ఓటీటీలోకి ప్రతివారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ అయి ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. ఈ వారం కూడా ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అయితే, వీటిలో ఇవాళ (అక్టోబర్ 30) ఒక్కరోజే ఐదు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయ.
టుడే ఓటీటీ రిలీజ్ సినిమాలు

వాటిలో ఒక్కటి మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్, హంగామా, చౌపల్ ప్లాట్‌ఫామ్స్‌లలో నేటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
బ్లాక్ మెయిల్ ఓటీటీ
తమిళంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా బ్లాక్ మెయిల్. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో తేజు అశ్విని, చంద్రిక రవి, బిందు మాధవి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ఈ సినిమాలో మరో హీరో శ్రీరామ్ కూడా యాక్ట్ చేశాడు. రమేష్ తిలక్ మరో పాత్ర పోషించాడు.
ము మారన్ దర్శకత్వం వహించిన బ్లాక్ మెయిల్ మంచి విజయం సాధించింది. మంచి హిట్ అందుకున్న బ్లాక్ మెయిల్ ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. సన్ నెక్ట్స్‌లో నేటి నుంచి బ్లాక్ మెయిల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ది విచర్ సీజన్ 4 ఓటీటీ
హాలీవుడ్ సిరీస్‌ల్లో పాపులర్ అయిన వాటిలో ది విచర్ ఒకటి. ఇప్పటికీ మూడు సీజన్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ నుంచి తాజాగా నాలుగో సీజన్ కూడా వచ్చేసింది. హారర్, యాక్షన్, అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా సాగే ది విచర్ సీజన్ 4 ఓటీటీ రిలీజ్ అయింది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌పామ్‌లో ది విచర్ 4 నేటి నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లో ఇవాళ్టీ నుంచి ది విచర్ సీజన్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
డర్టీ స్కామ్స్ ఓటీటీ
{{/usCountry}}ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌పామ్‌లో ది విచర్ 4 నేటి నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లో ఇవాళ్టీ నుంచి ది విచర్ సీజన్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
డర్టీ స్కామ్స్ ఓటీటీ
{{/usCountry}}హిందీలో బోల్డ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సిరీస్ డర్టీ స్కామ్స్. ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలతో స్కామ్స్ చేసే కథలతో ఈ సిరీస్ రూపొందింది. అడల్ట్ కంటెంట్, స్కామ్స్, రివేంజ్, మోసం వంటి అంశాలతో తెరకెక్కిన డర్టీ స్కామ్స్ ఓటీటీ రిలీజ్ అయింది. హంగామాలో హిందీ భాషలో నేటి నుంచి డర్టీ స్కామ్స్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.
మిస్టర్ షుడాయి ఓటీటీ
కామెడీ ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం మిస్టర్ షుడాయి. హర్జోత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో జూన్ 21న గతేడాది విడుదలైంది. సంవత్సరం దాటిన తర్వాత మిస్టర్ షుడాయి ఓటీటీలోకి వచ్చేసింది. పంజాబీ చిత్రమైన మిస్టర్ షుడాయి చౌపల్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
కుయిలి ఓటీటీ
తమిళంలో సోషల్ థ్రిల్లర్ డ్రామా చిత్రంగా తెరకెక్కిందే కుయిలి. ఓ విధవ రాలు రాజకీయాల్లోకి వెళ్తే అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కుయిలి ఇదివరకే బీసీఐనీట్ (bcineet ott) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఇవాళ (అక్టోబర్ 31) మరో ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో కూడా నేటి నుంచి కుయిలి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.