ఆది శంకరా, ఆపదలు తీర్చే భోళా శంకరుడా, కోరికలు నెరవేర్చే లింగమా.. ఇలా ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి భక్తులు శివ నామ స్మరణ చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శివుణ్ని కొలుస్తూ ఉపవాసం ఉండటమే కాకుండా రాత్రి జాగారం కూడా చేస్తారు. రాత్రి జాగారం ఉండే భక్తులారా.. ఓటీటీలో ఈ సినిమాలు చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోండి. ఈ తెలుగు డివోషనల్ మూవీస్ పై ఓ లుక్కేయండి.
భూ కైలాస్ ఓటీటీ

తెలుగు భక్తి సినిమాల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా ‘భూ కైలాస్’. ఇందులో దివంగత సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించారు. ఈ భూ కైలాస్ మూవీ శివభక్తికి నిదర్శనం. అప్పటి తరం సినిమా అభిమానులైనా, శివుని భక్తులైనా ఈ క్లాసిక్ మూవీపై ఓ లుక్కేయండి. ఇది యూట్యూబ్ తో పాటు ఎమ్ఎక్స్ ప్లేయర్ లో ఉంది.
భక్త కన్నప్ప ఓటీటీ
ఎన్ని తరాలు మారినా తెలుగు భక్తి సినిమాల ప్రస్తావన వంచినప్పుడు తప్పకుండా మట్లాడుకునే మూవీ ‘భక్త కన్నప్ప’. కృష్ణంరాజు అద్భుత యాక్టింగ్ తో ఈ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్. శివుని ప్రతిరూపమైనా లింగానికి తన కళ్లు పెట్టే కన్నప్ప సీన్ ఎప్పటికీ గుర్తుండిపోయేదే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ, యూట్యూబ్ లో ఉంది.
శ్రీ మంజునాథ ఓటీటీ
మెగాస్టార్ చిరంజీవి శివుడిగా నటించిన సినిమా ‘శ్రీ మంజునాథ’. ఇందులో యాక్షన్ హీరో అర్జున్ సర్జా గొప్ప శివభక్తుడిగా నటించాడు. ఈశ్వరుని గొప్పతనాన్ని, భక్తుల బాధలు తీర్చే ఆ ఉమామహేశ్వరుడి భోళా తనాన్ని చాటే సినిమా ఇది. శివరాత్రి జాగారానికి ఈ మూవీ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. శ్రీ మంజునాథ మూవీని యూట్యూబ్ లో చూడొచ్చు.
అఖండ
ఇక ఈ జనరేషన్ విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’, ‘అఖండ 2’ సినిమాలు కూడా భక్తి భావంతో నిండినవే. అఘోరాగా శివతత్వాన్ని చాటే పాత్రలో బాలకృష్ణ నటించాడు. అఖండ సినిమా ఏమో జియోహాట్ స్టార్ లో , అఖండ 2 ఏమో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
కార్తీకేయ 2
{{/usCountry}}ఇక ఈ జనరేషన్ విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’, ‘అఖండ 2’ సినిమాలు కూడా భక్తి భావంతో నిండినవే. అఘోరాగా శివతత్వాన్ని చాటే పాత్రలో బాలకృష్ణ నటించాడు. అఖండ సినిమా ఏమో జియోహాట్ స్టార్ లో , అఖండ 2 ఏమో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
కార్తీకేయ 2
{{/usCountry}}టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ లీడ్ రోల్ ప్లే చేసిన డివోషనల్ థ్రిల్లర్ ‘కార్తీకేయ 2’. ఓ వైపు దేవుడిపై భక్తిని పంచుతూనే, మరోవైపు థ్రిల్ కూడా అందించే సినిమా ఇది. ఈ మూవీ జీ5 ఓటీటీలో ఉంది. ఇక నాగార్జున నటించిన ఢమరుకం (సన్ నెక్ట్స్, ప్రైమ్ వీడియో), మహాభక్త సిరియాళ (జియోహాట్ స్టార్), జగద్గురు ఆదిశంకర (ఎంఎక్స్ ప్లేయర్) సినిమాలు కూడా భక్తిభావంతో నిండినవే.