...
...
Next Story

Carmeni Selvam: సూర్యుని చుట్టూ భూమి తిరగడం ఎప్పుడో ఆగిపోయింది, అంతా డబ్బు చుట్టూనే: ఓటీటీ డైరెక్టర్ తేజ కాకుమాను

Samuthirakani Carmeni Selvam Trailer Launch: ప్రముఖ నటుడు సముద్రఖని నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా చిత్రం కార్మేని సెల్వం. తాజాగా మార్చి 26న కార్మేని సెల్వం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్‌లో ఓటీటీ డైరెక్టర్ తేజ కాకుమాను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Mar 27, 2026, 09:04:28 IST
Advertisement

నటుడు, దర్శకుడు సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కార్మేని సెల్వం. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు ఈ సినిమాను నిర్మించారు. రామ్ చక్రి దర్శకత్వం వహించిన కార్మేని సెల్వం తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా విడుదల కానుంది.

ఏప్రిల్ 3న 2 భాషల్లో

సూర్యుని చుట్టూ భూమి తిరగడం ఎప్పుడో ఆగిపోయింది, అంతా డబ్బు చుట్టూనే: ఓటీటీ డైరెక్టర్ తేజ కాకుమాను
సూర్యుని చుట్టూ భూమి తిరగడం ఎప్పుడో ఆగిపోయింది, అంతా డబ్బు చుట్టూనే: ఓటీటీ డైరెక్టర్ తేజ కాకుమాను

విలక్షణ నటుడు సముద్ర ఖనితోపాటు ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే, కార్మేని సెల్వం సినిమాలో లక్ష్మీ ప్రియా, అభినయ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.

కార్మేని సెల్వం ట్రైలర్ రిలీజ్

ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా తాజాగా గురువారం (మార్చి 26) కార్మేని సెల్వం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

కార్మేని సెల్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్

ప్రస్తుత ట్రెండ్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో విడుదలైన ట్రైలర్ కార్మేని సెల్వం సినిమాపై అంచనాలు పెంచుతోంది. అయితే, హైదరాబాద్‌లో కార్మేని సెల్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ డైరెక్టర్

ఈ కార్యక్రమానికి సముద్రఖనితో వర్క్ చేసిన తెలుగు డైరెక్టర్స్ ‘విమానం’ ఫేమ్ శివ ప్రసాద్, ‘రామం రాఘవం’ ఫేమ్ ధనరాజ్, ఓటీటీ సూపర్ హిట్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ ఫేమ్ తేజ కాకుమాను అతిథులుగా హాజరయ్యారు.

విమానం దర్శకుడు శివ కామెంట్స్

ఓటీటీ సిరీస్ డైరెక్టర్ తేజ కాకుమాను మాట్లాడుతూ.. "భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఎప్పుడో ఆగిపోయింది. ఇప్పుడు అంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది" అని తెలిపారు.

ధనరాజ్ కామెంట్స్

కమెడియన్, దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ.. "ఇలాంటి మంచి కథలను ఎంకరేజ్ చేస్తేనే మంచి సినిమాలు మరిన్ని వస్తాయి. ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా" అని చెప్పుకొచ్చారు.

అందరికీ కనెక్ట్ అవుతుంది

ప్రొడ్యూసర్ అరుణ్ రంగరాజులు మాట్లాడుతూ.. "ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది. మా డిస్ట్రిబ్యూషన్ పార్టనర్‌‌గా వ్యవహరిస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్‌కు స్పెషల్ థ్యాంక్స్" అని చెప్పారు.

ఎలాంటి రోల్ అయినా చేయగలరు

"ఈ క్యారెక్టర్ చేయడం గర్వంగా ఉంది. సముద్రఖని గారితో వర్క్ చేయడం గ్రేట్ హానర్‌గా భావిస్తున్నా. ఆయన ఎలాంటి రోల్ అయినా చేయగలరు. అందరినీ అవేర్నెస్ చేసేలా ఈ సినిమా ఉంటుంది" అని కార్మేని సెల్వం నటి అభినయ తెలిపింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks