OTT Release This Week: ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు సరికొత్త డిజిటల్ వినోదాన్ని పంచడానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్స్ట్' (Sun NXT) సిద్ధమైంది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ అప్‌డేట్స్‌తో డిజిటల్ ఆడియన్స్ లో సన్ నెక్స్ట్ భారీ అంచనాలు పెంచేసింది.

జూన్ 26న (ఈ శుక్రవారం) ఒకే రోజున రెండు విభిన్నమైన జోనర్లకు చెందిన సినిమాలను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. అందులో ఒకటి కిడ్స్ అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తున్న మలయాళ సూపర్ హీరో డ్రామెడీ కాగా.. మరొకటి సీట్ ఎడ్జ్ సస్పెన్స్ క్రియేట్ చేసే తమిళ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం.
రివాల్వర్ రింకో - సరికొత్త సూపర్ హీరో మ్యాజిక్
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న ఒక సరికొత్త వినూత్నమైన మూవీ 'రివాల్వర్ రింకో'. గతంలో వచ్చిన 'మిన్నల్ మురళి' లాంటి కల్ట్ సూపర్ హీరో సినిమా ఫ్లేవర్ తో, ఒక సినిమా లోపల సినిమా, ఫిల్మ్ మేకింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ డ్రామెడీ మూవీని తెరకెక్కించారు.
పిల్లలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసి చూసేలా ఎంతో ఫన్నీగా ఈ సినిమాను రూపొందించారు. "లాక్.. లోడ్.. వాచ్.. మీ కొత్త సూపర్ హీరో మూవీ లోడింగ్ అవుతోంది" అంటూ సన్ నెక్స్ట్ ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసింది. జూన్ 26 నుంచి ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది.
మూండ్రమ్ కణ్ (Moondram Kan)
సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్ కోసం వస్తున్న తమిళ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'మూండ్రమ్ కణ్'. ఇంతకీ హత్య చేసింది ఎవరు? అనే ఒక పవర్ఫుల్ క్యాప్షన్ తో ఈ సీజన్ లోనే మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ డ్రామాగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఒక హత్య, నలుగురు అనుమానితులు అంటూ మూవీపై అంచనాలు పెంచేస్తున్నారు. దీనికి ఐఎండీబీలోనూ 7.3 రేటింగ్ ఉంది.
{{/usCountry}}సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్ కోసం వస్తున్న తమిళ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'మూండ్రమ్ కణ్'. ఇంతకీ హత్య చేసింది ఎవరు? అనే ఒక పవర్ఫుల్ క్యాప్షన్ తో ఈ సీజన్ లోనే మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ డ్రామాగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఒక హత్య, నలుగురు అనుమానితులు అంటూ మూవీపై అంచనాలు పెంచేస్తున్నారు. దీనికి ఐఎండీబీలోనూ 7.3 రేటింగ్ ఉంది.
{{/usCountry}}ఒక మిస్టరీ పోలీస్ కేస్ దర్యాప్తు చుట్టూ తిరిగే ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ లో దిలీపన్, తేజు అశ్విని, విధార్త్, త్రిగుణ్ కీలక పాత్రలు పోషించారు. ఒక నిందితుడి అరెస్ట్ చుట్టూ నడిచే పొలిటికల్ అండ్ పోలీస్ డ్రామా ఎలిమెంట్స్ ఈ మూవీలో హైలైట్ గా ఉండబోతున్నట్లు ట్రైలర్ హింట్ ఇస్తోంది. జూన్ 26 నుంచి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎక్స్‌క్లూజివ్‌గా సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానుంది.
వీకెండ్ లో ఇంట్లోనే ఉంటూ మంచి కంటెంట్ చూడాలనుకునే వాళ్లకు ఈ రెండు ఆప్షన్స్ పర్ఫెక్ట్ ఛాయిస్ గా మారబోతున్నాయి. పిల్లల కోసం 'రివాల్వర్ రింకో', సస్పెన్స్ మైండ్ గేమ్స్ ఇష్టపడే వాళ్ల కోసం 'మూండ్రమ్ కణ్' థ్రిల్లర్ మూవీ అందుబాటులోకి రానున్నాయి.