నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ లో శాలిని ప్రెగ్నెన్సీ అబద్ధమని చంద్రకళ తెలుసుకుంటుంది. ఈ విషయం బయట పెడితే ఇంట్లోవాళ్లు ఏమైపోతారు? ముఖ్యంగా క్రాంతి తట్టుకోగలడా? అని ఆలోచించి చంద్ర ఇంటికి వెళ్తుంది. శాలినిని బయటకు తీసుకొస్తాడు క్రాంతి.
రఘురాం కనిపించలేదని

అక్కడే శాలినిని జూబ్లీహిల్స్ ఎటు వెళ్లాలని రఘురాం అడుగుతాడు. ఈ మనిషి మర్చిపోయారని శాలిని వదిలించుకోవాలని చూస్తుంది. విరాట్ కనిపించలేదని బాధతో ఇంటికి వచ్చి తల్లి జగదీశ్వరికి చెప్తాడు. క్రాంతి ఇంటికి వచ్చి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నేను కూడా మీకు పరాయివాణ్నేనా? అని అడుగుతాడు. ఏంటి క్రాంతి అసలే మామయ్య కనిపించడం లేదనే టెన్షన్ లో ఉంటే చెప్పలేదని సీరియస్ అవుతావు అని శాలిని అంటుంది.
అడ్రస్ చూసి
కాసేపు వెయిట్ చేసి పోలీస్ కంప్లయింట్ ఇద్దామని శాలిని అంటుంది. మామయ్య రాకుండా రాంగ్ అడ్రస్ చెప్పి కన్ ఫ్యూజ్ చేశానని అనుకుంటుంది శాలిని. మరోవైపు జూబ్లీహిల్స్ ఎలా వెళ్లాలని రోడ్ మీద వెళ్లే వాళ్లను అడుగుతాడు రఘురాం. సౌండ్ కు మళ్లీ డైవర్ట్ అవుతాడు రఘురాం. అతని జేబులో నుంచి అడ్రస్ చిట్టి కింద పడిపోతుంది. అందులో అడ్రస్ చూసి ఆటోలో తీసుకెళ్తానని ఆ వ్యక్తి అంటాడు.
తిరిగొచ్చిన రఘురాం
మరోవైపు పోలీస్ కంప్లయింట్ ఇచ్చేందుకు క్రాంతితో కలిసి శ్యామల వెళ్తుంది. అప్పుడే చంద్రకళ వస్తుంది. మామయ్య తిరిగి వస్తాడనే కాన్ఫిడెన్స్ నాకుందని చంద్ర అంటుంది. అప్పుడే ఆటోలో రఘురాం వస్తాడు. జేబులో అడ్రస్ ఎవరు రాసి పెట్టారని అడుగుతారు. నేనే అని చంద్ర చెప్తుంది. నువ్వు చాలా మంచి పని చేశావమ్మా అని రఘురాం అంటాడు.
గ్రేట్ చంద్ర
శ్రుతి ఎవరితోనో ఫోన్లో క్లోజ్ గా మాట్లాడుతుంటే డౌట్ వచ్చి ఫాలో అవుతూ వెళ్లా. డిటెక్టివ్ లా వచ్చి పట్టుకోవాలని అనుకున్నా. కానీ మధ్యలో మెమొరీ డైవర్ట్ అయిందని రఘురాం చెప్తాడు. చంద్ర నీ వల్లే నాన్న ఇంటికి తిరిగి రాగలిగాడు. నువ్వు గ్రేట్ చంద్ర. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అందరి ముందు కావాలనే విరాట్ అంటాడు.
నువ్వు మనిషివేనా?
{{/usCountry}}శ్రుతి ఎవరితోనో ఫోన్లో క్లోజ్ గా మాట్లాడుతుంటే డౌట్ వచ్చి ఫాలో అవుతూ వెళ్లా. డిటెక్టివ్ లా వచ్చి పట్టుకోవాలని అనుకున్నా. కానీ మధ్యలో మెమొరీ డైవర్ట్ అయిందని రఘురాం చెప్తాడు. చంద్ర నీ వల్లే నాన్న ఇంటికి తిరిగి రాగలిగాడు. నువ్వు గ్రేట్ చంద్ర. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అందరి ముందు కావాలనే విరాట్ అంటాడు.
నువ్వు మనిషివేనా?
{{/usCountry}}శాలిని గదిలోకి వచ్చి చంద్ర డోర్ లాక్ చేస్తుంది. శాలిని రెండు చెంపలు వాయించేస్తుంది చంద్ర. ఈ ఇంటి వారసుడు నా కడుపులో పెరుగుతున్నాడు వాడికి ఏమైనా అయిందో అని శాలిని అనగానే ఆమె పీకను పట్టుకుంటుంది చంద్ర. ఇదంతా నాటకమని నాకు తెలియదు అనుకుంటున్నావా? కడుపే రాకుండా బిడ్డ ఎక్కడి నుంచి వస్తాడు? ఎవరూ కనిపెట్టలేరనుకున్నావు కదా. పొద్దున ఇల్లంతా పరుగులు పెట్టావు. చాటుగా బొప్పాయి ముక్కలు తిన్నావు. అసలు నువ్వు మనిషివేనా? అని చంద్ర ఫైర్ అవుతుంది.
నా ప్రెగ్నెన్సీ అబద్ధమని తెలిసి ఏం చేస్తావు? నా గురించి బయట పెట్టలేవని శాలిని అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.