి చేసుకుంటుందంటా అని చెప్తూ కామాక్షి టెన్షన్ పడుతుంది. రేపు పెళ్లి చేసుకుంటానని శ్రుతి నాతో చెప్పింది. కానీ సరదాగా చెప్తుందనుకున్నానని శ్యామల అంటుంది. శ్రుతికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నేను చూశానని రఘురాం చెప్తాడు. శ్రుతి ఫోన్ చెక్ చేస్తే తెలుస్తుందని విరాట్ అంటాడు. ఫోన్లో రాజ్ ఫొటో చూస్తారు. ముందు రాజ్ చేపలు అమ్మేవాడా? కాదా? అని తెలుసుకుందామని అందరూ వెళ్తారు. వీళ్లను డైవర్ట్ చేయాలని శాలిని అనుకుంటుంది.

గుడికి చంద్ర

బేబీ అని శ్రుతి ఫోన్లో ఉన్న నంబర్ కు కాల్ చేస్తారు. కానీ రాజ్ పెళ్లి అయేంతవరకూ ఎవరి కాల్ లిఫ్ట్ చేయొద్దని కట్ చేస్తాడు. ఆటోలో చంద్ర రామాలయానికి వెళ్తుంటుంది. మరోవైపు రాజ్, శ్రుతి పెళ్లి తంతు సాగుతుంది. అప్పుడే చంద్ర గుడికి వస్తుంది. రాజ్ తాళి తీసుకుంటాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe