...
...
Next Story

OTT Crime: ఓటీటీలో తమన్నా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్- ట్విస్టులతో సాగే 7 ఎపిసోడ్స్- 7 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

Tamanna November Story OTT Streaming: తమన్నా భాటియా నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ నవంబర్ స్టోరీ ఓటీటీలో ఆకట్టుకుంటోంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడే తండ్రిని ఓ హత్య కేసు నుంచి కాపాడుకునేందుకు ఓ ఎథికల్ హ్యాకర్ చేసే పోరాటమే ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ కథ. నవంబర్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.

Published on: Nov 19, 2026, 12:51:15 IST
Advertisement

Tamanna November Story OTT Release: ఓటీటీ వేదికలపై క్రైమ్, సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ కథలకు ఎప్పుడూ విపరీతమైన ఆదరణ ఉంటుంది. తెలుగు సహా దక్షిణాది ప్రేక్షకులు ఇలాంటి ఉత్కంఠభరిత కంటెంట్‌ను ఆదరించడంలో ముందుంటారు.

తమన్నా ఓటీటీ సిరీస్

ఓటీటీలో తమన్నా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్- ట్విస్టులతో సాగే 7 ఎపిసోడ్స్- 7 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలో తమన్నా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్- ట్విస్టులతో సాగే 7 ఎపిసోడ్స్- 7 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

మీరు కూడా సీటు అంచున కూర్చోబెట్టే డార్క్ క్రైమ్ థ్రిల్లర్ కోసం చూస్తుంటే, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించిన 'నవంబర్ స్టోరీ' సిరీస్ బెస్ట్ ఆప్షన్ . తమిళంలో తమన్నాకు ఇది తొలి ఓటీటీ ఎంట్రీ వెబ్ సిరీస్ కావడం విశేషం. ప్రతి ఎపిసోడ్‌లో ఊహించని మలుపులతో సాగే ఈ ఓటీటీ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

అసలు కథ ఏంటంటే..

ప్రముఖ క్రైమ్ నవలా రచయిత గణేశన్ (జీఎమ్ కుమార్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆయన అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధితో బాధపడుతుంటారు. సాఫీగా సాగిపోతున్న ఆయన జీవితం ఓ రోజు ఊహించని మలుపు తిరుగుతుంది.

ఓ హత్య జరిగిన ప్రదేశంలో శవం పక్కన గణేశన్ అపస్మారక స్థితిలో కనిపిస్తారు. అసలు అక్కడ ఏం జరిగిందో, తాను అక్కడికి ఎలా వచ్చానో ఆయనకు ఏమాత్రం గుర్తుండదు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో తన తండ్రి నిర్దోషి అని నిరూపించేందుకు కుమార్తె అనురాధ (తమన్నా భాటియా) రంగంలోకి దిగుతుంది.

వృత్తిరీత్యా ఎథికల్ హ్యాకర్ అయిన అనురాధ, పోలీసుల నుంచి తన తండ్రిని కాపాడుకునేందుకు ఒంటరి పోరాటం చేస్తుంది. మరోవైపు ఇన్‌స్పెక్టర్ సుదలై ఈ కేసును అధికారికంగా దర్యాప్తు చేస్తుంటారు. అసలు హంతకులను పట్టుకునే క్రమంలో అనురాధకు తన గతానికి సంబంధించిన చీకటి రహస్యాలు, భయంకరమైన నిజాలు తెలుస్తాయి. చివరకు అనురాధ తన తండ్రికి న్యాయం చేసిందా, ఆ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అన్నది ఓటీటీలోనే చూడాలి.

నవంబర్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్

మొత్తం 7 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ డార్క్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్‌కు ఇందిరా సుబ్రమణియన్ దర్శకత్వం వహించారు. తమన్నా భాటియా తన నటనతో ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కీలక పాత్రల్లో జీఎమ్ కుమార్, వివేక్ ప్రసన్న అద్భుతంగా నటించారు.

తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తోపాటు తమిళం, హిందీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ, కన్నడ వంటి 7 భాషల్లో జియో హాట్‌స్టార్‌లో 2021 సంవత్సరం మే 20న నవంబర్ స్టోరీ ఓటీటీ రిలీజ్ అయింది.

15 నిమిషాల్లో నచ్చకపోతే ఆపేస్తా: తమన్నా

ఈ సిరీస్ ద్వారా తమిళ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తమన్నా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "నాకు ఏకాగ్రత చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ఏదైనా వెబ్ సిరీస్ చూడటం మొదలుపెడితే మొదటి 15 నిమిషాల్లోనే అది నన్ను ఆకట్టుకోవాలి. లేదంటే వెంటనే ఆపేస్తాను, నచ్చితే మాత్రం పూర్తిగా చూసేస్తాను" అని తమన్నా చెప్పారు.

కరోనా లాక్‌డౌన్‌కు ముందు తాను ఎన్నో కథలు విన్నానని, వాటిలో వెబ్ సిరీస్ కథలే ఎక్కువగా ఉన్నాయని తమన్నా గుర్తుచేసుకున్నారు. "అప్పట్లోనే ఓ మంచి వెబ్ సిరీస్ చేయాలని నిర్ణయించుకున్నాను. 'నవంబర్ స్టోరీ' కథ వినగానే నాకు బాగా నచ్చింది. ఇదొక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్. చూస్తున్నంత సేపు నా దృష్టి మరలకుండా ఈ కథ నన్ను కట్టిపడేసింది" అని తమన్నా వివరించారు.

ఓటీటీలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్

గ్లామర్ పాత్రలకు భిన్నంగా తమన్నా చేసిన ఈ ప్రయోగం ఆమె కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. వీకెండ్‌లో మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ప్రతి ఎపిసోడ్ ట్విస్టులతో సాగే జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న'నవంబర్ స్టోరీ' థ్రిల్లింగ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks