Ninnu Kori September 16 Episode: నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. విరాట్ కోసం జగదీశ్వరి ఫ్యామిలీ ఎదురు చూస్తుంటుంది. ఈ నేపథ్యంలో చంద్రకళ ఏం చేయాలో అర్థం కాదు. విరాట్ యాక్సిడెంట్, ఫేస్ స్వాప్ విషయం ఇంట్లోవాళ్లకు తెలియకుండా చంద్ర దాచిపెడుతుంది.
బావను తీసుకొస్తానని

భర్తను వెనక్కి తెచ్చుకోవాలనే ఆరాటంలో చంద్ర ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుంది. విరాట్ ప్రస్తుత రూపం మరొకరిదని, ఆ రూపం వెనుక ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని చంద్రకు తెలుసు. అయినా ఆ నిజాన్ని అత్త జగదీశ్వరికి చెప్పకుండా దాచిపెడుతుంది.
"నేను బావ దగ్గరికే వెళ్తున్నాను అత్త. బావని తీసుకుని వచ్చి మీ ముందు నిలబెడతాను" అని జగదీవ్వరితో చంద్ర ధీమాగా చెబుతుంది. జగదీశ్వరి ఎంత ఆపే ప్రయత్నం చేసినా వినకుండా, అబద్ధం ఆడిన చంద్ర తన ప్రయాణం మొదలెడుతుంది.
దాక్షాయణి ఎంట్రీ
సీన్ ఆస్పత్రికి మారగానే అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. అక్కడ ఎమోషన్స్ తారాస్థాయికి చేరుకుంటాయి. సామ్రాట్ తల్లి దాక్షాయణి ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. ఆవేశంగా కారిడార్‌లోకి ఎంటర్ అయిన దాక్షాయణి.. బెడ్‌పై స్పృహ లేకుండా సామ్రాట్ ముఖంతో ఉన్న విరాట్ ను చూసి ఎమోషనల్ అవుతుంది.
ఇంటికి సామ్రాట్
బెడ్ పై ఉన్నది తన కన్న కొడుకు సామ్రాట్ అని దాక్షాయణి అనుకుంటుంది. అందుకే ట్రీట్‌మెంట్ అంతా తన ఇంట్లోనే జరగాలని పట్టుబట్టి డాక్టర్లను పక్కనపెట్టి మరీ అతన్ని తనతో పాటు తీసుకెళ్లిపోతుంది.
డాక్టర్ల బ్లాక్‌మెయిల్
ఆస్పత్రికి చేరుకున్న చంద్రకు తన భర్తను ఎవరో తీసుకెళ్లిపోయారన్న వార్త పిడుగుపాటులా మారుతుంది. "ఆయన నా భర్త" అని చంద్ర వాదిస్తున్నా.. డాక్టర్లు ఆమె గొంతు నొక్కేస్తారు. ఫేస్ స్వాప్ చట్టరీత్యా నేరమని, అసలు సామ్రాట్ బాడీని ఇప్పటికే దహనం చేశారని గుర్తుచేస్తూ బెదిరింపులకు దిగుతారు.
{{/usCountry}}ఆస్పత్రికి చేరుకున్న చంద్రకు తన భర్తను ఎవరో తీసుకెళ్లిపోయారన్న వార్త పిడుగుపాటులా మారుతుంది. "ఆయన నా భర్త" అని చంద్ర వాదిస్తున్నా.. డాక్టర్లు ఆమె గొంతు నొక్కేస్తారు. ఫేస్ స్వాప్ చట్టరీత్యా నేరమని, అసలు సామ్రాట్ బాడీని ఇప్పటికే దహనం చేశారని గుర్తుచేస్తూ బెదిరింపులకు దిగుతారు.
{{/usCountry}}విరాట్‌ను తీసుకెళ్లిన వాళ్లు పెద్ద పలుకుబడి ఉన్నవాళ్లని డాక్టర్లు చెప్పడం, అటు మదన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చంద్ర ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూరుకుపోతుంది.
కొత్త ఇంటికి విరాట్
దాక్షాయణి ఇంటికి చేరుకున్న విరాట్‌కు స్పృహ వస్తుంది. కళ్లు తెరిచి చూడగానే చుట్టూ కొత్త మనుషులు, తెలియని వాతావరణం. వాళ్లంతా తనను 'సామ్రాట్' అంటుంటే.. "ఎవరు మీరు? నన్ను వదలండి!" అంటూ విరాట్ బెంబేలెత్తిపోతాడు.
తనకు గతం గుర్తులేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే దాక్షాయణి అతనికి పాత ఫోటోలు చూపించి శాంతింపజేస్తుంది. అక్కడే తమ్ముడు జీవన్, మరదలు చామంతి, తండ్రి కేశవరావుల పరిచయంతో విరాట్ పూర్తిగా ఒక కొత్త ఫ్యామిలీలోకి చేరిపోతాడు.
ఇదంతా మదన్ చాటు నుంచి గమనిస్తూనే ఉంటాడు. దాక్షాయణి విరాట్‌ను తీసుకెళ్తున్నప్పుడు ఫాలో అయిన మదన్.. ఆ ఇంట్లో విరాట్ పరిస్థితిని చూసి, ఒక పెద్ద సమస్యలో తమ వాడిని ఇరికించామని గ్రహించి సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకుంటాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
అసలు విరాట్ ఈ కొత్త 'సామ్రాజ్యం' నుంచి ఎలా బయటపడతాడు? ఎటు వెళ్లాలో తెలియక, ఎవరి సహాయం దొరక్క ఆస్పత్రిలో మిగిలిపోయిన చంద్ర తదుపరి అడుగు ఏంటి? అన్నది 'నిన్నుకోరి' రాబోయే ఎపిసోడ్లలో అత్యంత ఆసక్తికరంగా మారనుంది.