...
...
Next Story

OTT October Releases: ఓటీటీ అక్టోబర్ రిలీజెస్.. ఇది అసలైన పండుగ సీజన్.. థ్రిల్లర్ నుంచి హారర్ వరకు మూవీస్, వెబ్ సిరీస్

OTT October Releases: అక్టోబర్ నెల రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త నెల తొలి రోజు నుంచే ఓటీటీలో సందడి మొదలు కానుంది. ఈ నెల ఎన్నో క్రేజీ మూవీస్, వెబ్ సిరీస్, రియాల్టీ షోలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ పూర్తి జాబితా ఇక్కడ చూడండి.

Published on: Sep 30, 2026, 14:25:03 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT October Releases: అక్టోబర్ నెల డిజిటల్ ప్రేమికులకు అసలైన పండగ వాతావరణం తీసుకురాబోతోంది. థియేటర్లలో బిగ్ బడ్జెట్ సినిమాల హంగామా ఒకవైపు ఉంటే, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌‌ఫామ్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5లలో కంటెంట్ సునామీ రానుంది. ఈ పండగ సీజన్ లో అసలైన పండుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోనే కనిపించనుంది.

OTT October Releases: ఓటీటీ అక్టోబర్ రిలీజెస్.. ఇది అసలైన పండుగ సీజన్.. థ్రిల్లర్ నుంచి హారర్ వరకు మూవీస్, వెబ్ సిరీస్
OTT October Releases: ఓటీటీ అక్టోబర్ రిలీజెస్.. ఇది అసలైన పండుగ సీజన్.. థ్రిల్లర్ నుంచి హారర్ వరకు మూవీస్, వెబ్ సిరీస్

హారర్, థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీలతో పాటు రియాలిటీ షోల వరకు వినోదాన్ని పంచేందుకు అన్ని ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమయ్యాయి. అక్టోబర్ మొదటివారం నుంచే డిజిటల్ వేదికలపైకి వస్తున్న క్రేజీ సినిమాలు, సిరీస్‌ల వివరాలు ఇక్కడ చూద్దాం.

సౌత్ స్పెషల్: తేజ సజ్జా 'ది ట్రైటర్స్' నుంచి మలయాళ హిట్ల వరకు..

తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రైమ్ వీడియో ఒరిజినల్ రియాలిటీ షో 'ది ట్రైటర్స్ తెలుగు' అక్టోబర్ 15న గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సెలబ్రిటీలు ఒకే హవేలీలో ఉంటూ మైండ్ గేమ్స్ ఆడే ఈ షో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ అందించడం ఖాయం.

అలాగే అక్టోబర్ 1న నెట్‌ఫ్లిక్స్‌లో 'రోమాంచకం' రాబోతోంది. ఈ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీని ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నిర్మించిన విషయం తెలిసిందే. థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో ఏం చేస్తుందో చూడాలి.

అటు నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా వచ్చిన మలయాళ హిట్ 'బెత్లేహెం కుటుంబ యూనిట్' అక్టోబర్ 2న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ అత్యధిక వసూళ్ల మలయాళ మూవీ తెలుగులోనూ రానుంది.

కోర్ట్‌రూమ్ డ్రామాలు, థ్రిల్లర్లు: మృణాల్ ‘పూజా మేరీ జాన్’

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి కలిసి నటించిన ఇంటెన్స్ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ 'పూజా మేరీ జాన్' అక్టోబర్ 2న జీ5 ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుంది. ఒక లవ్ రిజెక్షన్ వల్ల ఎదురైన ఆత్మహత్య కేసు, ఆ తర్వాత కోర్టులో సాగే లీగల్ పోరాటం చుట్టూ ఈ క్రైమ్ థ్రిల్లర్ సాగుతుంది.

వర్సటైల్ నటుడు పంకజ్ త్రిపాఠి, పవన్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్ డ్రామా 'ఓ మై డాగ్' అక్టోబర్ 1న నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. తప్పిపోయిన కుక్కను వెతికే ఒక బాబు, మరోవైపు కనిపించకుండా పోయిన కూలీ కథను కామెడీ కలగలిపి తెరకెక్కించారు.

హాలీవుడ్ భారీ ప్రాజెక్టులు: బెన్ అఫ్లెక్ 'యానిమల్స్', మార్వెల్ ‘విజన్ క్వెస్ట్’

హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఇష్టపడే వారికి కూడా ఈ నెలలో బోలెడంత కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. ఆస్కార్ విన్నర్ బెన్ అఫ్లెక్ దర్శకత్వంలో కేరీ వాషింగ్టన్, స్టీవెన్ యెయున్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'యానిమల్స్' అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతోంది.

జాన్ సీనా, జెస్సికా బీల్ నటించిన యాక్షన్ కామెడీ 'మ్యాచ్‌బాక్స్: ది మూవీ' అక్టోబర్ 9న ఆపిల్ టీవీ ప్లస్‌లో వస్తోంది. అలాగే మార్వెల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'వాండావిజన్' స్పిన్-ఆఫ్ సిరీస్ 'విజన్ క్వెస్ట్' అక్టోబర్ 14న జియోహాట్‌స్టార్ వేదికగా ప్రసారం కానుంది.

స్టీఫెన్ కింగ్ పాపులర్ హారర్ నవల ఆధారంగా మైక్ ఫ్లానగన్ తెరకెక్కించిన 'క్యారీ' సిరీస్ అక్టోబర్ 7న ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. చిన్నతనంలోనే అతీంద్రియ శక్తులు పొందిన ఒక అమ్మాయి కథతో ఈ సిరీస్ భయపెట్టనుంది. ఇక అక్టోబర్ లో రిలీజయ్యే క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్, రియాల్టీ షోల పూర్తి జాబితాను కింద ఉన్న టేబుల్లో చూడొచ్చు.

అక్టోబర్ 2026 ఓటీటీ రిలీజ్ షెడ్యూల్ ఇలా

రిలీజ్ డేట్ టైటిల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్జోనర్
అక్టోబర్ 01దుపహియా సీజన్ 2 (Dupahiya Season 2) ప్రైమ్ వీడియోకామెడీ
అక్టోబర్ 01ఓ మై డాగ్ (Oh My Dog)నెట్‌ఫ్లిక్స్ఇన్వెస్టిగేటివ్
అక్టోబర్ 01ఈస్ట్ ఆఫ్ ఈడెన్ (East of Eden)నెట్‌ఫ్లిక్స్డ్రామా
అక్టోబర్ 01రోమాంచకమ్ (మల్టీ లాంగ్వేజెస్) (Romanchakam)నెట్‌ఫ్లిక్స్రొమాంటిక్ కామెడీ
అక్టోబర్ 01క్రేజీ రిచ్, ఇన్‌క్రెడిబ్లీ బ్రోక్ (Crazy Rich, Incredibly Broke)నెట్‌ఫ్లిక్స్డార్క్ కామెడీ
అక్టోబర్ 01పంథడిక్కమ్ (Panthadikkam)జీ5స్పోర్ట్స్ డ్రామా
అక్టోబర్ 02పూజ మేరీ జాన్ (Pooja Meri Jaan)జీ5క్రైమ్ థ్రిల్లర్
అక్టోబర్ 02#లవ్ (#Love)నెట్‌ఫ్లిక్స్రొమాంటిక్ కామెడీ
అక్టోబర్ 02బెత్లహేమ్ కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit)జియోహాట్‌స్టార్ఫ్యామిలీ కామెడీ
అక్టోబర్ 02మదర్ ప్రామిస్ (Mother Promise)జీ5డ్రామా
అక్టోబర్ 02డూయింగ్ లైఫ్ (Doing Life)ప్రైమ్ వీడియోట్రూ క్రైమ్
అక్టోబర్ 03రన్మా ½ సీజన్ 3 (Ranma ½ Season 3)నెట్‌ఫ్లిక్స్యానిమే
అక్టోబర్ 04బ్లూ బాక్స్ సీజన్ 2 (Blue Box Season 2)నెట్‌ఫ్లిక్స్యానిమే
అక్టోబర్ 07క్యారీ (Carrie)ప్రైమ్ వీడియోహారర్ సిరీస్
అక్టోబర్ 08బిలో (Below)నెట్‌ఫ్లిక్స్మిస్టరీ థ్రిల్లర్
అక్టోబర్ 09మ్యాచ్‌బాక్స్: ది మూవీ (Matchbox: The Movie)యాపిల్ టీవీ+యాక్షన్ కామెడీ
అక్టోబర్ 09యానిమల్స్ (Animals)నెట్‌ఫ్లిక్స్యాక్షన్ థ్రిల్లర్
అక్టోబర్ 13సోలార్ అపోజిట్స్ సీజన్ 6 (Solar Opposites Season 6)హులుయానిమేటెడ్ కామెడీ
అక్టోబర్ 14విజన్ క్వెస్ట్ (Vision Quest)జియోహాట్‌స్టార్సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్
అక్టోబర్ 14లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 11 (Love Is Blind Season 11)నెట్‌ఫ్లిక్స్రియాలిటీ షో
అక్టోబర్ 15ది ట్రేటర్స్ తెలుగు (The Traitors Telugu)ప్రైమ్ వీడియోరియాలిటీ షో
అక్టోబర్ 16రోడీస్ రీబర్త్ (Roadies Rebirth)నెట్‌‌ఫ్లిక్స్ / జియోహాట్‌స్టార్రియాలిటీ షో
View All
 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks