నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 25 ఎపిసోడ్ లో మా వాడితో శ్రుతి పెళ్లిలో చంద్రకళ తప్పు లేదు. మా అబ్బాయి శ్రుతిని ప్రేమించాడు. పెద్దవాళ్లు ఒప్పుకోరని గుడిలో పెళ్లి చేయించా. ఇందులో చంద్ర చేసిందేం లేదు. ఈ అమ్మాయి చాలా మంచిది. ఒక్కసారి క్షమించి చూడు అని విరాట్ కు చెప్తుంది సరోజా.
శాలినికి షాక్

గదిలోకి వెళ్లిన విరాట్ ను సరోజాలా మాట్లాడుతూ చంద్రకళ ఆటపట్టిస్తుంది. అప్పుడే శాలిని రావడం చూసి తను ఇటువైపు రాకుండా చిన్న షాక్ ఇద్దామని చంద్ర ప్లాన్ చేస్తుంది. కరెంట్ వైర్ బయటకు పెట్టి స్విచ్ వేస్తుంది. అది చూసుకోకుండా డోర్ దగ్గరకు వచ్చిన శాలిని వైర్ మీద కాలు పెట్టడంతో షాక్ కొట్టి అరుస్తుంది. అందరూ కంగారుగా వస్తే బల్లి మీద పడితే అరిచానని కవర్ చేస్తుంది.
చంద్ర వార్నింగ్
గోడలకు అతుక్కుని తిరగకు అని జగదీశ్వరి అంటే, కరెక్ట్ గా చెప్పారని చంద్రకళ అంటుంది. లోపల ఏం మాట్లాడుకుంటున్నామో వింటున్నావా? ఆయన తిడుతుంటే నేను మౌనంగా పడుతున్నాననే కదా నీకు డౌట్ వచ్చింది. ఈ ఇంట్లో గొడవలు పెరగొద్దని మౌనంగా ఉంటున్నా. ఇంకోసారి ఇలా చేస్తే కరెంట్ వోల్టేజీ పెంచి కాళ్లు, చేతులు పడిపోయేలా చేస్తానని చంద్ర వార్నింగ్ ఇస్తుంది.
చంద్ర కోడలు మాత్రమే
జగదీశ్వరి దగ్గరకు వచ్చి పొద్దున అన్న మాటలను గుర్తు చేసుకుని శ్యామల బాధపడుతుంది. మరి చంద్రను ఎన్ని మాటలు అంటున్నారు. ఈ రోజు వ్రతం చెడిపోయేలా అడ్డుకుందనే మెచ్చుకున్నానని జగదీశ్వరి చెప్తుంది. చంద్ర నీ మేనకోడలు కాబట్టి ఇంకా ప్రేమ ఉందా? అని శ్యామల అడుగుతుంది.
మేన సంబంధం మీద ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. కానీ దాని వల్ల ఏం చేసినా చూస్తూ ఉండలేను. విరాట్ భార్యగా మాత్రమే చంద్రను ఇంట్లో ఉండనిచ్చా. నా భర్తపై హత్యా ప్రయత్నం చేసినప్పుడే ఆ ఇంటివాళ్లతో సంబంధాలు తెగిపోయాయి. చంద్ర కేవలం నా కోడలు అంతే. తప్పు చేస్తే నిందిస్తానని జగదీశ్వరి చెప్తుంది. ఈ మాటలు విన్న చంద్ర బాధపడుతుంది.
మరో ప్లాన్
{{/usCountry}}మేన సంబంధం మీద ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. కానీ దాని వల్ల ఏం చేసినా చూస్తూ ఉండలేను. విరాట్ భార్యగా మాత్రమే చంద్రను ఇంట్లో ఉండనిచ్చా. నా భర్తపై హత్యా ప్రయత్నం చేసినప్పుడే ఆ ఇంటివాళ్లతో సంబంధాలు తెగిపోయాయి. చంద్ర కేవలం నా కోడలు అంతే. తప్పు చేస్తే నిందిస్తానని జగదీశ్వరి చెప్తుంది. ఈ మాటలు విన్న చంద్ర బాధపడుతుంది.
మరో ప్లాన్
{{/usCountry}}రూమ్ లోకి వెళ్లాక సీరియస్ నెస్ పెంచాలి చంద్ర అని విరాట్ అంటాడు. శాలినికి ఎందుకు నమ్మకం కలగట్లేదు? ఆమెను నమ్మించాలి. అప్పుడే సక్సెస్ అవుతాం. అందుకే ఆలోచిస్తున్నానని విరాట్ అంటాడు. నువ్వు నన్ను కొట్టాలి బావ అని చంద్ర అంటుంది. నువ్వు నన్ను కొట్టినట్లు అందరినీ నమ్మించాలని చెప్తుంది.
పొద్దున తలకు బ్యాండేజీతో మామయ్య ముందుకు వెళ్తా. నువ్వు కొట్టావని చెప్తా. అప్పుడు మామయ్య పిలిచి తిడతారని చంద్ర అంటుంది. ఇప్పుడు కాస్త రొమాన్స్ కావాలని విరాట్ అడిగితే, షాక్ ట్రీట్మెంట్ ఇస్తానని చంద్ర అంటుంది.
రఘురాం సీరియస్
పొద్దున తలకు బ్యాండేజీతో రఘురాం, జగదీశ్వరి ముందుకు వెళ్తుంది చంద్ర. ఏమైందంటే? రాత్రి మీ అబ్బాయి నన్ను కొట్టాడని చంద్ర చెప్తుంది. రఘురాం కోపంగా విరాట్ ను పిలుస్తాడు. నాకు ఎదురు తిరిగింది కాబట్టి కొట్టానని విరాట్ చెప్తాడు. భార్యను ప్రేమతో గెలవాలి కానీ కోపంతో కాదు. చంద్రకు సారీ చెప్పమని రఘురాం అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.