OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 21 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 9 మరింత ఇంట్రెస్టింగ్- ఒక్కదాంట్లోనే 6!
OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో అన్నీ చూసేందుకు స్పెషల్‌గా ఉంటే 9 మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ తదితర ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో 21 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీ వరకు విభిన్న జోనర్లలో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
సూపర్‌గర్ల్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ చిత్రం)- జూలై 28
ఘోస్ట్ ట్రైన్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ హారర్ మిస్టరీ సెమీ అంథాలజీ ఫిల్మ్)- జూలై 28
ది డెవిల్స్ మౌత్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 29
లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 31
పోలీస్ కంప్లైంట్ (తెలుగు హారర్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జూలై 31
సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం (తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ ఫిల్మ్)- ఆగస్ట్ 1
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది ఇదహో కాలేజీ మర్డర్స్: కాలేజ్ నైట్‌మేర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 29
రావు బహదూర్ (తెలుగు సైకలాజికల్ డార్క్ కామెడీ డ్రామా ఫిల్మ్)- జూలై 31
గట్టా కుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ తమిళ స్పోర్ట్స్ కామెడీ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 31
ఆహా ఓటీటీ
ఆజాది 501 (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 29
దీవానా (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- జూలై 31
హరిచంద్ర కథ (తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 31
జీ5 ఓటీటీ
బాలన్: ది బాయ్ (తెలుగు డబ్బింగ్ మలయాళం సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 31
అబ్జెక్షన్ మై లార్డ్ (తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 31
సోనీ లివ్ ఓటీటీ
డీమాన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ కేస్టిల్ 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ డార్క్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 28
ది లెజెండ్ ఆఫ్ కర్ణ (తెలుగు డబ్బింగ్ హిందీ యానిమేటెడ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 31
ఈటీవీ విన్ ఓటీటీ
సెకండ్ మ్యారేజ్ (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 30
సిబిల్ స్కోర్ పెళ్లికొడుకు (తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- ఆగస్ట్ 2
దందా (తెలుగు సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సైకలాజికల్ డ్రామా వెబ్ సిరీస్)- చాయ్ షాట్స్ ఓటీటీ- జూలై 28
హార్ట్ బీట్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ తమిళ మెడికల్ రొమాంటిక్ కామెడీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జూలై 30
చుమ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 31
ఓటీటీలోకి తెలుగు 21 సినిమాలు
ఇలా గత వారం (జూలై 26 నుంచి ఆగస్ట్ 2 వరకు) తెలుగులో ఏకంగా 21 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు 21కి 21 అన్నీ సినిమాలు చాలా స్పెషల్‌గానే ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు
అయితే, సత్యదేవ్ రావు బహదూర్, వరలక్ష్మీ శరత్ కుమార్ పోలీస్ కంప్లైంట్, శ్రీకాంత్ అబ్జెక్షన్ మై లార్డ్, హరిచంద్ర కథ, ఆజాది 501, దందా, సెకండ్ మ్యారేజ్, సిబిల్ స్కోర్ పెళ్లికొడుకు, దీవానాతో కలిపి 9 తెలుగు స్ట్రయిట్ సినిమాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే 6 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


