నిన్ను కోరి జనవరి 6 ఎపిసోడ్: చంద్ర ఐడియా- రఘురాం,జగదీశ్వరి పెళ్లి రీక్రియేట్- గెటప్స్ అదుర్స్- శాలినికి డౌట్
నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 6 ఎపిసోడ్ లో నాన్నకు పెళ్లి రోజు గుర్తు చేయాలని క్రాంతి, విరాట్ తపన పడుతుంటారు. విరాట్ కు పెళ్లి రోజు రీక్రియేట్ చేద్దామని చంద్ర ఐడియా ఇస్తుంది. అందరూ గెటప్స్ వేస్తారు. పెళ్లి డ్రామా స్టార్ట్ చేస్తారు. విరాట్, చంద్ర క్లోజ్ గా ఉండటంతో శాలినికి డౌట్ వస్తుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 6 ఎపిసోడ్ లో ఏదో ఒక ప్రయత్నం చేసి నాన్నకు పెళ్లి రోజు గుర్తు చేయాలి. నువ్వు డాక్టర్ కు కాల్ చేయ్ శాలిని అని క్రాంతి అంటాడు. డాక్టర్ కు కాల్ చేస్తుంది శాలిని. డాక్టర్ ఇంటి నుంచి హాస్పిటల్ కు వెళ్తున్నానని చెప్తే ఢిల్లీ వెళ్తున్నారా? ఫ్లైట్ లో ఉన్నారా? అని కాల్ కట్ చేస్తుంది శాలిని.

పెళ్లి రీక్రియేట్
నాన్నకు పెళ్లి రోజు గుర్తుంటే అందరికీ మొమోరబుల్ డేగా ఉండేదని చంద్రకళతో విరాట్ అంటాడు. మళ్లీ పెళ్లిని రీక్రియేట్ చేస్తే మామయ్యకు గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుందని చంద్ర ఐడియా ఇస్తుంది. మనమే అత్తయ్య బాధను తీర్చాలని చంద్ర అంటుంది. ఈ విషయాన్ని అందరితో డిస్కస్ చేద్దామని విరాట్ అంటాడు.
డ్రామాకు ఓకే
మామయ్య మీ గురించి నాకు చాలా సార్లు చెప్పేవాడివి. గుర్తు చేసుకోవడానికి ట్రై చేయమని రఘురాంను అడుగుతుంది శాలిని. రఘురాం స్ట్రెస్ తీసుకోవడంతో వద్దని వెళ్లిపోతుంది. క్రాంతితో పాటు అందరినీ పిలిచి అమ్మానాన్నల పెళ్లిని రీక్రియేట్ చేయాలని, కళ్ల ముందు అంతా కనిపిస్తే నాన్నకు గుర్తుకొస్తుందని విరాట్ అంటాడు. ఇప్పుడు కనెక్ట్ అవుతాడని క్రాంతి కూడా అంటాడు. ఆ రోజు ఏం జరిగిందో శ్యామల వివరంగా చెప్తుంది.
గెటప్ లు అదుర్స్
నా క్యారెక్టర్ నేను చేస్తానని శ్యామల అంటుంది. నేను వరదరాజులుగా చేస్తాను అన్నయ్య, నువ్వు నాన్నలా చేయమని క్రాంతి అంటాడు. నేను నాన్నలా చేస్తే ఈ చంద్ర అమ్మలా చేస్తుంది. అది నాకిష్టం లేదని విరాట్ కావాలనే డ్రామా చేస్తాడు. అందరు చెప్పేసరికి చివరకు ఒప్పుకొంటాడు. అందరూ క్యారెక్టర్లకు తగ్గట్లు గెటప్ లు వేస్తారు. విరాట్, చంద్ర పెళ్లి బట్టల్లోకి మారిపోతారు. క్రాంతి అచ్చం వరదరాజులు మామయ్య వచ్చినట్లే ఉందని విరాట్ అంటాడు.
కామాక్షి పురోహితుడి గెటప్ వేయడంతో ఎవరూ గుర్తుపట్టలేకపోతారు. కామాక్షి భలే ఉన్నావ్ తెెలుసా అని జగదీశ్వరి అంటుంది. హాల్లోకి వచ్చిన రఘురాం అందరిని చూసి ఏంటీ వేషాలు అంటాడు. నాటకం జరుగుతుంది బాగా చూడండి, మీ కోసమే ఇదంతా అని రఘురాంను కూర్చోబెట్టి డ్రామా స్టార్ట్ చేస్తారు.
పెళ్లి సీన్
రఘురాం గా విరాట్, జగదీశ్వరిగా చంద్ర, పురోహితురాలిగా కామాక్షి, కామాక్షిగా శ్రుతి నటిస్తారు. పెళ్లి తంతు స్టార్ట్ చేస్తారు. విరాట్, చంద్ర పెళ్లి డ్రామాలో క్లోజ్ గా ఉండటంతో శాలినికి మళ్లీ డౌట్ వస్తుంది. పెళ్లి అనేది కుటుంబానికి సంబంధించిందని చంద్ర చెప్తుంది. తాళి కట్టండని చెప్పగానే వరదరాజులు గెటప్ లో ఆపండని క్రాంతి ఎంట్రీ ఇస్తాడు.
నా చెల్లిగా ఎలా పుట్టావ్ జగదీశ్వరి. ఈ వరదరాజులు పరువుకు ప్రాణం ఇచ్చే మనిషి అని నీకు తెలియదా? అని క్రాంతి అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


