Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జల్ రాజ్ లెక్కలు వేస్తుంటాడు. రేపు షాపింగ్‌కు తీసుకెళ్లాలని చెప్పానుగా మర్చిపోకని శ్రుతి అంటుంది. అప్పు తీరేలా లేదని పిచ్చోడివి అయిపోయావా అని తల్లి అంటుంది. కొద్దిసేపు అంతా సైలెంట్‌గా ఉండమని ఇంగ్లీష్‌లో అంటాడు రాజ్.
నీకు ఫ్యూజ్ కొట్టేసింది

దాంతో ఇది నిజంగా పిచ్చే అని తల్లి అంటుంది. బిజినెస్ గురించి ఇదంతా అని రాజ్ అంటే.. మీ అమ్మ కరెక్టే నీకు ఫ్యూజ్ కొట్టేసిందని శ్రుతి అంటుంది. పంతులుకు కాల్ చేసి నా పేరు మీద ట్రావెల్ బిజినెస్‌కు ముహుర్తం చూడండి. లక్షల్లో వ్యాపారం చేసేవాడికి పదివేలు దక్షిణ ఇస్తానుగా అని జల్ రాజ్ అంటాడు.
శ్రుతి, తల్లి ఇద్దరు షాక్ అవుతారు. మరి అంత డబ్బు ఎక్కడిది అని అడుగుతారు. నా మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టేవాళ్లు ఉన్నారు. నా బిజినెస్‌ను నువ్వు ఆపలేవు శ్రుతి అని రాజ్ అంటాడు. వెంటనే వెళ్లి జల్ రాజ్ ట్రావెల్ బిజినెస్ పెడుతున్నాడని, ఈసారి అతని చాలా కాన్పిడెంట్‌గా ఉన్నాడు, ఎవరో పెట్టుబడి పెడుతున్నారని చెబుతుంది.
ఎక్కడో సెట్ చేసి ఉంటాడు. అయినా పెట్టని, అక్కడ కూడా గళ్లపెట్టే నీదే కదా అని కామాక్షి అంటుంది. మరోవైపు ల్యాండ్ ఇష్యూ గురించి లాయర్‌తో క్రాంతి మాట్లాడుతాడు. ఏ డాక్యుమెంట్ కావాలన్న తీసుకొస్తానని క్రాంతి అంటాడు. లాయర్, కోర్టు చుట్టూ తిరిగితే చాలా టైమ్ పడుతుంది. రిజిస్టర్ ఆఫీస్‌లో నాకు తెలిసిన వాళ్లు ఉన్నారు. నువ్వు ఒకే అంటే నేను హెల్ప్ చేస్తానని శాలిని అంటుంది.
శాలిని గుంటనక్క
దాంతో క్రాంతి కోప్పడుతాడు. అంతా క్రాంతిని తిడతారు. అడక్కుండానే హెల్ప్ చేస్తానందంటే ఇల్లును అణగదొక్కాలని చూస్తుంది. డాక్యుమెంట్లో తప్పులు దొర్లాలని చేయాలని చూస్తుందని క్రాంతి అంటాడు. తనకు నిజంగా హెల్ప్ చేయాలని ఉంటే మాతో ఎవరికో ఒకరికో చెప్పొచ్చుగా అని కామాక్షి అంటుంది. కరెక్ట్ నాతో చెబితే అరుస్తా, ఇంట్లో ప్రశాంతత ఉండదు అని క్రాంతి అంటాడు.
{{/usCountry}}దాంతో క్రాంతి కోప్పడుతాడు. అంతా క్రాంతిని తిడతారు. అడక్కుండానే హెల్ప్ చేస్తానందంటే ఇల్లును అణగదొక్కాలని చూస్తుంది. డాక్యుమెంట్లో తప్పులు దొర్లాలని చేయాలని చూస్తుందని క్రాంతి అంటాడు. తనకు నిజంగా హెల్ప్ చేయాలని ఉంటే మాతో ఎవరికో ఒకరికో చెప్పొచ్చుగా అని కామాక్షి అంటుంది. కరెక్ట్ నాతో చెబితే అరుస్తా, ఇంట్లో ప్రశాంతత ఉండదు అని క్రాంతి అంటాడు.
{{/usCountry}}అప్పటి శాలిని కాదు, చూడు ఎలా ఏడుస్తుందో అని చంద్రకళ అంటుంది. అయ్యో వదినా తన నటన గురించి నీకు తెలియదా. ఈ గుంటనక్క సాధు జంతువుల మారిందంటే మీరంతా నమ్ముతారేమే నేను నమ్మను అని క్రాంతి అంటాడు. ఎందుకు అర్థం చేసుకోవట్లేదని ఏడుస్తుంది శాలిని. నువ్వు చేసిన పాపాలకు నిన్ను క్షమించడం జరగదని క్రాంతి అంటాడు.
నిజమే, కానీ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. నీతో ప్రశాంతంగా బతకాలని ఆశపడుతున్నాను. నేను మారానని చెప్పడానికి ఏ చిన్న అవకాశం దొరికిన వాడుకోవాలని చూస్తున్నా. అది నీకు తప్పుగా కనిపిస్తే ఏం చేయను. ఇప్పుడున్న శాలిని చచ్చిన పాముతో సమానం. నీ మాటలతో ఇంకా చంపకు. దీనికన్న ఒక్కసారిగా ప్రాణం తీసేయ్ అని శాలిని డ్రామా చేస్తుంది.
చంద్రకళ ప్రెగ్నెంట్
నేను నిన్ను నమ్మను అని శాలిని తోసేస్తాడు క్రాంతి. మరి ఎక్కువ చేస్తున్నావని క్రాంతిని తిడతాడు రఘురాం. ఇంతలో చంద్రకళ స్పృహ తప్పి పడిపోతుంది. అంతా కంగారుపడతారు. తర్వాత డాక్టర్ వచ్చి చంద్రను చెక్ చేస్తుంది. మీ ఇద్దరి ప్రేమ ఇంకొకరికి ప్రాణం పోసింది. మీ ఆవిడ నెల తప్పిందని (ప్రెగ్నెంట్) డాక్టర్ చెబుతుంది. దాంతో అంతా సంతోషిస్తారు. కామాక్షి, శాలిని కోపంగా చూస్తారు.
వదినకు దిష్టి తీయమని క్రాంతి అంటాడు. స్వీట్స్ ఇవ్వమని రఘురాం అంటాడు. చంద్రకు జగదీశ్వరి దిష్టి తీస్తుంది. చంద్రకు విరాట్ స్వీట్ తినిపిస్తాడు. అందరికి శ్యామల స్వీట్స్ ఇస్తారు. స్ట్రెస్ లేకుండా ఉండండి, చేయాల్సిన పనులు చేసుకోండి. పరిగెత్తకండి, ఈ పౌడర్ ఒకటి పాలల్లో కలిపి ఇవ్వండని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది.
చంద్రకు గాలి తగలాలి దూరంగా ఉండండని, నా భార్య ఈ ఇంటికి వారసుడుని ఇవ్వబోతుందని హడావిడి చేస్తాడు విరాట్. కొద్దిరోజులు అయితే ఇంట్లో ఉండనిచ్చేలా లేవుగా అని శ్యామల అంటుంది. జగదీశ్వరి కొడుకుకు సపోర్ట్ చేస్తుంది. వాళ్లను ఒంటరిగా వదిలేద్దామని రఘురాం అనడంతో అంతా వెళ్లిపోతారు. చంద్రకళను ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్తాడు విరాట్.
శాలిని ఉక్రోషం
తల్లి దగ్గరికి వెళ్లిన శాలిని తన కోపాన్ని చూస్తుంది. ఇంట్లో వస్తువులన్ని పగలగొడుతుంది. ఉక్రోషంతో ఊగిపోతుంది. మరోవైపు చంద్ర, విరాట్, క్రాంతి సరదాగా మాట్లాడుకుంటారు.
ల్యాండ్ సమస్యలో ఒక లింక్‌డ్ డాక్యుమెంట్ ఉండాలట, అది మిస్ అయిందని క్రాంతి అంటాడు. ఆ మాటలు విన్న శాలిని ఆ లింక్‌డ్ డాక్యుమెంట్ నేనే కొట్టేశా అని మురిసిపోతుంది శాలిని. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.