Oh Butterfly OTT Release Details: ప్రస్తుతం వెండితెరపై థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. అందులోనూ మనిషిలోని మానసిక సంఘర్షణలను, రహస్యాలను ఇతివృత్తంగా తీసుకుని వచ్చే 'సైకలాజికల్ థ్రిల్లర్స్'కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ సైకలాజికల్ థ్రిల్లర్‌కు రొమాంటిక్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే.. ఆ కోవకే చెందుతుంది 'ఓ బటర్‌ఫ్లై' మూవీ.
విభిన్నమైన కథాంశం

ఇటీవలే కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ఓ బటర్‌ఫ్లై సినిమాకు డైరెక్టర్ విజయ్ రంగనాథన్ కథ, దర్శకత్వం వహించారు. ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను థియేటర్లలో అలరించింది ఈ సినిమా. రీసెంట్‌గా థియేట్రికల్ రన్‌ను ముగించుకుని ఓ బటర్‌ఫ్లై ఓటీటీలోకి వచ్చేసింది.
కథా నేపథ్యం ఇదే..
ఓ బటర్‌ఫ్లై సినిమాలో గౌరీ (నివేదితా సతీష్) అనే యువతి పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. గౌరీకి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) ఉంటుంది. తన గతం గురించి ఒక లోతైన రహస్యాన్ని తన భర్తకు చెప్పాలని భావించిన ఆమె, అతడిని ఒక మారుమూల హిల్ స్టేషన్‌లోని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్తుంది గౌరీ.
అక్కడ ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా, ఏకాంతంగా గడపాలని వెళ్లిన ఆ జంటకు కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. బటర్‌ఫ్లై (సీతాకోకచిలుక) ద్వారా వారికి సంకేతాలు వస్తుంటాయి. ఆ సంకేతాలతో అక్కడున్న రహస్యాలను ఆ జంట ఎలా ఛేదించిందో చెప్పే సినిమానే ఓ బటర్‌ఫ్లై. అంటే సీతాకోకచిలుకతో సీక్రెట్స్ బయటకొస్తాయని తెలుస్తోంది.
నటీనటుల ప్రతిభ
బటర్‌ఫ్లై సంకేతాలను వాడుకుంటూ రహస్యాలను ఎలా కనిపెట్టారనేది సినిమాలో ఉత్కంఠభరితంగా డైరెక్టర్ చూపించారు. గతంలో పలు ఓటీటీ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో మెప్పించిన నివేదితా సతీష్ ఈ సినిమాలో మెయిన్ రోల్ పోషించింది. తన నటనతో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ వచ్చేలా చేసింది.
బిగువైన అనుభూతి
గౌరీగా నివేదితా సతీష్ పండించిన హావభావాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గౌరీ భర్త సూర్య పాత్రలో సిబి భువన చంద్రన్ నటించగా, మరికొన్ని కీలక పాత్రల్లో సీనియర్ నటుడు నాజర్, లక్ష్మి ప్రియ చంద్రమౌళి తమదైన ముద్ర వేశారు. సాంకేతికంగా చూస్తే, సినిమాలోని కెమెరా పనితనం, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు ఒక రకమైన 'క్లాస్ట్రోఫోబిక్' (బిగువైన) అనుభూతిని కలిగిస్తాయి.
{{/usCountry}}గౌరీగా నివేదితా సతీష్ పండించిన హావభావాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గౌరీ భర్త సూర్య పాత్రలో సిబి భువన చంద్రన్ నటించగా, మరికొన్ని కీలక పాత్రల్లో సీనియర్ నటుడు నాజర్, లక్ష్మి ప్రియ చంద్రమౌళి తమదైన ముద్ర వేశారు. సాంకేతికంగా చూస్తే, సినిమాలోని కెమెరా పనితనం, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు ఒక రకమైన 'క్లాస్ట్రోఫోబిక్' (బిగువైన) అనుభూతిని కలిగిస్తాయి.
{{/usCountry}}రొమాంటిక్, సైకలాజికల్ ఇన్సిడెంట్స్‌తో థ్రిల్లింగ్‌గా తెరకెక్కిన ఓ బటర్‌ఫ్లై సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ఐఎమ్‌డీబీలో 10కి ఏకంగా 8.4 రేటింగ్ కూడా సాధించింది ఈ ఓ బటర్‌ఫ్లై మూవీ. అలాంటి ఓ బటర్‌ఫ్లై ఓటీటీలోకి రెండు రోజుల క్రితమే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఓటీటీలో ఎప్పుడు? ఎక్కడ?
మే 8న ఓ బటర్‌ఫ్లై ఓటీటీ రిలీజ్ అయింది. సన్ నెక్ట్స్ ప్లాట్‌ఫామ్‌లో ఓ బటర్‌ఫ్లై ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం కేవలం తమిళ భాషలో, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో మాత్రమే సన్ నెక్ట్స్‌లో ఓ బటర్‌ఫ్లై ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి సన్ నెక్ట్స్ ఓటీటీ మూవీ ఓ బటర్‌ఫ్లై మంచి ఆప్షన్.