...
...
Next Story

OTT Horror: ఓటీటీలోకి రెంట్ లేకుండా వస్తున్న 4 వేల కోట్ల హారర్ థ్రిల్లర్- సెన్సార్ డిలీట్ చేసిన సీన్లతో సహా- ఎక్కడంటే?

Obsession OTT Streaming In India: 4 వేల కోట్లకుపైగా వసూళ్లతో రికార్డులు తిరగరాసిన హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' భారతీయ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు ఎలాంటి రెంట్ లేకుండా వచ్చేస్తోంది. సెన్సార్ అన్‌కట్ వర్షన్‌తో అబ్సెషన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఏ ఓటీటీలో, ఎప్పుడు రిలీజ్ అనే వివరాలపై లుక్కేద్దాం.

Published on: Oct 18, 2026, 21:40:19 IST
Advertisement

Obsession OTT Release In India: హ్యాలోవీన్ పండుగ వేళ భయానక చిత్రాలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు హాలీవుడ్ నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మైండ్ బెండింగ్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' త్వరలోనే భారతీయ ఓటీటీ వీక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది.

ఒక చిన్న కోరిక.. ఊహించని విపత్తు!

ఓటీటీలోకి రెంట్ లేకుండా వస్తున్న 4 వేల కోట్ల హారర్ థ్రిల్లర్- సెన్సార్ డిలీట్ చేసిన సీన్లతో సహా- ఎక్కడంటే?
ఓటీటీలోకి రెంట్ లేకుండా వస్తున్న 4 వేల కోట్ల హారర్ థ్రిల్లర్- సెన్సార్ డిలీట్ చేసిన సీన్లతో సహా- ఎక్కడంటే?

ప్రేమికురాలి ప్రేమ అతిగా మారితే ఎలాంటి భయంకర పరిణామాలు ఎదురవుతాయో తెలిపే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంగీత పరికరాల దుకాణంలో పనిచేసే బెకార్ బెయిలీ (మైఖేల్ జాన్సన్) అమాయకుడు, సిగ్గుపడే స్వభావం ఉన్న యువకుడు. తనతో పాటు పనిచేసే నిక్కీ (ఇండే నవారెట్) అనే ధైర్యవంతమైన అమ్మాయిని అతను ప్రేమిస్తాడు.

కానీ, తన మనసులోని మాటను చెప్పలేక నానా అవస్థలు పడతాడు. ఈ క్రమంలో ఒక క్రిస్టల్ షాప్‌లో 'వన్ విష్ విల్లో' అనే రహస్యమైన బొమ్మ అతనికి దొరుకుతుంది. ఆ బొమ్మ కొనుగోలు చేసిన వారికి మంచి జరగలేదని దుకాణదారుడు హెచ్చరించినా పట్టించుకోకుండా, నిక్కీ తనను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించాలని బెకార్ ఒక కోరిక కోరుకుంటాడు.

ఆ కోరిక నెరవేరి నిక్కీ అతని ప్రేమలో పడుతుంది. కానీ క్రమంగా ఆమె చూపించే ప్రేమ అతిగా మారి, భయంకరమైన రూపాన్ని దాలుస్తుంది. పిచ్చి ప్రేమ ఎంతటి ప్రమాదానికి దారితీసిందో గ్రహించిన బెకార్, తన కోరికను వెనక్కి తీసుకోడానికి ఎలాంటి పోరాటం చేశాడనేది మిగతా కథ.

6.5 కోట్ల బడ్జెట్- 4,300 కోట్లకు పైగా కలెక్షన్స్!

కరీ బార్కర్ దర్శకత్వం వహించిన అబ్సెషన్ చిత్రం హాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. కేవలం 7.5 లక్షల డాలర్లు (సుమారు రూ. 6.5 కోట్ల నుంచి 7.5 కోట్లు) బడ్జెట్‌తో నిర్మించిన అబ్సెషన్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 522 మిలియన్ డాలర్ల (రూ. 4,300 కోట్లకు పైగా) వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

యూట్యూబ్ నుంచి హాలీవుడ్ సంచలనం వరకు!

మొదట యూట్యూబ్, టిక్‌టాక్‌లలో కామిక్ స్కెచ్‌లతో గుర్తింపు తెచ్చుకున్న కరీ బార్కర్.. 2024లో 'మిల్క్ అండ్ సీరియల్' అనే చిన్న బడ్జెట్ హారర్ చిత్రంతో తన మార్కు చూపించారు. ఇప్పుడు 'అబ్సెషన్' చిత్రంతో ఏకంగా హాలీవుడ్ టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు.

గంటా 49 నిమిషాల నిడివి ఉన్న అబ్సెషన్ చిత్రంలో మైఖేల్ జాన్సన్, ఇండే నవారెట్, కూపర్ టామ్లిన్సన్, మేగన్ లాలెస్, ఆండీ రిక్టర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ అబ్సెషన్ ఓటీటీలోకి వచ్చేయనుంది. ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంటల్ విధానంలో ఉన్న అబ్సెషన్ ఇప్పుడు ఫ్రీగా స్ట్రీమింగ్ కానుంది.

జియోహాట్‌స్టార్‌లో ఒరిజినల్ అన్‌కట్ వెర్షన్!

జియోహాట్‌స్టార్‌లోని 'ది పీకాక్ హబ్' వేదికగా అబ్సెషన్ ఓటీటీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 30న సాయంత్రం 7 గంటల జియో హాట్‌స్టార్‌లో అబ్సెషన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. థియేటర్లలో డిలీట్ చేసిన సీన్లతో అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్‌ను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సెన్సార్ కత్తెర పడని సన్నివేశాలతో నేరుగా థియేట్రికల్ అనుభూతిని ఓటీటీ స్క్రీన్‌పై అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఓటీటీలో హారర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ హ్యాలోవీన్ సీజన్‌లో ఇది ఒక బెస్ట్ వాచ్ అని చెప్పవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks