...
...
Next Story

Netflix OTT: ఓటీటీ రారాజుగా నెట్‌ఫ్లిక్స్- పదేళ్లలో 11 లక్షల 34 వేల కోట్ల పెట్టుబడులు- 32.5 కోట్ల పెయిడ్ సబ్‌స్క్రైబర్స్

Netflix OTT Investment In 10 Years: గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వినోద రంగంలో సరికొత్త మైలురాళ్లను అధిగమించింది. గత పదేళ్ల కాలంలో సినిమాలు, ఓటీటీ సిరీస్‌ల కోసం ఏకంగా 135 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు పెట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలను సృష్టించినట్లు సంస్థ వెల్లడించింది.

Published on: May 17, 2026, 22:30:40 IST
Advertisement

Netflix OTT Investment In 10 Years: ప్రపంచవ్యాప్తంగా వినోద రంగాన్ని శాసిస్తున్న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన పదేళ్ల ప్రస్థానానికి సంబంధించిన ఆసక్తికర నివేదికను విడుదల చేసింది. గత దశాబ్ద కాలంలో సినిమాలు, వెబ్ సిరీస్‌ల నిర్మాణంలో ఏకంగా 135 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు సంస్థ ప్రకటించింది.

ఓటీటీ రారాజుగా నెట్‌ఫ్లిక్స్- పదేళ్లలో 11 లక్షల 34 వేల కోట్ల పెట్టుబడులు- 32.5 కోట్ల పెయిడ్ సబ్‌స్క్రైబర్స్ (Unsplash)
ఓటీటీ రారాజుగా నెట్‌ఫ్లిక్స్- పదేళ్లలో 11 లక్షల 34 వేల కోట్ల పెట్టుబడులు- 32.5 కోట్ల పెయిడ్ సబ్‌స్క్రైబర్స్ (Unsplash)

కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను సైతం ఈ సంస్థ ఎంతగానో ప్రభావితం చేస్తోంది. భారతదేశంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఓటీటీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు థియేటర్లకే పరిమితమైన ప్రాంతీయ సినిమాలు ఇప్పుడు ఈ ఓటీటీ స్ట్రీమింగ్ వేదికల ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంటున్నాయి.

లక్షలాది ఉద్యోగాలు.. గ్లోబల్ ఎకానమీకి బూస్ట్

గత పదేళ్ల కాలంలో నెట్‌ఫ్లిక్స్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు 325 బిలియన్ డాలర్ల (రూ. 11,34,000 కోట్లు- పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ అందించింది. వివిధ దేశాల్లో షూటింగులు, నిర్మాణ రంగ పనుల ద్వారా సుమారు 4,25,000 ఉద్యోగాలను సృష్టించింది. కాలిఫోర్నియాలోని లాస్ గాటోస్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకు 2025 ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా 32.5 కోట్లు (325 మిలియన్లు) మంది పెయిడ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

"ఈ రోజు మేము 'నెట్‌ఫ్లిక్స్ ఎఫెక్ట్' నివేదికను లాంచ్ చేస్తున్నాం. మా సినిమాలు, సిరీస్‌లు ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో, పరిశ్రమలను ఎలా మారుస్తున్నాయో ఇందులో సమగ్రంగా వివరించాం" అని నెట్‌ఫ్లిక్స్ కో-సీఈఓ టెడ్ సరాండోస్ పేర్కొన్నారు.

ప్రాంతీయ భాషల హవా.. ఇంగ్లీష్ చిత్రాలను దాటి!

దశాబ్దం క్రితం ఇది కేవలం పదో వంతు మాత్రమే ఉండేది. 'మనీ హైస్ట్', 'స్క్విడ్ గేమ్', 'కే-పాప్ డీమన్ హంటర్స్' వంటి అంతర్జాతీయ ఓటీటీ సిరీస్‌లు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఆకట్టుకున్నాయి. ఈ ధోరణి వల్ల భారతీయ, ముఖ్యంగా దక్షిణాది సినిమాలు కూడా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుతున్నాయి.

కొత్త సవాళ్లు.. గేమింగ్ వైపు అడుగులు

ఒకవైపు అద్భుతమైన వృద్ధి సాధిస్తున్నా, మరోవైపు చందాదారుల చేరిక మందగించడంతో నెట్‌ఫ్లిక్స్ కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతోంది. గత నెలలోనే సంస్థ కో-ఫౌండర్, చైర్మన్ రీడ్ హేస్టింగ్స్ సంస్థ నుంచి తప్పుకున్నారు.

ప్రస్తుతం కంపెనీ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆన్‌లైన్ గేమింగ్ రంగాల్లోకి అడుగుపెడుతోంది. రాబోయే రోజుల్లో ఈ విభాగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తానికి వినోద ప్రపంచాన్ని థియేటర్ల నుంచి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల వరకు మార్చేసిన క్రెడిట్ నెట్‌ఫ్లిక్స్‌కే దక్కుతుంది. భవిష్యత్తులో ఈ ఓటీటీ దిగ్గజం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks