నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 24 ఎపిసోడ్ లో.. గూండాలతో విరాట్ ఫైట్ చేస్తాడు. రౌడీలను చితక్కొడతాడు. విరాట్ కు కూడా దెబ్బలు తగులుతాయి. స్పృహ కోల్పోయి పడిపోతాడు. గుడిలో ఉన్న వాళ్లు విరాట్ ను లేపుతారు. అప్పుడే విరాట్ కు చంద్రకళ నుంచి కాల్ వస్తుంది.
శివుడికి అభిషేకం

నాకు ఇక్కడే లేట్ అవుతుంది. శివుడికి అభిషేకం చేయిస్తున్నానని.. శాలిని, క్రాంతితో ఇంట్లో పూజ కంప్లీట్ చేయించమని చంద్రకళకు విరాట్ చెప్తాడు. మరోవైపు శ్రుతితో మాట్లాడుతూ కామాక్షిపై రాజ్ పొగడ్తలు కురిపిస్తాడు. అప్పుడే అప్పుల అప్పారావు ఫోన్ చేసి జల్ రాజ్ ను అప్పు తిరిగి ఇవ్వమని అడుగుతాడు. ఇప్పుడు నా రేంజే వేరు అని రాజ్ బిల్డప్ ఇస్తాడు.
శాలిని, క్రాంతి కలిసి
బావ అక్కడ అభిషేకం చేస్తున్నారు కదా. ఇక్కడ క్రాంతి, శాలిని కలిసి పూజ చేస్తారని చంద్రకళ అంటుంది. నేను శాలినితో కలిసి పూజ చేయను. ఇలాంటి వాళ్లతో పూజ చేసిన ఫలితం దక్కదని క్రాంతి అంటాడు. తనకో అవకాశం ఇవ్వాలి కదా అని జగదీశ్వరి, రఘురాం, చంద్రకళ, శ్యామల చెప్తారు. మీ అందరి కోసం చేస్తున్న పూజ అంతే కానీ శాలినిని క్షమించినట్లు కాదని క్రాంతి ఒప్పుకొంటాడు.
ఓ వైపు గుడిలో శివుడికి విరాట్ అభిషేకం, మరోవైపు ఇంట్లో క్రాంతి, శాలిని కలిసి పూజ కంప్లీట్ చేస్తారు. మరోవైపు రాజ్ ఇంట్లో కూడా పూజ జరుగుతుంది. కామాక్షి హారతి ఇస్తుంది. కామాక్షికి రాజ్, సరోజ పోటీపడి మరీ మర్యాదలు చేస్తారు.
భస్మంతో షాక్
పుట్టింటి నుంచి కామాక్షి ఏం తెచ్చిందో చూద్దామని రాజ్, సరోజా తెగ ఎగ్జైట్ అవుతారు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటిది దక్కదు. మీరు పుణ్యం చేసుకున్నారు. అని చేతిలో ఉన్న సంచిలో నుంచి బూడిదను కామాక్షి గాల్లో చల్లుతుంది. ఏంటీ బూడిదా? అని రాజ్, సరోజా షాక్ అవుతారు. సాక్షాత్తూ ఆ కాశీ విశ్వేశ్వరుణ్ని అలంకరించిన భస్మం ఇది అని కామాక్షి చెప్తుంది.
చంద్రకు థ్యాంక్స్
{{/usCountry}}పుట్టింటి నుంచి కామాక్షి ఏం తెచ్చిందో చూద్దామని రాజ్, సరోజా తెగ ఎగ్జైట్ అవుతారు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటిది దక్కదు. మీరు పుణ్యం చేసుకున్నారు. అని చేతిలో ఉన్న సంచిలో నుంచి బూడిదను కామాక్షి గాల్లో చల్లుతుంది. ఏంటీ బూడిదా? అని రాజ్, సరోజా షాక్ అవుతారు. సాక్షాత్తూ ఆ కాశీ విశ్వేశ్వరుణ్ని అలంకరించిన భస్మం ఇది అని కామాక్షి చెప్తుంది.
చంద్రకు థ్యాంక్స్
{{/usCountry}}థ్యాంక్స్ చంద్ర. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నీ కారణంగానే క్రాంతితో కలిసి పూజ చేశానని శాలిని అంటుంది. నా వల్ల కాదు మీ బావగారి వల్ల. ఆయన రావడం లేటవుతుందని చెప్పారు. మీతో పూజ చేయించమన్నారని చంద్ర చెప్తుంది. మీరందరూ నన్ను క్షమించారు కానీ క్రాంతి ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు. నా తప్పు వల్లే క్రాంతికి దూరమయ్యానని శాలిని అంటుంది.
దొంగ ప్రామిస్
ఇంక లైఫ్ లో నా వల్ల ఇంటికి ఏ సమస్య రాకుండా చూసుకుంటానని చంద్రపై శాలిని దొంగ ప్రామిస్ వేస్తుంది. నీకు నీ భర్త ఉండడు చంద్ర అని శాలిని అనుకుంటుంది. తలకు గాయంతో వచ్చిన విరాట్ ను చూసి అందరు కంగారు పడతారు. కానీ శాలిని షాక్ అవుతుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.