నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 17 ఎపిసోడ్ లో.. వదిన కోసం తెచ్చిన ఫ్రూట్స్ ను చంద్రకళకు క్రాంతి ఇస్తాడు. బొజ్జలో ఉన్న బుజ్జి బాబు కోసం ఈ బాబాయి కూడా ఆలోచిస్తాడని క్రాంతి అంటాడు. జూనియర్ విరాట్ వచ్చాక అందరినీ ఆడిస్తాడని చెప్తాడు. శాలినిపై కోపంతో క్రాంతి లోపలికి వెళ్లిపోతాడు.
మాయ ప్లాన్

క్రాంతి తెచ్చిన ఫ్రూట్స్ ను కామాక్షి తీసుకోబోతుంటే శ్యామల వచ్చి కొడుతుంది. ఈ పళ్లు అన్ని చంద్రకళనే తినాలని శ్యామల చెప్తుంది. మరోవైపు కామాక్షిని బుట్టలో వేసుకునేందుకు మాయ ట్రై చేస్తుంది. పిన్ని గారు అని వరుస పెట్టి పిలుస్తుంది. నాకు రెస్పెక్ట్ ఇస్తున్న ఫస్ట్ పర్సన్ నువ్వేనని కామాక్షి అంటుంది.
మొత్తం చెప్పేసిన కామాక్షి
క్రాంతి, శాలిని గురించి కామాక్షిని మాయ అడుగుతుంది. ఆ శాలిని మామూలు మనిషి కాదు, మేకవన్నె పులి. మా అన్నయ్య మీద దాడి చేసిందని జరిగింది మొత్తం మాయకు కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షికి శ్రుతి కాల్ చేసి షాపింగ్ కు వెళ్లాలని బయటకు రమ్మంటుంది.
శాలినికి షాక్
శాలిని క్యారెక్టర్ ఇంత డేంజరా? తన గురించి తెలుసుకోవాలని ఉందని మాయ అనుకుంటుంది. అప్పుడే శాలిని బయటకు వస్తుంది. మీకు, క్రాంతికి జరిగిన గొడవ చూశా. దాని వెనుక ఉన్న కారణం కూడా తెలిసింది. మనుషులను చంపే క్రూరత్వం నీలో ఉందంటే నమ్మలేకపోతున్నా. దేవుడి లాంటి రఘురాంను చంపాలని చూశావు. ఇంకా నువ్వు మారలేదు కదా అని శాలినిని మాయ అడుగుతుంది.
శాలిని వార్నింగ్
మాయ నా విషయంలో ఇన్వాల్స్ అవకు. గెస్ట్ లా వచ్చావ్ గెస్ట్ లా ఉండమని శాలిని వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు శ్రుతి, కామాక్షి కలిసి కార్లో వెళ్తారు. రెండు రోజుల కలెక్షన్ నా దగ్గరే ఉంది. అందుకే షాపింగ్ చేద్దామని పిలిచా. ఈ దెబ్బకు నా మొగుడి బిజినెస్ దివాళా తీయాల్సిందే. నాకు విడాకులు ఇవ్వాల్సిందేనని శ్రుతి అంటుంది.
బ్యాగ్ దొంగతనం
{{/usCountry}}మాయ నా విషయంలో ఇన్వాల్స్ అవకు. గెస్ట్ లా వచ్చావ్ గెస్ట్ లా ఉండమని శాలిని వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు శ్రుతి, కామాక్షి కలిసి కార్లో వెళ్తారు. రెండు రోజుల కలెక్షన్ నా దగ్గరే ఉంది. అందుకే షాపింగ్ చేద్దామని పిలిచా. ఈ దెబ్బకు నా మొగుడి బిజినెస్ దివాళా తీయాల్సిందే. నాకు విడాకులు ఇవ్వాల్సిందేనని శ్రుతి అంటుంది.
బ్యాగ్ దొంగతనం
{{/usCountry}}అప్పుడే కారు ఆగిపోతుంది. ఇంజిన్ లోనుంచి పొగలు వస్తాయి. కారును తోయమని తల్లిని శ్రుతి అడుగుతుంది. ఓ దొంగ వచ్చి కారు తోస్తానని చెప్పి శ్రుతి హ్యాండ్ బాగ్ తీసుకుని పారిపోతాడు. రూ.50 వేలు దొంగపాలయ్యాయని శ్రుతి, కామాక్షి ఫీల్ అవుతారు.
క్రాంతి ఫైర్
కిచెన్ లో శాలిని చేయి తగిలి గ్లాస్ మగ్ కింద పడిపోతుంది. ఆ గ్లాస్ ముక్కలు తీస్తుంటే జగదీశ్వరి చేయి తెగి రక్తం వస్తుంది. క్రాంతి, రఘురాం పరుగెత్తుకుంటూ వస్తారు. మా అమ్మను చంపాలని చూశావా? చెప్పవే రాక్షసి. నీ వల్లే జరిగిందని ఎందుకు చెప్పావు? ఇంటిల్లిపాదిని చంపడానికి మళ్లీ ఏమైనా ప్లాన్ చేశావా? అని శాలినిపై క్రాంతి ఫైర్ అవుతాడు.
శాలిని ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేస్తుంది. మొసలి కన్నీళ్లు పెడుతుంది. అందరు కలిసి నన్ను తిట్టండి. ఇప్పుడు నిజంగా మంచిదానిలా మారిపోతే నమ్మట్లేదు. మాయ కూడా నిలదీస్తోంది. నా మనసుకు బాధగా ఉండదా? అని శాలిని అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.