నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 16 ఎపిసోడ్ లో అన్నయ్యను కొట్టింది నువ్వే కదా అని శ్రుతిని అడుగుతుంది కామాక్షి. తల మీద కొట్టి చంద్రకళ బయటకు వచ్చి యాక్ట్ చేసిందేమోనని శ్రుతి అంటుంది. మామయ్యకు స్పృహ వచ్చినప్పుడు నేను నీతోనే ఉన్నాను కదమ్మా అని శ్రుతి విసుగ్గా వెళ్లిపోతుంది.
చంద్రకళ మీద డౌట్

మామయ్యను కొట్టారని తెలిసింది కానీ నా మీద డౌట్ రాలేదని శాలిని అనుకుంటుంది. చంద్రకళ మీద డౌట్ వచ్చింది కాబట్టి నేను సేఫ్. మామయ్యకు స్పృహ వచ్చేలోపు చంద్ర గడువు ముగిసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత నా రాజ్యమే నడుస్తుందని శాలిని అనుకుంటుంది. అప్పుడే చంద్ర వచ్చి మామయ్యను కొట్టింది నువ్వే కదా అని డైరెక్ట్ గా అడుగుతుంది. అలాంటి అవసరం నీకు, శ్రుతికి మాత్రమే ఉందని చంద్ర అంటుంది.
పగ ముఖ్యం
నువ్వు మారిపోయావని నమ్మి నేను తప్పు చేశానని చంద్ర అంటుంది. నీకు తెలిస్తే పర్వాలేదు అందరికీ తెలిస్తే ఇబ్బంది అవుతుంది. ఇంటి పరువు, నాకు క్రాంతికి ఉన్న రిలేషన్ కాపాడటం నీకు ముఖ్యం. నీ ప్రాబ్లెం నీ మంచితనం. నాకు పగ ముఖ్యం. నువ్వు నన్ను ఏం చేయలేవు. నేను మారిపోయావని ఎలా నమ్మావు చంద్ర. స్వార్థం కోసమే నటించా. మామయ్య స్పృహలోకి వచ్చి అందరికీ చెప్పేస్తానని అన్నారు. అందుకే కొట్టాల్సి వచ్చిందని శాలిని అంటుంది.
నిజం తెలుసుకోవాలని
వెంటనే శాలినిని లాగిపెట్టి కొడుతుంది చంద్ర. అప్పుడే క్రాంతి వస్తాడు. శాలిని మాట మారుస్తుంది. చంద్రకు సపోర్ట్ గా డ్రామా ఆడుతుంది శాలిని. నీ పాపం పండే రోజు తప్పకుండా వస్తుందని చంద్ర వెళ్లిపోతుంది. నాన్నను చంపాలనే ఆలోచన ఎవరికి ఉంటుందని క్రాంతిని విరాట్ అడుగుతాడు. వరదరాజులు చేసి రిపోర్ట్స్ మార్చేసి ఉంటారా? అని క్రాంతి డౌట్ పడతాడు. మనకు తెలియని శత్రువులు ఎవరో కనుక్కోవాలని అంటాడు. రేపు హాస్పిటల్ వెళ్లి నిజం తెలుసుకుంటానంటాడు విరాట్.
మామయ్యను చంపాలని
మరోవైపు అర్జున్ మందు తాగి బాధపడుతుంటాడు. ఆ పసి పాప ఏం చేసిందని ఇంత శిక్షా అని దేవుణ్ని ప్రశ్నిస్తాడు. ముందు నాకు భార్యను దూరం చేశావు. ఇప్పుడు కూతురిని దూరం చేసి ఏం సాధిస్తావు. తల్లిని ఎక్కడి నుంచి తీసుకురావాలి? నువ్వు చలనం లేని రాయివి అని బాధపడతాడు అర్జున్. ఇటు మామయ్యను చంపాలని అర్ధరాత్రి లేచి రఘురాం గదిలోకి వెళ్లుంది శాలిని. అది శ్యామల చూస్తుంది.
{{/usCountry}}మరోవైపు అర్జున్ మందు తాగి బాధపడుతుంటాడు. ఆ పసి పాప ఏం చేసిందని ఇంత శిక్షా అని దేవుణ్ని ప్రశ్నిస్తాడు. ముందు నాకు భార్యను దూరం చేశావు. ఇప్పుడు కూతురిని దూరం చేసి ఏం సాధిస్తావు. తల్లిని ఎక్కడి నుంచి తీసుకురావాలి? నువ్వు చలనం లేని రాయివి అని బాధపడతాడు అర్జున్. ఇటు మామయ్యను చంపాలని అర్ధరాత్రి లేచి రఘురాం గదిలోకి వెళ్లుంది శాలిని. అది శ్యామల చూస్తుంది.
{{/usCountry}}దిండుతో రఘురాం ఊపిరి తీసేందుకు శాలిని చూస్తుండగా శ్యామల వచ్చి లైట్ ఆన్ చేస్తుంది. మామయ్యకు మెడిసిన్ ఇవ్వడానికి వచ్చానని తడబడుతుంది శాలిని. నన్ను అనుమానిస్తున్నారా? అని డ్రామా ఆడుతుంది శాలిని. ఆయన దగ్గరకు ఎవరూ రావడానికి వీల్లేదని జగదీశ్వరి సీరియస్ గా చెప్తుంది. మరోవైపు తాగి తూలుతూ అర్జున్ ఇంటికి వెళ్తాడు. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.