...
...
Next Story

నిన్ను కోరి అక్టోబర్ 31 ఎపిసోడ్: రఘురాంతో నిజం చెప్పించాలని చూసిన విరాట్- కాళ్లు కదిపి తలవాల్చిన తండ్రి- చంద్ర ఛాలెంజ్

నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ 31 ఎపిసోడ్‌లో శాలినికి విరాట్ హిప్నటైజ్ చేయించడంపై క్రాంతి కోప్పడతాడు. అంతా చంద్రకళను నిందిస్తారు. చంద్రను నిర్దోషి అని నిరూపించడానకి రఘురాంను బయటకు తీసుకొస్తాడు విరాట్. రఘురాం చేయి, కాళ్లు కదిపి నిజం చెప్పబోతాడు. కానీ, అంతలోనే తల వాల్చేస్తాడు. దాంతో అంతా టెన్షన్ పడతారు.

Published on: Oct 31, 2025, 08:56:34 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో హోమం నుంచి తీసిన భస్మాన్ని మావయ్యకు పెట్టమని చంద్రకళ ఇస్తుంది. ఏం కోరుకున్నావో అని, వద్దని శ్యామల అంటుంది. ఎందుకు చంద్రను నెగెటివ్‌లా చూస్తావని విరాట్ అంటాడు. అలా చూడకుండా ఉండాలంటే తప్పు చేయేలదేని నిరూపించు అని శ్యామల అంటుంది.

అంత కోపంగా ఉన్నావేంట్రా

నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ 31 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ 31 ఎపిసోడ్‌

పూజ ఫలితం దక్కాలంటే మావయ్యకు రోజు బొట్టు పెట్టాలని చంద్రకళ అంటుంది. మరోవైపు క్రాంతి కోపంగా వస్తాడు. వచ్చి ఫ్లవర్ వాజ్ విసిరేస్తాడు. అంత కోపంగా ఎందుకున్నావురా అని క్రాంతిని అడుగుతుంది శ్యామల. మా ఆయన ఏం చేశారు అని చంద్రకళ అంటుంది. హాస్పిటల్‌లో ఏం చేశాడో కనుక్కో. అయినా మీరిద్దరు తోడు దొంగలే కదా. నీకు తెలిసే ఉంటుంది అని క్రాంతి అంటాడు.

నేను చేసింది తప్పే కాదు అని విరాట్ అంటాడు. శాలిని డ్రామా చేస్తుంది. ఇది నా భార్య గొప్పతనం. నువ్వు హిప్నటైజ్ చేయించినా తను మాత్రం నిన్ను ఇబ్బంది పెట్టాలని చూడట్లేదు అని క్రాంతి అంటాడు. దానికి అంతా షాక్ అవుతారు. నిజం రాబట్టడానికి చేశాను అని విరాట్ అంటాడు. నిజం రాబట్టడానికా నీకు నచ్చినట్లు చెప్పించడానికా అని క్రాంతి అంటే విరాట్ అరుస్తాడు.

అరవకు అన్నయ్య. ఛీ.. నిన్ను అన్నయ్య అని పిలవడానికే అసహ్యంగా ఉంది. ప్రెగ్నెంట్‌తో ఉందన్న కనికరం కూడా లేకుండా చేశావ్. మానవత్వం పోయేలా ఎలా మారిపోయావ్ అన్నయ్య. హాస్పిటల్‌కు వచ్చి వేధించాలా అని క్రాంతి అంటాడు. నాకు నిజం రాబట్టడానికి ఈ దారే కనిపించింది అని విరాట్ అంటాడు. దాంతో శాలిని మరింత డ్రామా చేస్తుంది.

నా భార్య నిజాయితీ

నా భార్య దోషి కాదని ఇప్పుడే నిరూపిస్తానని లోపలికి వెళ్లి తండ్రి రఘురాంను తీసుకొస్తాడు విరాట్. అందరు ఐదు నిమిషాలు ఏం మాట్లాడకుండా ఓపికగా ఉండండి అని విరాట్ అంటాడు. రఘురాం ఎదురుగా చంద్రకళను నిలబెట్టి అంతా తననే నిందిస్తున్నారు. అందరికి కావాల్సింది నీ సమాధానం కోసమే ఎదురుచూస్తున్నాం. నిజం చెప్పండి అని విరాట్ అంటాడు.

దయచేసి మాట్లాడండి అని విరాట్ అంటాడు. అలా అడిగి మావయ్యను ఇబ్బందిపెట్టడం ఎందుకు అని శాలిని అంటుంది. నువ్వు మాట్లాడకు అని విరాట్ అరుస్తాడు. నా భార్య మీద అరవకు అని క్రాంతి అంటాడు. ఎవరిని మాట్లాడొద్దని చెప్పానుగా. కాసేపు నీ భార్యను కంట్రోల్‌లో పెట్టుకో అని విరాట్ అంటాడు. ఏవండి మనకు పరిస్థితులు అనుకూలంగా లేవు. కానీ, దైవం మనతోనే ఉంది. ఇదంతా ఎందుకుండి అని చంద్రకళ అంటుంది.

తల వాల్చిన తండ్రి

నాన్న నిజం బయటపెట్టాలని నువ్వు కోరుకుంటున్నావని నాకు తెలుసు. మాట్లాడండి నాన్న అని చెప్పిన విరాట్ హోమం విబూదిని రఘురాంకు పెడతాడు. నీ కోడలు ఇంట్లో ఉండాలనుకుంటే లే నాన్నా. ఆ దేవుడే ఉంటే ఆ దైవం మాకు అండగా ఉంటే నువ్వు లేస్తావు నాన్న అని విరాట్ అంటాడు. దాంతో రఘురాం చేయి కదుపుతాడు. దాంతో అంతా సంతోషిస్తారు.

కళ్లు తిప్పుతాడు రఘురాం. కాలు తనంతట తానే కింద పెడతాడు రఘురాం. రఘురాం చెప్పడానికి ట్రై చేస్తాడు. చెప్పటానికి ట్రై చేసి పక్కకు తల వాలుస్తాడు. దాంతో డాక్టర్‌కు కాల్ చేస్తారు. డాక్టర్ వచ్చి రఘురాంను చూసి ట్రీట్‌మెంట్ చేస్తాడు. డాక్టర్ రిపోర్ట్స్ చూస్తాడు. విరాట్ జరిగింది చెబుతాడు. అందరు పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉంటే నాన్న ఎప్పుడో కోలుకునేవారు అని క్రాంతి అంటాడు.

తర్వాత చంద్ర వెళ్తుంటే శాలిని ఆపుతుంది. చంద్ర కోపంతో చూడటంతో భయమేస్తున్నట్లు చూస్తుంది. తట్టా బుట్టా సర్దుకునే టైమ్ వచ్చిందని శాలిని అంటుంది. నేను ఎక్కడికి వెళ్లను. నిజంగా కుటుంబం విడిపోయే పరిస్థితి వస్తే నిజం బయటపెడతాను అని చంద్రకళ ఛాలెంజ్ చేస్తుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe