నిన్ను కోరి జనవరి 21 ఎపిసోడ్: విరాట్ ప్లాన్ ఫెయిల్-శాలిని మోసం తెలిసి చచ్చిపోతానంటున్న క్రాంతి-గెస్ట్ హౌజ్‌లో చంద్ర
నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 21 ఎపిసోడ్ లో మామయ్య మెమోరీ ఎరేజ్ చేయమని డాక్టర్ ను అడుగుతుంది శాలిని. మరోవైపు శాలిని తప్పు చేస్తే అందుకు కారణం తానేనని క్రాంతి కుమిలిపోతాడు. చచ్చిపోతానని అంటాడు. గెస్ట్ హౌజ్ కు వచ్చిన చంద్రకళ శాలినికి వార్నింగ్ ఇస్తుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 21 ఎపిసోడ్ లో గెస్ట్ హౌజ్ లో రఘురామ్ కు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు డాక్టర్ ప్రకాష్. అక్కడే శాలిని ఉంటుంది. రఘురాం ఓ టాబ్లెట్ వేసుకుంటాడు. మత్తులో పడిపోతాడు రఘురాం. ఎక్విప్మెంట్ నా మనిషి తెస్తున్నాడని ప్రకాష్ చెప్తే మత్తు దిగిపోతుందేమోనని శాలిని కంగారు పడుతుంది.

చంద్ర ఎంట్రీ
విరాట్, క్రాంతి కార్లో వస్తారు. అన్నయ్య శాలిని నిజంగానే మన ఫ్యామిలీని నాశనం చేసేందుకు వచ్చిందా? అనవసరంగా నిన్ను, వదినను నిందించానని క్రాంతి అంటాడు. మరోవైపు శాలిని టెన్షన్ పడుతుంది. అప్పుడే చంద్రకళ లోపలికి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుంది. మీరు టైంపాస్ చేస్తున్నారు. డబ్బు కోసం మోసం చేస్తున్నారని శాలిని అంటుంది. మీరు అనుకున్నట్లుగానే మామయ్యకు మెమోరీ ఎరేజ్ చేస్తానని ప్రకాష్ అంటుండగా చంద్ర వస్తుంది.
ఏం చేయలేవన్న శాలిని
నువ్వు చేసిన దారుణాలు అన్నీ కప్పి పుచ్చుకోవడానికి మామయ్య మెమోరీ మొత్తం ఎరేజ్ చేస్తున్నావా? అని శాలినిని ప్రశ్నిస్తుంది చంద్ర. అది అవసరం. ఇక్కడి దాకా వచ్చాక నువ్వేం చేయలేవు చంద్ర అని శాలిని అంటుంది. మరోవైపు క్రాంతి కారు ఆపమంటాడు. ప్రాణం పోతుందన్నయ్యా ఇంకా ప్రాజెక్ట్ అంటావేంటీ ప్లీజ్ కారు ఆపమని అరుస్తాడు క్రాంతి. కారు దిగి శాలిని కల్ ప్రిట్ అయితే నా పరిస్థితి ఏంటన్నయ్యా అని క్రాంతి అడుగుతాడు.
పగ సాధిస్తా
నేనే కల్ ప్రిట్ అని అందరి ముందు ఎలా ప్రూవ్ చేస్తావ్? అని చంద్రను శాలిని అడుగుతుంది. ఏం ప్రూఫ్ ఉంది నీ దగ్గర. నేను ఎక్కడ దొరకను చంద్ర. పగ సాధించి తీరుతానని శాలిని అంటుంది. మీ అమ్మను సంతోషపెట్టడం కోసం ఒక కుటుంబాన్ని కూల్చాలని చూస్తున్నావు. ప్రతిసారి తప్పు చేస్తూనే ఉన్నావు. పగ, ప్రతీకారం అంటూ మామయ్య జీవితాన్ని బలి తీసుకుంటున్నావని చంద్ర అంటుంది.
మోసం చేసి
శాలిని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుని ఉంటే నేను పాపం చేసినవాణ్ని అవుతాను. ప్రతి గొడవ నిజంగా శాలిని కారణంగానే జరిగిందేమో అనిపిస్తుంది అన్నయ్య అని విరాట్ తో క్రాంతి అంటాడు. క్రాంతిని గుప్పిట్లో నుంచి జారిపోనివ్వను. క్రాంతిని అడ్డం పెట్టుకునే ఆ ఇంటిని నాశనం చేస్తానని చంద్రతో శాలిని అంటుంది.
చచ్చిపోతానని
నా ఇంటిని కూల్చడానికి నేను కారణం కావొద్దు. మోసాన్ని ప్రేమ అనుకుని నేనే సాయపడ్డా. నేనే కదా నాన్నకు ఈ పరిస్థితి రావడానికి కారణం. అమ్మానాన్నకు నా ముఖం ఎలా చూపించాలి. శాలిని తప్పు చేసిందని తెలిస్తే నా ప్రాణాలు వదిలేస్తానన్నయ్యా అని క్రాంతి అంటాడు. లారీ ఢీకొట్టకుండా క్రాంతిని పక్కకు లాగేస్తాడు విరాట్. నేను నిజంగానే చచ్చిపోతానని క్రాంతి అంటాడు.
ఈ టైమ్ లో క్రాంతికి శాలిని గురించి తెలియడం కరెక్ట్ కాదని క్రాంతిని ఇంటికి తీసుకెళ్తాడు విరాట్. ఇప్పుడు నువ్వు నన్ను ఆపొచ్చు కానీ ఎప్పటికీ ఆపలేవు. డాక్టర్ తో చేయి కలిపానని అరిచినా ఎవరూ నమ్మరని శాలిని వెళ్లిపోతుంది. బావ క్రాంతిని తీసుకుని ఎందుకు రాలేదు? ఏదో జరిగి ఉంటుందని డాక్టర్ తో చంద్ర అంటుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












