నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సైకియార్టిస్ట్ ప్రకాష్‌కు ఫుడ్ పాయిజన్ అవుతుంది. తనకు చిన్న హెల్త్ ఇష్యూ ఉందని, ఇలా చెమటలు పట్టేసి కిందపడిపోతుంటాను అని ప్రకాష్ చెబుతాడు. డాక్టర్ రెస్ట్ తీసుకుంటారు అని క్రాంతి చెప్పడంతో అంతా వెళ్లిపోతారు. శాలిని నా వీక్‌నెస్ తెలిసి దెబ్బ కొట్టింది. తనతో జాగ్రత్తగా ఉండాలని అర్జున్ అనుకుంటాడు.
క్రాంతి శాలిని హనీమూన్

తర్వాత క్రాంతిని పిలిచిన రఘురాం తనకు ఓ విషయం గుర్తుకు వచ్చిందని, క్రాంతి మాల్దీవ్స్ హనీమూన్ గురించి చెబుతాడు. డాక్టర్ చెప్పినట్లు చేస్తే అంతా గుర్తుకు వస్తుంది. క్రాంతి వాళ్లకు హనీమూన్‌కు రెండు టికెట్స్ వేయమని విరాట్‌కు చెబుతాడు రఘురాం. మేము కూడా హనీమూన్‌కు వెళ్లలేదు. మేమంటే ప్రేమ లేదా అని చంద్రకళ అనడంతో వాళ్లతోపాటే మీరు కూడా వెళ్లండని రఘురాం అంటాడు.
నాకు నీతో హనీమూన్‌కు రావాలని లేదు అని విరాట్ వద్దంటాడు. శాలిని కూడా హనీమూన్‌కు వెళ్లే మూడ్ లేదంటుంది. అంతా వెళ్లమని చెబుతారు. సడెన్‌గా అంటే ఎలా, ముంబై ప్రాజెక్ట్ గురించి ఎలా అని శాలిని అంటుంది. ఫోన్‌లో మ్యానేజ్ చేయొచ్చని క్రాంతి అంటే.. డాక్టర్ గారికి బాగా లేనప్పుడు ఎలా వెళ్తాం, మామయ్య పూర్తిగా కోలుకున్నాక రెండు రోజుల తర్వాత వెళ్దాం అని శాలిని అంటుంది.
పని పూర్తి చేశాకే
డాక్టర్ ప్రకాష్ వల్లే అంతా గుర్తుకు తెచ్చుకుగోలుగుతున్నాను అని అంతా పొగుడుతారు. అంతా క్రాంతికి థ్యాంక్స్ చెబుతారు. మరోవైపు అద్దంలో అర్జున్ చూసుకుంటే మా అత్తయ్యను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారా అని విరాట్ అంటాడు. తర్వాత ఇద్దరికి అర్జున్ థ్యాంక్స్ చెబుతాడు. శాలిని చాలా తెలివైనదని తను చేసిన ప్లాన్ గురించి చెబుతాడు అర్జున్.
మన ప్లాన్ ఆపేద్దామా అని విరాట్ అంటే.. దీనికే ఇలా అయితే ఎలా. మనం అనుకున్న పని పూర్తి చేశాకే వెళ్తానంటాడు అర్జున్. శాలినితో ఇంకాస్తా జాగ్రత్తగా ఉండాలని విరాట్, చంద్రకళ అంటారు. బిజినెస్ మానేసి ఇలాగే ఉండిపోతే బాగుంటుందని జోకులు వేసుకుంటారు. మరుసటి రోజు ఉదయం ప్రకాష్ కోసం పాటలు పాడుతుంది శ్యామల.
శాలిని టెన్షన్
{{/usCountry}}మన ప్లాన్ ఆపేద్దామా అని విరాట్ అంటే.. దీనికే ఇలా అయితే ఎలా. మనం అనుకున్న పని పూర్తి చేశాకే వెళ్తానంటాడు అర్జున్. శాలినితో ఇంకాస్తా జాగ్రత్తగా ఉండాలని విరాట్, చంద్రకళ అంటారు. బిజినెస్ మానేసి ఇలాగే ఉండిపోతే బాగుంటుందని జోకులు వేసుకుంటారు. మరుసటి రోజు ఉదయం ప్రకాష్ కోసం పాటలు పాడుతుంది శ్యామల.
శాలిని టెన్షన్
{{/usCountry}}ప్రకాష్‌కు శ్యామల కాఫీ ఇస్తుంది. ఇది ఒకతి ఛాన్స్‌లో డ్యాన్స్ వేస్తుంది అని కామాక్షి అంటుంది. మీ జ్ఞాపకాలను బయటకు తీసుకురావాలంటే కొత్త ప్లేస్‌కు తీసుకెళ్లాలి. అప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది, కానీ, ఎక్కడికి తీసుకెళ్లేది ఫిక్స్ కాలేదని ప్రకాష్ అంటాడు. రెడీ అయి వస్తానని రఘురాం వెళ్తాడు. ఆ మాటలు విన్న శాలిని ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తుంది.
శాలిని టెన్షన్ పడటం చూసిన ప్రకాష్ కావాలనే శాలినికి వినపడేలా డ్రామా చేస్తాడు. ఫ్రెండ్‌తో మాట్లాడినట్లు మాట్లాడి నా క్యాసినో పిచ్చితో డబ్బంతా పోగొట్టుకున్నాను. అమెరికా వాళ్లు ఊరుకుంటారా. నా డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. పేరులోనే క్యాష్ ఉంది. అప్పుల వాళ్లు తెగ వెంట పడుతున్నారు అని ప్రకాష్ అంటాడు.
అర్జున్ ట్రాప్‌లో శాలిని
ఇక్కడ ఒక పేషంట్ దొరికాడు. ఇక్కడ నేను ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని తెలిస్తే అరెస్ట్ చేస్తారు. వీళ్లను ఇలాగే నమ్మించి ఐదు లక్షల ఫీజు లాగేస్తాను. అమెరికా వెళ్లాలంటే మరో ఐదు లక్షలు కావాలి. నా లైసెన్స్ క్లియల్ అయ్యాక ఐదు లక్షలు ఇస్తాను అరెంజ్ చేయమని ప్రకాష్ మాట్లాడుతాడు. ఆ మాటలు విన్న శాలిని వెళ్లి అర్జున్‌తో మాట్లాడుతుంది.
మీరు మాట్లాడింది మొత్తం విన్నాను. ఆయన మెమోరీ మొత్తం ఇరేజ్ అయిపోవాలంటే నేను ఐదు లక్షలు ఇస్తానని శాలిని అంటుంది. 15 లక్షలు ఇస్తానంటే చేస్తాను అని ప్రకాష్ అంటాడు. సరే డీల్ అని శాలిని అంటుంది. అలా శాలినిని తన ట్రాప్‌లో పడేస్తాడు డాక్టర్ ప్రకాష్‌గా ఉన్న అర్జున్. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.