నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 6 ఎపిసోడ్ లో.. శాలిని ముఖానికి నల్ల రంగు పూసి మార్కెట్లోకి తీసుకెళ్తారు రాజ్, సరోజ, మరోవైపు విరాట్, చంద్రకళ భూమి పూజ చేస్తుంటారు. అప్పుడే తేజును తీసుకుని డాక్టర్ వస్తుంది. అది చూసి అర్జున్, విరాట్, చంద్ర షాక్ అవుతారు.
అర్జున్ కూతురు

అర్జున్ కాస్త ముందుకు వచ్చి ఎందుకు వచ్చావు తేజు? డాక్టర్ ఎందుకు తీసుకొచ్చారు? అని అడుగుతాడు. ఎవరో యాక్సిడెంట్ అయిందని చెప్తే వచ్చామని డాక్టర్ అంటుంది. అర్జున్ ఈ పాప నిన్ను నాన్న అని పిలుస్తుందేంటీ అని జగదీశ్వరి అడుగుతుంది. ఈ పాప నా కూతురే అని అర్జున్ నిజం చెప్పేస్తాడు. మరి మాకెందుకు చెప్పలేదని శ్యామల అడిగితే, నేను త్వరలో చచ్చిపోతానని నా గురించి ఎవరికీ చెప్పడు నాన్న అని తేజు అంటుంది.
తేజును ఆపిన శాలిని
తేజుకు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని అర్జున్ చెప్పగానే అందరూ బాధపడతారు. తేజును బయటకు తీసుకురావడం మంచిది కాదని ఎవరికి చెప్పను. మీ పూజ డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు. వెళ్తొస్తానని తేజును తీసుకుని అర్జున్ వెళ్లాలని చూస్తాడు. కానీ తేజును ఆపాలని శాలిని హాయ్ పాప అని పలకరిస్తుంది. పూజ చూసి వెళ్లమని ఆపుతుంది. తేజు కూడా ఉంటానని మొండిగా బిహేవ్ చేస్తుంది. రఘురాం వచ్చి మీరు పూజ పూర్తయ్యేసరికి ఉండాల్సిందేనని తేజును తీసుకుని పూజ దగ్గరకు వస్తాడు.
చంద్రను అమ్మా అని
ఏం చేయాలోనని విరాట్, చంద్రకళ టెన్షన్ పడతారు. చంద్రకళ దాక్కునే ఉంటుంది. కానీ పూజ చేయాల్సి ఉండటంతో చంద్రకళ ముందుకు వస్తుంది. వెంటనే తేజు అమ్మా అంటూ చంద్రకళ దగ్గరకు పరుగెత్తి హత్తుకుంటుంది. అదేంటి అర్జున్.. మీ పాప చంద్రను అమ్మా అంటుందని జగదీశ్వరి అడుగుతుంది. కాస్త ఓపికగా ఉండండి అంతా క్లియర్ అవుతుందని అర్జున్ చెప్తాడు.
{{/usCountry}}ఏం చేయాలోనని విరాట్, చంద్రకళ టెన్షన్ పడతారు. చంద్రకళ దాక్కునే ఉంటుంది. కానీ పూజ చేయాల్సి ఉండటంతో చంద్రకళ ముందుకు వస్తుంది. వెంటనే తేజు అమ్మా అంటూ చంద్రకళ దగ్గరకు పరుగెత్తి హత్తుకుంటుంది. అదేంటి అర్జున్.. మీ పాప చంద్రను అమ్మా అంటుందని జగదీశ్వరి అడుగుతుంది. కాస్త ఓపికగా ఉండండి అంతా క్లియర్ అవుతుందని అర్జున్ చెప్తాడు.
{{/usCountry}}అయిపోయావ్ చంద్ర, అడ్డంగా దొరికిపోయావని శాలిని అనుకుంటుంది. శాలిని పాపను ఆపి మరీ అన్ని విషయాలు చెప్పిస్తుంది. ఏమిటి ఇదంతా, నాకేం అర్థం కావడం లేదని జగదీశ్వరి అంటుంది. మీకు చంద్ర మీద కోపం రావడం సహజమే. కానీ ఇప్పుడు నిజాలు తెలిస్తే పాప ప్రాణానికే ప్రమాదమని అర్జున్ అంటాడు. పాపను విరాట్ తో మాట్లాడమని పంపించి చంద్ర నిజం చెప్తుంది.
నిజం చెప్పిన చంద్ర
పాప నన్ను చూసి తన కన్నతల్లి అనుకుంది. అది నిజం కాదని చెప్తే ఆ పసి మనసు తట్టుకోలేక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ భయంతోనే తేజుకు తల్లిగా యాక్ట్ చేస్తున్నా. ఈ నాటకం వెనుక పాప కోలుకోవాలనే ఉద్దేశం తప్ప దురుద్దేశం లేదు. పూజ పూర్తయ్యాక మీ సందేహాలన్నింటికీ సమాధానాలు చెప్తానని చంద్ర రిక్వెస్ట్ చేస్తుంది.
తేజును తీసుకుని అర్జున్ వెళ్లిపోతాడు. ఎవరు లేని అర్జున్ కు పాప ఉండటం ఏంటీ? నువ్వు తల్లిగా నటించడం ఏంటో? అని శాలిని అడుగుతుంది. తల్లిగా అంటే పగలు, రాత్రి వాళ్ల ఇంట్లోనే ఉంటుందా ఏంటీ? అని అక్కడికి వచ్చిన ఆడవాళ్లు అడుగుతారు. ముందు పూజ కంప్లీట్ చేద్దామని విరాట్ అరుస్తాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.