obsession movie netflix: వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేసి, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచిన సరికొత్త హారర్ డ్రామా ‘అబ్సెషన్’ (Obsession) ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో విడుదలైన సమయంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన, బలమైన మౌత్ టాక్ కారణంగా ఈ ఇండిపెండెంట్ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
అబ్సెషన్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ పొందిన నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో ప్రపంచాన్ని వణికించిన అబ్సెషన్ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ హాలీవుడ్ మీడియా ప్లాట్‌ఫామ్ 'వాట్స్ ఆన్ నెట్‌ఫ్లిక్స్' అందించిన తాజా నివేదికల ప్రకారం, ఈ చిత్రం నవంబర్ 17, 2026 నుండి యునైటెడ్ స్టేట్స్ (US) లోని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
ఇండియాలో ఎప్పుడు?
అబ్సెషన్ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ లాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అంటే ఆయా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ హారర్ థ్రిల్లర్ అబ్సెషన్ మూవీ చూడాలంటే రెంట్ పే చేయాల్సిందే. అయితే నెట్‌ఫ్లిక్స్ లో ఇండియాలో అబ్సెషన్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న దానిపై క్లారిటీ లేదు. యూఎస్ లో రాగానే ఇండియాలో స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు.
ఒక చిన్న కోరిక.. ఊహించని నరకం!
యూట్యూబర్ నుంచి ఫిల్మ్ మేకర్‌గా మారిన ప్రతిభావంతుడైన దర్శకుడు కర్రీ బార్కర్ (Curry Barker) అబ్సెషన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. సైకలాజికల్ టెన్షన్, ఒళ్ళు గగుర్పొడిచే ట్విస్టులతో సాగే ఒక పక్కా సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది.
ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. సమాజానికి దూరంగా, ఒంటరిగా గడపడానికి ఇష్టపడే బేర్ (మైఖేల్ జాన్స్టన్) అనే కాలేజ్ స్టూడెంట్ చుట్టూ కథ తిరుగుతుంది. ఒకరోజు అతనికి మనుషుల కోరికలను తీర్చే ఒక వింతైన, రహస్య శక్తులు కలిగిన బొమ్మ దొరుకుతుంది.
నిక్కీ ప్రేమలో
{{/usCountry}}ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. సమాజానికి దూరంగా, ఒంటరిగా గడపడానికి ఇష్టపడే బేర్ (మైఖేల్ జాన్స్టన్) అనే కాలేజ్ స్టూడెంట్ చుట్టూ కథ తిరుగుతుంది. ఒకరోజు అతనికి మనుషుల కోరికలను తీర్చే ఒక వింతైన, రహస్య శక్తులు కలిగిన బొమ్మ దొరుకుతుంది.
నిక్కీ ప్రేమలో
{{/usCountry}}తను ప్రాణంగా ప్రేమిస్తున్న క్లోజ్ ఫ్రెండ్ నిక్కీ (ఇండే నవారెట్) తన ప్రేమలో పడాలనే స్వార్థంతో బేర్ బ్లాక్ మ్యాజిక్ ను ఆశ్రయిస్తాడు. ఆ బొమ్మ సాయంతో తను అనుకున్నది సాధించాలనుకుంటాడు. కానీ, అతడు తీసుకున్న ఆ ఒక్క తప్పుడు నిర్ణయం జీవితాన్ని ఊహించని భయంకరమైన నరకంలోకి నెట్టేస్తుంది.
ఒక చిన్న కోరిక కాస్తా భయంకరమైన పీడకలగా ఎలా మారింది? ఆ శక్తుల నుంచి వారు ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు? అనేదే అబ్సెషన్ చిత్ర ముఖ్యాంశం. ఒక పాపులర్ యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్‌లోని హారర్ ఎపిసోడ్ లైన్ ఆధారంగా ప్రేరణ పొంది, దర్శకుడు ఈ పూర్తి నిడివి కథను అద్భుతంగా తెరకెక్కించారు.