...
...
Next Story

నిన్ను కోరి నవంబర్ 12 ఎపిసోడ్: హ‌గ్ కోసం విరాట్ రిక్వెస్ట్‌-గ‌జినిలా ప‌చ్చ‌బొట్లు వేయించుకుంటానన్న రఘురాం-చంద్రకు అండ

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 12వ తేదీ ఎపిసోడ్ లో శాలిని మాయలో పడి క్రాంతి పెంచుకుంటున్న ద్వేషం గురించి విరాట్ బాధ పడతాడు. బావను కూల్ చేస్తుంది చంద్ర. ఒక హగ్ ఇవ్వమని అడిగినా ఇవ్వదు. చంద్రపై పొగడ్తల వర్షం కురిపిస్తాడు రఘురాం.

Published on: Nov 12, 2025, 07:32:49 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 12 ఎపిసోడ్ లో క్రాంతి గురించి తలుచుకుంటే బాధగా ఉంది చంద్ర. శాలిని పూర్తిగా వాడి మైండ్ మార్చేసింది. నా మీద పీకల దాకా కోపం ఉందంటా. మా అన్నయ్య ఉన్నాడని గొప్పగా చెప్పుకునేవాడు. కానీ ఇప్పుడు భార్యను గుడ్డిగా నమ్మి బలైపోతున్నాడు చంద్ర. నాన్న నార్మల్ అయ్యేంతవరకూ పరిస్థితులు ఇంకెంత దారుణంగా మారుతాయో అని విరాట్ ఎమోషనల్ అవుతాడు.

హగ్ కావాలని విరాట్

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

అన్నీ సర్దుకుంటాయి బావ. విండోస్ కు కర్టెన్ వేయాలి హెల్ప్ చేయమని అడుగుతుంది చంద్రకళ. జారిపోయి పడబోతుంటే చంద్రకళను పట్టుకుంటాడు విరాట్. కామాక్షి డోర్ బయట ఉండి వింటుంది. చంద్ర డోర్ తీయడంతో ఉలిక్కిపడుతుంది. కనీసం ఒక హగ్ అయినా ఇవ్వవే అని రిక్వెస్ట్ చేస్తాడు విరాట్. కానీ చంద్ర నో చెప్తుంది.

గజిని సినిమాలా

శ్యామలకు గోరింటాకు పెడుతుంది శ్రుతి. విరాట్, చంద్రలు రూమ్ లో మాట్లాడుకున్న మాటలు వినలేక చచ్చానని కామాక్షి వచ్చి చెప్తుంది. వాళ్లిద్దరు విడిపోరనే విషయం నాకు అర్థమైంది. నాకోసం రాజకుమారుడు వస్తాడని శ్రుతి చెప్తుంది. గజిని సినిమాలోలాగా నేను పచ్చబొట్లు వేసుకుంటానని రఘురాం అంటాడు. మేమంతా ఉన్నాం కదా అని జగదీశ్వరి భరోసా ఇస్తుంది. జున్నును ఇష్టంగా తింటాడు రఘురాం.

మధ్యాహ్నం భోజనం టైమ్ లో విరాట్, క్రాంతి ఏదో సీన్ రీక్రియేట్ చేశారు కదా. అది ఏ సినిమాలోనిది అని రఘురాం అడుగుతాడు. అది కాదు వినాయకచవితి రోజు మీ తలపై కొట్టింది ఎవరో గుర్తు చేసుకోండని భర్తను కోరుతుంది జగదీశ్వరి. ఉదయం చంద్ర పూజ చేస్తుంది. నాన్న ముందు మంచిగా ఉన్నట్లు నటిస్తారు విరాట్, క్రాంతి.

చంద్రను పొగిడిన రఘురాం

నన్ను మతిమరుపు మహాశయుడిగా మార్చిన వ్యక్తిని గుర్తు తెచ్చుకునేందుకు ట్రై చేస్తా. నన్ను కొట్టింది ఎవరో కచ్చితంగా గుర్తు చేసుకుంటానని రఘురాం అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks