OTT Horror Thriller: ప్రియుడికి చనిపోయిన పిల్లిని వండి పెట్టడం, ఆ లవర్ నే చంపి తినాలనుకోవడం.. దీన్ని లవ్ అంటారా? కాదు పిచ్చి అంటారు. అలాంటి పిచ్చి ప్రేమ కాన్సెప్ట్ తోనే తెరకెక్కిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమానే ‘అబ్సెషన్’. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ఎలాంటి సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే.
అబ్సెషన్ తెలుగు ఓటీటీ

బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ అబ్సెషన్ ఎప్పుడో ఓటీటీలోకి వచ్చింది. ముందు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అయింది. ఆ తర్వాత జియోహాట్స్టార్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు రీసెంట్ గా జియోహాట్స్టార్లోనే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా డబ్బింగ్ లో రిలీజైంది.
మళ్లీ ట్రెండింగ్ లో
తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో జియోహాట్స్టార్ ఓటీటీలోకి అబ్సెషన్ అందుబాటులోకి రావడంతో ఈ మూవీ పేరు మరోసారి ట్రెండింగ్ గా మారింది. సౌత్ ఇండియా మూవీ లవర్స్ ఈ చిత్రాన్ని ఓటీటీలో తమ భాషలో తెగ చూసేస్తున్నారు. నిక్కీ సైకో లవ్ ను, ఆమె యాక్టింగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఓటీటీలో అబ్సెషన్ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది.
ఆ కాన్సెప్ట్ కేక
అబ్సెషన్ మూవీ కాన్సెప్ట్ కేక అని చెప్పాలి. తాను ప్రేమించే నిక్కీ ప్రపంచంలో ఇంకెవరూ ప్రేమించలేనంతగా తనను ప్రేమించాలని బేర్ కోరుకుంటాడు. అంతే ఇక ప్రేమలో ఎక్స్ ట్రీమ్ సైకోయిజాన్ని చూపిస్తూ ఆ అమ్మాయి నిక్కీ రెచ్చిపోతుంది. అతణ్ని పిచ్చిగా ప్రేమించేస్తుంది. తనకు ఒక్క క్షణం దూరంగా ఉన్నా తట్టుకోలేకపోతుంది.
నిద్రలోనూ బేర్ క్యూట్ గా ఉన్నాడని నిక్కీ నిద్రపోకుండా చూస్తుంటుంది. తనను బయటకు తీసుకెళ్లలేదని తల పగలగొట్టుకుంటుంది. బేర్ తో క్లోజ్ గా ఉన్నందుకు తన ఫ్రెండ్ అయిన అమ్మాయిని నిక్కీ అత్యంత రాక్షసంగా చంపేస్తుంది. చివరకు బేర్ నే చంపి తినాలనుకుంటుంది. ఇదంతా తట్టుకోలేక బేర్ సూసైడ్ చేసుకుంటాడు.
7 కోట్ల బడ్జెట్.. 4 వేల కోట్ల వసూళ్లు
{{/usCountry}}నిద్రలోనూ బేర్ క్యూట్ గా ఉన్నాడని నిక్కీ నిద్రపోకుండా చూస్తుంటుంది. తనను బయటకు తీసుకెళ్లలేదని తల పగలగొట్టుకుంటుంది. బేర్ తో క్లోజ్ గా ఉన్నందుకు తన ఫ్రెండ్ అయిన అమ్మాయిని నిక్కీ అత్యంత రాక్షసంగా చంపేస్తుంది. చివరకు బేర్ నే చంపి తినాలనుకుంటుంది. ఇదంతా తట్టుకోలేక బేర్ సూసైడ్ చేసుకుంటాడు.
7 కోట్ల బడ్జెట్.. 4 వేల కోట్ల వసూళ్లు
{{/usCountry}}ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం అబ్సెషన్ సినిమాను కేవలం 750,000 డాలర్ల బడ్జెట్ తో (అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.6 నుంచి 7 కోట్లు) నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా 524.5 మిలియన్ డాలర్లు (రూ. 4,300 కోట్లకు పైగా) వసూలు చేసి ట్రేడ్ పండితుల మైండ్ బ్లాక్ చేసింది. సినిమా హిస్టరీలోనే 1 మిలియన్ డాలర్ల కంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.