నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శాలినిని హిప్లటైజే చేయిస్తాడు విరాట్. కానీ, శాలిని అందులో అబద్దం చెబుతుంది. మరోవైపు గుడిలో హోమం చేయిస్తుంది చంద్రకళ. ఈ హోమం నీ అంతరాత్మకే పరీక్ష. నీ ఉద్దేశం సరైనది కాకపోతే నువ్వు ఎంత నిష్టగా పూచ చేసిన దాని త్యాగఫలం దక్కదు అని స్వామిజీ అంటాడు.
చంద్రకళ హోమం

నా దీక్ష దేనికో మీకు తెలుసు. దేవుడికి తెలుసు. నన్ను రక్షిస్తాడో, శిక్షిస్తాడో దేవుడి ఇష్టం అని పూజలో కూర్చొంటుంది చంద్రకళ. హోమం స్టార్ట్ చేస్తారు. అత్తయ్య మావయ్య కష్టాల నుంచి విముక్తి పొందాలి. నేను ఏ తప్పు చేయలేదని తెలుసుకోవాలి అని చంద్రకళ మనసులో కోరుకుంటుంది. అగ్ని స్వచ్ఛమైనది. నీ కోరిక మంచిదో చెడుదో ఈ అగ్ని చెబుతుందని స్వామిజీ అంటాడు.
ఈ పూర్ణాహుతి అగ్నిలో వేస్తే అగ్ని చల్లారిపోతే నీ కోరిక స్వచ్ఛమైనది కాదు అని అర్థం. ఎగసి పడిందంటే ఆ దేవుడు నీ పూజను సంతోషంగా అందుకుని నిన్ను కరుణాస్తాడని చెప్పినట్లు అని ఆ పూర్ణాహుతి చంద్రకు ఇస్తాడు స్వామిజీ. పూర్ణాహుతి అగ్నిలో వేయగానే మరింత మండుతుంది. దాంతో చంద్రకళ సంతోషిస్తుంది. మరోవైపు హిప్నటైజ్‌తో నిజం చెబుతారు అంటారు. మరి శాలిని అబద్ధం చెప్పిందేంటీ అని విరాట్ ఆలోచిస్తాడు.
సైకియాట్రిస్ట్ డాక్టర్‌కు కాల్ చేసి క్రాంతిని రమ్మని చెబుతాడు. దాంతో క్రాంతి వస్తాడు. శాలినికి మెలకువ వస్తుంది. వాష్ రూమ్‌లోకి వెళ్లి చెవిలో ఉన్న దూది తీస్తుంది. డాక్టర్‌తో విరాట్ మాట్లాడటం శాలిని విన్నది గుర్తు చేసుకుంటుంది. డాక్టర్‌తో హిప్నటైజ్ గురించి అడుగుతాడు. అదంతా శాలిని వింటుంది. దాంతో ముందుగానే ప్లాన్ తెలుసుకున్న శాలిని చెవిలో దూది పెట్టుకుంటుంది.
ఝలక్ ఇచ్చిన శాలిని
ఈ శాలినికి ఝలక్ ఇద్దామనుకున్నారుగా. మీకే నేను ఇస్తాను పెద్ద ఝలక్ అని శాలిని అనుకుంటుంది. హోమ గుండంలోని భస్మాన్ని చంద్రకళకు ఇస్తాడు స్వామిజీ. రోజు మీ మావయ్యకు భస్మం పెట్టని, కోలుకుంటారని స్వామిజీ చెబుతాడు. మరోవైపు శాలిని రిపోర్ట్స్ అన్ని నార్మల్‌గానే ఉన్నాయని చెబుతుంది డాక్టర్. శాలిని బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ అనుకుంటా. ఎవరికి దొరకూడదని ముందే గట్టిగా అనుకున్నట్లున్నారు అని విరాట్‌తో సైకియాట్రిస్ట్ అంటాడు.
{{/usCountry}}ఈ శాలినికి ఝలక్ ఇద్దామనుకున్నారుగా. మీకే నేను ఇస్తాను పెద్ద ఝలక్ అని శాలిని అనుకుంటుంది. హోమ గుండంలోని భస్మాన్ని చంద్రకళకు ఇస్తాడు స్వామిజీ. రోజు మీ మావయ్యకు భస్మం పెట్టని, కోలుకుంటారని స్వామిజీ చెబుతాడు. మరోవైపు శాలిని రిపోర్ట్స్ అన్ని నార్మల్‌గానే ఉన్నాయని చెబుతుంది డాక్టర్. శాలిని బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ అనుకుంటా. ఎవరికి దొరకూడదని ముందే గట్టిగా అనుకున్నట్లున్నారు అని విరాట్‌తో సైకియాట్రిస్ట్ అంటాడు.
{{/usCountry}}శాలినికి మెడిసిన్ రాస్తుంది డాక్టర్. విరాట్‌ను క్రాంతికి చూపిస్తుంది. బావగారు ఇక్కడ ఎందుకు ఉన్నారు. సైకిటార్టిస్ట్‌ను ఎందుకు కలిశారు అని క్రాంతికి అనుమానం వచ్చేలా మాట్లాడుతుంది శాలిని. సైకియార్టిస్ట్ క్రాంతి వాళ్లను చూసి షాక్ అయి వెళ్లిపోతాడు. ఆయనేంటీ అలా రియాక్ట్ అయ్యారంటుంది శాలిని. క్రాంతి వెళ్లి సైకియాట్రిస్ట్‌ను నిలదీస్తాడు.
అక్కడ విరాట్ రాసి ఉన్న ప్రశ్నలు చూపిస్తుంది శాలిని. దాంతో సైకియార్టిస్ట్‌ను వరాట్ విరాట్ చేసింది అంతా చెబుతాడు. ఈరోజు అన్నయ్య సంగతి తేలుస్తాను అని క్రాంతి అంటాడు. మరోవైపు రాజ్ బైక్‌పై వస్తే కారు ఎక్కడ అని అడుగుతుంది శ్రుతి. బైక్ అయితే రొమాంటిక్‌గా ఉంటుందని రాజ్ అంటాడు. రాజ్‌కు గిఫ్ట్ ఇస్తుంది శ్రుతి. గోల్డ్ రింగ్ అనుకుని చూసిన రాజ్ చూస్తే కీ చైన్ ఉంటుంది.
రాజ్‌కు శ్రుతి గిఫ్ట్
ఇది మన కార్‌కు బాగుంటుందని శ్రుతి అంటే.. మనది అంటున్నావేంటే లైఫ్ పార్టనర్‌గా ఒప్పుకున్నట్లేగా అని రాజ్ అంటాడు. శ్రుతి సంతోషిస్తుంది. మరోవైపు హోమం విబూదిని జగదీశ్వరికి చంద్రకళ ఇస్తే శ్యామల వద్దంటుంది. తర్వాత క్రాంతి వచ్చి గొడవ చేస్తాడు. శాలినికి హిప్నటైజ్ చేయించడం గురించి చెప్పి నిలదీస్తాడు క్రాంతి.
దాంతో విరాట్ అవును చేయించానని ఒప్పుకుంటాడు. నిన్ను అన్నయ్య అని పిలవడానికి కూడా అసహ్యంగా ఉందని క్రాంతి అంటాడు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.