నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 17 ఎపిసోడ్ లో.. శ్యామల, కామాక్షి కలిసి వాలెంటైన్స్ డే ఏర్పాట్లు చేశారు. చంద్రకళ, శాలిని కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారని కామాక్షి కోప్పడుతుంది. జల్ రాజును చూపించి, ఇతడినే పెళ్లి చేసుకోమని మాత్రం శ్రుతికి చంద్ర, శాలిని చెప్పలేదు కదా అని శ్యామల అంటుంది.
ప్రకాష్ గెటప్ లో అర్జున్

అత్త నీకో విషయం చెప్తా గుండె రాయి చేసుకుని వినాలి. మన ఇంటికి వచ్చిన ప్రకాష్ అసలు డాక్టరే కాదు. ఆయన ప్రకాషే కాదు అని విరాట్ అంటాడు. ప్రకాష్ గెటప్ లో వచ్చింది నా బిజినెస్ పార్ట్ నర్ అర్జున్ అని చంద్రకళ చెప్పేసరికి శ్యామల హార్ట్ బ్రేక్ అవుతుంది. అర్జున్ రావడం, ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ శ్యామలకు విరాట్ చెప్తాడు. విరాట్, చంద్ర చెవులు పట్టుకుని శ్యామల పిండేస్తుంది.
రాజ్ సర్ ప్రైజ్
మరోవైపు ఫోన్లో మీమ్స్ చూసుకుంటూ శ్రుతి నవ్వుకుంటుంది. అప్పుడే కేక్ తీసుకుని వచ్చి జల్ రాజ్ సర్ ప్రైజ్ అని అంటాడు. ఈ రోజు వాలెంటైన్స్ డే అని కేక్ ను రాజ్ చూపిస్తాడు. నిజంగా నా కోసమేనా? నిజంగా సర్ ప్రైజ్ ఫీల్ అయ్యా అని శ్రుతి అంటుంది. రాజ్ ప్రెషప్ అయి వస్తానని వెళ్తాడు.
వాలెంటైన్స్ డే వేడుకలు
ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చి రఘురాం అసలు సంగతి మర్చిపోతాడు. ఈ హడావిడి ఏంటీ? అని అడుగుతాడు. అప్పుడు అందరూ వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుందామని చెప్పారు కదా అని రఘురాంకు గుర్తు చేస్తారు. భలే ప్లాన్ చేశావ్ నాన్న అని విరాట్ అంటాడు. మామయ్య ఈ రోజు అత్తయ్యకు ప్రపోజ్ చేశారా? లేదా? అని చంద్ర అడిగితే, ఊరుకో చంద్ర అని జగదీశ్వరి సిగ్గు పడుతుంది.
క్రాంతి ఫైర్
{{/usCountry}}ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చి రఘురాం అసలు సంగతి మర్చిపోతాడు. ఈ హడావిడి ఏంటీ? అని అడుగుతాడు. అప్పుడు అందరూ వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుందామని చెప్పారు కదా అని రఘురాంకు గుర్తు చేస్తారు. భలే ప్లాన్ చేశావ్ నాన్న అని విరాట్ అంటాడు. మామయ్య ఈ రోజు అత్తయ్యకు ప్రపోజ్ చేశారా? లేదా? అని చంద్ర అడిగితే, ఊరుకో చంద్ర అని జగదీశ్వరి సిగ్గు పడుతుంది.
క్రాంతి ఫైర్
{{/usCountry}}రఘురాం-జగదీశ్వరి ముందు కేక్ కట్ చేస్తారు. ఆ తర్వాత చంద్రకళ-విరాట్ కేక్ కట్ చేసి తినిపించుకుంటారు. క్రాంతికి కేక్ కట్ చేయమని చెప్తారు. కానీ క్రాంతి కేక్ ను నేలకేసి కొడతాడు. పగ కోసం ప్రేమను వాడుకున్న ఇలాంటి స్వార్థపరురాలితో వాలెంటైన్స్ వేడుకలు చేసుకుంటే అది ప్రేమకే అవమానం. శాలినిది కపట ప్రేమ. ఈ రాక్షసి అసలు రూపం తెలిసినప్పుడే తన మీద ఉన్న ప్రేమ చచ్చిపోయిందని క్రాంతి అంటాడు.
మేకవన్నె పులి
శాలిని తప్పు తెలుసుకుంది. ఆమె మీద కోపం చూపించడం కరెక్ట్ కాదని జగదీశ్వరి అంటుంది. ఆమె మారినా నేను ఈ జన్మలో క్షమించలేను. ఇలాంటి మేకవన్నె పులితో నేను కలిసి ఉండలేను. ఈ విషయంలో నా మనసు మారదు. నేను నటించలేనని క్రాంతి వెళ్లిపోతాడు.
రాజ్ వచ్చేలోపు శ్రుతి కేక్ మొత్తం తినేస్తుంది. శ్రుతి తిండిపోతు అని సరోజ తిడుతుంది. నాకు దిష్టి పెడతావా అని శ్రుతి ప్లాన్ చేస్తుంది. మీ కొడుకు కేక్ తెచ్చాడు అని ఒక ముక్క పెడుతుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.