నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 17 ఎపిసోడ్ లో ఇంటికి తాగొచ్చి బాధపడతాడు అర్జున్. నా కూతురి కోసమే ప్రాణాలతో ఉన్నా కానీ ఆ దేవుడు ఇప్పుడు తన ప్రాణాలనే తీసుకెళ్లాలని చూస్తున్నాడని బాబాయ్ తో చెప్తాడు అర్జున్. భార్యను దూరం చేశాడు, ఇప్పుడు కూతురును దూరం చేస్తున్నాడని అంటాడు అర్జున్. నా కూతురిని లేపడానికి నలుగురు మనుషులు వచ్చే పరిస్థితి రావొద్దు బాబాయ్ అని ఎమోషనల్ అవుతాడు అర్జున్. మెట్లపై నుంచి జారిపడతాడు.
శాలినికి సలహా

నీ అసలు రూపం బయటపెట్టే తీరుతానని చంద్రకళతో శ్యామల అంటుంది. ఏంటి చంద్ర నువ్వు ఇల్లు వదిలి వెళ్లే క్షణాలు దగ్గర పడ్డాయని అర్థమైపోయిందా? అని శాలిని అడుగుతుంది. ఇంకా నాలుగు రోజులున్నాయి కదా అని చంద్ర అంటుంది. క్రాంతి నుంచి పొందిన ప్రేమతో హ్యాపీగా ఫీల్ అయి ఉంటావు కదా. అది ఆస్వాదించగలిగితే లైఫ్ బాగుంటుంది. మారితే బాగుంటుందని శాలినికి చెప్తుంది చంద్ర.
చైన్ కొట్టేసిన రాజ్
శ్రుతిని ఇంప్రెస్ చేసేందుకు రాజ్ పొగడ్తలు కురిపిస్తాడు. మెడలో ఉన్న చైన్ పై కాన్సంట్రేట్ చేస్తాడు. అప్పుడే రాజ్ చెప్పినట్లుగా నాగూర్ బైక్ పై వచ్చి శ్రుతి మెడలో ఉన్న చైన్ లాక్కొని వెళ్తాడు. చైన్ వెనకాల వెళ్లిన రాబిన్ హుడ్ కనిపిస్తున్నాడని శ్రుతి ఆనందంగా చెప్తుంది. నా రాబిన్ హుడ్ మనసు దోచేశాడు. చైన్ తీసుకొని వస్తాడని శ్రుతి అక్కడున్నవాళ్లతో అంటుంది.
నిజం తెలుసుకున్న విరాట్
హాస్పిటల్ కు వెళ్లి రిపోర్ట్స్ ఎలా మారిపోయాయని ల్యాబ్ హెడ్ తో గొడవ పెట్టుకుంటాడు విరాట్. నేను కరెక్ట్ గానే ఇచ్చా. ఆ రోజు మీ ఫాదర్ కు స్కానింగ్ చేసినప్పుడు షాకింగ్ విషయం బయటపడింది. ఎవరో బలంగా కొట్టడం వల్ల నరాలు డ్యామేజీ అయినట్లు తెలిసింది. అప్పుడే మీ ఫ్యామిలీలో ఒకరు వచ్చి పర్సనల్ గా మాట్లాడాలని డాక్టర్ ను తీసుకెళ్లిందని ల్యాబ్ హెడ్ చెప్తుంది. శాలిని ఫొటో చూపించే సరికి ఈవిడే అని చెప్తుంది. దీంతో నాన్నను కొట్టింది శాలిని అని తెలుసుకుంటాడు విరాట్.
డాక్టర్ మాటలతో
శాలినికి డాక్టర్ కాల్ చేస్తాడు. నా దగ్గర అంత డబ్బు తీసుకున్నప్పుడు విషయం బయట పడకుండా జాగ్రత్త పడాలి కదా. మీ నిర్లక్ష్యం వల్ల దొరికిపోయేదాన్ని అని శాలిని ఫైర్ అవుతుంది. ల్యాబ్ టెక్నిషియన్ మీరు నాతో మాట్లాడటం విరాట్ కు చెప్పేసిందంటా అని డాక్టర్ షాకిస్తాడు. రిపోర్ట్స్ మారిపోవడానికి కారణం నేనే అని మా బావకు తెలిసిపోయిందా అని అరుస్తుంది శాలిని. ఆ మాటలను చంద్రకళ వింటుంది.
{{/usCountry}}శాలినికి డాక్టర్ కాల్ చేస్తాడు. నా దగ్గర అంత డబ్బు తీసుకున్నప్పుడు విషయం బయట పడకుండా జాగ్రత్త పడాలి కదా. మీ నిర్లక్ష్యం వల్ల దొరికిపోయేదాన్ని అని శాలిని ఫైర్ అవుతుంది. ల్యాబ్ టెక్నిషియన్ మీరు నాతో మాట్లాడటం విరాట్ కు చెప్పేసిందంటా అని డాక్టర్ షాకిస్తాడు. రిపోర్ట్స్ మారిపోవడానికి కారణం నేనే అని మా బావకు తెలిసిపోయిందా అని అరుస్తుంది శాలిని. ఆ మాటలను చంద్రకళ వింటుంది.
{{/usCountry}}శాలిని గురించి బయటపడితే క్రాంతి తట్టుకోలేడు. ముందు బావను ఆపాలని చంద్ర అనుకుంటుంది. విరాట్ కు కాల్ చేయడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.