Bigg Boss: ఆ ఒక్క కండిషన్‌తోనే బిగ్ బాస్‌లోకి వెళ్లా, నా దాకా ఒక్క రూపాయి కూడా రాలేదు.. ఐటమ్ బ్యూటీ నోరా ఫతేహి కామెంట్స్

Nora Fatehi About Participating In Bigg Boss: బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మెరిసిన గ్లోబల్ డాన్సర్ నోరా ఫతేహి ఆ షోలోకి రావడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టారు. చేతిలో రూపాయి లేని ఆ క్లిష్ట సమయంలో కలర్స్ ఛానెల్‌తో తాను కుదుర్చుకున్న ప్రత్యేక ఒప్పందం గురించిన విషయాలను పంచుకున్నారు.

Published on: Sep 20, 2026, 12:08:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Nora Fatehi About Participating In Bigg Boss : బాలీవుడ్‌తో పాటు గ్లోబల్ వైడ్‌గా తన డాన్స్ స్టెప్పులతో ఊపేస్తున్న హాట్ బ్యూటీ నోరా ఫతేహి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఆమె గ్లామర్, ఎనర్జీ. ప్రైవేట్ ఆల్బమ్స్, పాపులర్ ఐటమ్ సాంగ్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ కెనడియన్ బ్యూటీ, కెరీర్ ప్రారంభంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆ ఒక్క కండిషన్‌తోనే బిగ్ బాస్‌లోకి వెళ్లా, నా దాకా ఒక్క రూపాయి కూడా రాలేదు.. ఐటమ్ బ్యూటీ నోరా ఫతేహి కామెంట్స్
ఆ ఒక్క కండిషన్‌తోనే బిగ్ బాస్‌లోకి వెళ్లా, నా దాకా ఒక్క రూపాయి కూడా రాలేదు.. ఐటమ్ బ్యూటీ నోరా ఫతేహి కామెంట్స్

టీవీ హిస్టరీలోనే అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్'లోకి అడుగుపెట్టడం వెనుక ఓ పెద్ద డ్రామానే ఉందంటూ తాజాగా నోరా ఫతేహి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ పాడ్‌కాస్ట్‌లో 'అన్‌ట్రిగ్గర్డ్' సంభాషణలో పాల్గొన్న నోరా ఫతేహి తన కెరీర్ ప్రారంభ రోజుల నాటి చేదు అనుభవాలను పంచుకున్నారు.

రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో బిగ్ బాస్ ఆఫర్!

"నేను కొన్ని పాటలు చేసినప్పటికీ నిర్మాతలు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. ఏజెన్సీలకు చెల్లించామని వారు చెప్పినా, నా దాకా రూపాయి కూడా రాలేదు. ఆ డబ్బుల కోసం నేను పోరాడుతున్న సమయంలోనే బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి నాకు పిలుపు వచ్చింది" అని నోరా ఫతేహి వెల్లడించారు.

మొదట్లో రియాలిటీ షోలను చిన్నచూపు చూసినట్లు నోరా అంగీకరించారు. "నా విజన్ మీకు అర్థం కావడం లేదు, నేను బిగ్ బాస్‌కు రాను అని మొదట చెప్పేశాను. వారు ఇచ్చే భారీ రెమ్యునరేషన్ గురించి వినగానే నా ఆలోచన మారింది" అని తెలిపారు. తెలివిగా వ్యవహరిస్తే ఈ ఓటీటీ షో ద్వారా ప్రతీ ఇంటా గుర్తింపు సాధించవచ్చని ఆ తర్వాత గ్రహించినట్లు నోరా చెప్పారు.

కలర్స్ ఛానెల్‌తో స్పెషల్ కండిషన్!

కేవలం డబ్బు కోసమే కాకుండా మరొక కండిషన్‌పై కూడా ఆమె బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టారు. "నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్తున్నాను కాబట్టి ఎక్కువ రోజులు ఉండనని నాకు తెలుసు. అందుకే దానికి బదులుగా మరొకటి ఆఫర్ చేయమన్నాను. నాకు 'జలక్ దిఖ్లా జా' డాన్స్ షోలో అవకాశం కావాలని, దానికి ఒప్పుకుంటేనే బిగ్ బాస్ చేస్తానని ఛానెల్ నిర్వాహకులకు తెగేసి చెప్పాను. వారు కూడా దానికి అంగీకరించారు" అని ఆమె స్పష్టం చేశారు.

బిగ్ బాస్ 9వ సీజన్ లో పాల్గొన్న సమయంలో తోటి పోటీదారు ప్రిన్స్ నరులాతో నోరా బంధం హాట్ టాపిక్‌గా మారింది. షోలో వీరిద్దరి మధ్య నడిచిన రూమర్స్, ప్రిన్స్ ఆమెకు రింగ్, పూలు ఇచ్చి ప్రపోజ్ చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఆ సీజన్‌లో ప్రిన్స్ విజేతగా నిలవడం విశేషం.

గ్లోబల్ స్టార్‌గా నోరా హవా.. రజినీకాంత్ 'జైలర్ 2'లో!

బిగ్ బాస్ తర్వాత వెనుతిరిగి చూసుకోని ఈ భామ, అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభోత్సవంలో గ్లోబల్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి చరిత్ర సృష్టించారు. ఫిఫా అధికారిక ట్రాక్ 'సిర్ సిర్' పాటలోనూ సందడి చేశారు.

ఇటీవల 'స్లే టు ది రిథమ్' అనే తన సొంత మ్యూజిక్ ఆల్బమ్‌ను ప్రకటించిన నోరా, త్వరలోనే దక్షిణాదిలో మరో భారీ ప్రాజెక్ట్‌తో సందడి చేయనున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో రానున్న బ్లాక్‌బస్టర్ సీక్వెల్ 'జైలర్ 2' చిత్రంలో అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఒక ప్రత్యేక డాన్స్ నంబర్‌లో నోరా ఫతేహి మెరవనున్నట్లు సమాచారం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More