...
...
Next Story

OTT Crime Thriller: ఓటీటీలో దిమ్మదిరిగే క్రైమ్ థ్రిల్లర్.. మన శోభితా ధూళిపాళ్ల తొలి మూవీ.. ఐరన్ రాడ్‌తో నరమేధం..

OTT Crime Thriller: క్రైమ్, సైకో థ్రిల్లర్ లాంటి సినిమాలు మీకు ఇష్టమే. అయితే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ మిస్ కావద్దు. ఈ సినిమా పేరు రమన్ రాఘవ్ 2.0. శోభితా ధూళిపాళ్ల బాలీవుడ్ డెబ్యూ మూవీకి ఐఎండీబీలో 7.3 రేటింగ్ ఉంది.

Published on: Aug 20, 2026, 15:15:43 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Crime Thriller: బాలీవుడ్ హిస్టరీలోనే అత్యంత డార్క్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా నిలిచిన ‘రమన్ రాఘవ్ 2.0’ (Raman Raghav 2.0) ప్రస్తుతం ఓటీటీలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 7.3 ఐఎమ్‌డీబీ (IMDb) రేటింగ్ సాధించిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, విక్కీ కౌశల్ తమ నటనతో నరనరాలు తోడేసే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మన శోభితా ధూళిపాళ్లకు ఇదే తొలి హిందీ మూవీ కావడం విశేషం.

1960ల నాటి భయంకరమైన సీరియల్ కిల్లర్ రియల్ స్టోరీ

OTT Crime Thriller: ఓటీటీలో దిమ్మదిరిగే క్రైమ్ థ్రిల్లర్.. మన శోభితా ధూళిపాళ్ల తొలి మూవీ.. ఐరన్ రాడ్‌తో నరమేధం..
OTT Crime Thriller: ఓటీటీలో దిమ్మదిరిగే క్రైమ్ థ్రిల్లర్.. మన శోభితా ధూళిపాళ్ల తొలి మూవీ.. ఐరన్ రాడ్‌తో నరమేధం..

డార్క్ అండ్ రా సినిమాలు తీయడంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌కి ప్రత్యేకమైన స్టైల్ ఉంది. 1960ల కాలంలో ముంబై నగరాన్ని వణికించిన సైకో సీరియల్ కిల్లర్ 'రమన్ రాఘవ్' నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

అంతర్జాతీయ వేదికలపై 'సైకో రమన్' (Psycho Raman) పేరుతో రిలీజైన ఈ మూవీ, సాధారణ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా మొదలవుతుంది. కానీ పోనూ పోనూ ఒక సైకో కిల్లర్‌కి, డ్రగ్స్‌కి అలవాటు పడిన ఓ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్‌కి మధ్య ఉండే సైకలాజికల్ కనెక్షన్‌తో కథ ఊహించని మలుపులు తిరుగుతుంది.

ఇనుప రాడ్‌తో నరమేధం.. నవాజుద్దీన్ సిద్ధిఖీ రా పెర్ఫార్మెన్స్

ఈ సినిమాలో సైకో కిల్లర్ 'రమన్' పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ జీవించేశారు. చేతిలో ఇనుప రాడ్ పట్టుకుని, దారిన పోయే అమాయకులను దారుణంగా హత్య చేసే క్రూరమైన రోల్‌లో నవాజ్ చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడవడం ఖాయం.

నవాజ్ విలనిజంలో చూపించిన టైమింగ్, ఆ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తాయి. 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' తర్వాత అనురాగ్ కశ్యప్ - నవాజుద్దీన్ కాంబోలో వచ్చిన ఈ మూవీ వారి కెరీర్‌లోనే ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిపోయింది.

విక్కీ కౌశల్ డార్క్ సైడ్.. శోభిత ధూళిపాళ్ల బాలీవుడ్ డెబ్యూ

ఈ సినిమాతోనే తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల తన బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ రోల్ చిన్నదే అయినా, తన గ్లామర్ అండ్ యాక్టింగ్‌తో బాలీవుడ్ దృష్టిని ఆకర్షించి తర్వాత 'మేడ్ ఇన్ హెవెన్', 'గూఢచారి' లాంటి ప్రాజెక్ట్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

జీ5లో స్ట్రీమింగ్.. ఈ వీకెండ్ క్రేజీ ఛాయిస్

"చట్టం వల్ల యూనిఫామ్ వేసుకున్నవాడు బతికిపోతాడు.. యూనిఫామ్ లేనివాడు కిల్లర్ అయిపోతాడు" అంటూ సినిమాలో వచ్చే డైలాగ్స్ ఈ కథలోని లోతుని తెలియజేస్తాయి. రీసెంట్‌గా రణబీర్ కపూర్ యానిమల్ టైప్ ఇంటెన్స్ డార్క్ థ్రిల్లర్స్ నచ్చే వారికి ఇది పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్.

సైకలాజికల్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే సినీ ప్రియులు ఈ వీకెండ్‌లో 'రామన్ రాఘవ్ 2.0' సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5)లో హ్యాపీగా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe