ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ఐపీఎల్ కొత్త సీజన్ వస్తుందంటే హుషారు మామూలుగా ఉండదు. ఓపెనింగ్ సెర్మనీలో ఏ సెలబ్రిటీ డ్యాన్స్ చేస్తారోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. కానీ ఐపీఎల్ 2026లో మాత్రం పరిస్థితి డిఫరెంట్ గా ఉండబోతుంది. ఈ సారి ఓపెనింగ్ సెర్మనీ లేకపోవడమే అందుకు కారణం.
ఐపీఎల్ 2026

ఐపీఎల్ 2026 నేడే (మార్చి 28) ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి పోరు జరగనుంది. అయితే, ప్రతి ఏటా అట్టహాసంగా జరిగే ఓపెనింగ్ సెర్మనీని ఈసారి బీసీసీఐ రద్దు చేసింది. దీని వెనుక ఒక విషాదకరమైన కారణం ఉంది.
గత ఏడాది విషాదం
2025లో ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ లీగ్ చరిత్రలోనే ఆర్సీబీ గెలిచిన ఫస్ట్ టైటిల్ ఇదే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.
ఆత్మలకు శాంతి
ఆ 11 మంది ఫ్యాన్స్ మరణాలకు గుర్తుగా, వారికి గౌరవం ఇస్తూ ఈ ఏడాది ఎలాంటి ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించడం లేదని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా ప్రకటించారు. మరణించిన ఆత్మలకు శాంతి కలగాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఆర్సీబీ నివాళి
కేవలం ఓపెనింగ్ సెర్మనీ రద్దు చేయడమే కాకుండా, ఆర్సీబీ యాజమాన్యం కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. స్టేడియంలోని 11 సీట్లను చనిపోయిన ఆ 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం ఖాళీగా ఉంచనున్నారు. అలాగే, వార్మప్ సమయంలో ఆటగాళ్లు '11' నంబర్ ఉన్న జెర్సీలను ధరించడంతో పాటు, మ్యాచ్ సమయంలో నల్లటి రిబ్బన్లు (Black Armbands) కట్టుకుని నివాళి అర్పించనున్నారు.
ముగింపు వేడుకలు ఘనంగా..
ఐపీఎల్ 2026 సీజన్ కు ప్రారంభ వేడుకలు లేకపోయినా, మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్ సమయంలో మాత్రం భారీ స్థాయిలో ముగింపు వేడుకలను నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. క్లోజింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తోంది. ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటానీ తన హాట్ డ్యాన్స్ తో ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే.
విరాట్ కోహ్లి
{{/usCountry}}ఐపీఎల్ 2026 సీజన్ కు ప్రారంభ వేడుకలు లేకపోయినా, మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్ సమయంలో మాత్రం భారీ స్థాయిలో ముగింపు వేడుకలను నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. క్లోజింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తోంది. ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటానీ తన హాట్ డ్యాన్స్ తో ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే.
విరాట్ కోహ్లి
{{/usCountry}}ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లి అనడంలో సందేహం లేదు. ఫస్ట్ నుంచి అదే ఫ్రాాంఛైజీకి కోహ్లి ఆడుతున్నాడు. ఇప్పుడు మరోసారి ఆర్సీబీ తరపున మైదానంలోకి దిగబోతున్నాడు. గత ఏడాది ఐపీఎల్ ట్రోఫీ కలను నిజం చేసుకున్న కోహ్లి.. ఈ సారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.