...
...
Next Story

Ninnu Kori March 28 Episode: యాగంలో శాలిని కుట్ర..కుక్కర్ పేల్చి జగదీశ్వరి ప్రాణాలతో చెలగాటం.. కాపాడిన మాయ.. చంద్రకళ బాధ

Ninnu Kori March 28 Episode: నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 28 ఎపిసోడ్ లో శాలినిపై క్రాంతి మరోసారి సీరియస్ అవుతాడు. విరాట్ జూనియర్ కోసం అడిగేసరికి చంద్రకళ కన్నీళ్లు పెట్టుకుంటుంది. యాగంలో అపశ్రుతి కోసం కుక్కర్ పేలేలా శాలిని కుట్ర చేస్తుంది. జగదీశ్వరిని మాయ కాపాడుతుంది.

Published on: Mar 28, 2026, 07:56:07 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 28 ఎపిసోడ్ లో.. అరిష్టాలు ఈ మనిషి (శాలిని) కారణంగా జరుగుతాయి. కానీ చంద్ర వదిన వల్ల కాదు అని మరోసారి శాలినిపై క్రాంతి సీరియస్ అవుతాడు. యాగంలో మనం కూడా కూర్చుందామని శాలిని అడుగుతుంది. అలాంటివి జరగవని క్రాంతి క్లారిటీగా చెప్పేస్తాడు.

జూనియర్ గురించి

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

చంద్రకళకు ఫోన్ చేసి విరాట్ మాట్లాడతాడు. జూనియర్ ఏమంటున్నాడు అని కడుపులో బిడ్డ గురించి అడుగుతాడు. అమ్మానాన్న ఎలా ఉన్నారు? జూనియర్ గురించి మాట్లాడుతూ మురిసిపోతుంటారు కదా. మీ అందరితో కలిసి ఉండాలని నాకుంది. కానీ ఇప్పుడు దూరంగా ఉన్నానని విరాట్ అంటాడు.

చంద్రకళ కన్నీళ్లు

విరాట్ మాటలకు ఎమోషనల్ అయిన చంద్రకళ ఏడ్చేస్తుంది. కళ్లు తిరుగుతున్నాయని అబద్ధం చెప్పి కాల్ కట్ చేస్తుంది. విరాట్ ను చాలా మిస్ అవుతున్నానని ఏడుస్తూ అతని షర్ట్ పక్కన పెట్టుకుని చంద్ర పడుకుంటుంది. ఉదయం యాగం కోసం ఏర్పాట్లు చేస్తారు.

యాగం ఏర్పాట్లు

కామాక్షి పనులేవీ చేయకుండా ఆపిల్ తింటూ ఉండటంపై శ్యామల కోప్పడుతుంది. పూలు ఇచ్చి మాల గుచ్చమని చెప్తుంది. పంతులు వస్తాడు. నా కడుపులో ఉన్న బిడ్డ వల్ల అత్తయ్య ప్రాణాలకు గండం ఉందని చెప్పారు. అత్తయ్య ప్రాణాలకు కానీ నా బిడ్డ ప్రాణాలకు కానీ ఏ అపాయం లేకుండా ఉండాలని ఈ యాగం చేస్తున్నామని పంతులుకు చంద్ర చెప్తుంది.

శాలిని ప్లాన్

పూజలో అపశ్రుతి కలిగేలా చేయాలని శాలిని అనుకుంటుంది. చంద్రను కాదని జగదీశ్వరి ప్రసాదం వండుతుంది. కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి యాగం కోసం వెళ్తుంది. శాలిని వచ్చి కుక్కర్ పేలేలా సెట్ చేస్తుంది. జగదీశ్వరి, రఘురాం కలిసి యాగం పూర్తి చేస్తారు.

పేలిన కుక్కర్

ఇదంతా చూస్తుంటే శాలిని అన్నట్లు సిద్ధాంతి చెప్పింది నిజమని అనిపిస్తుందని కామాక్షి కూడా అంటుంది. అలాంటిదేం లేదు. శాలిని మాటలు పట్టించుకోవద్దు. ఛాన్స్ తీసుకుని అందరిని బాధపెట్టాలని చూడకు అని క్రాంతి అంటాడు. దేవుడే కాపాడాడు. పూజఫలం కనిపిస్తోందని పంతులు చెప్తాడు.

యాగం పూర్తి

చంద్రకళ ప్రసాదం వండుతుంది. మొత్తానికి యాగం నిర్విఘ్నంగా పూర్తి చేశాం. ఇక మీ ఇంట్లో ఎవరికీ ప్రాణ గండం ఉండదు. అందరూ నిశ్చింతగా ఉండండని పంతులు ఆశీర్వదించి వెళ్లిపోతాడు. అమ్మవారిని చంద్రకళ వేడుకోవడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe