...
...
Next Story

Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లోకి ఒకే రోజు రెండు థ్రిల్లర్ మూవీస్.. ఐదు భాషల్లో సుమంత్ క్రైమ్ థ్రిల్లర్.. ఆల్ఫా కూడా

Netflix Thrillers: థ్రిల్లర్ మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్. నెట్‌ఫ్లిక్స్ ఒకే రోజు రెండు థ్రిల్లర్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. ఇందులో ఒకటి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ న్యూటన్స్ థర్డ్ లా ఒకటి కాగా.. మరొకటి హిందీ యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా.

Published on: Aug 27, 2026, 20:55:41 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Netflix Thrillers: రక్షాబంధన్ హాలీడే నాడు ఓటీటీలో ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ ఆగస్టు 28న లాంగ్ వీకెండ్ కంటే ముందే ఓటీటీ ప్రియులకు నెట్‌ఫ్లిక్స్ భారీ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆల్ఫా'తో పాటు తెలుగు సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ 'న్యూటన్స్ థర్డ్ లా' ఒకే రోజు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి.

'న్యూటన్స్ థర్డ్ లా'.. పోలీస్ vs క్రిమినల్స్ మైండ్ గేమ్

Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లోకి ఒకే రోజు రెండు థ్రిల్లర్ మూవీస్.. ఐదు భాషల్లో సుమంత్ క్రైమ్ థ్రిల్లర్.. ఆల్ఫా కూడా
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లోకి ఒకే రోజు రెండు థ్రిల్లర్ మూవీస్.. ఐదు భాషల్లో సుమంత్ క్రైమ్ థ్రిల్లర్.. ఆల్ఫా కూడా

టాలీవుడ్ సీనియర్ నటుడు సుమంత్ నటించిన మూవీ న్యూటన్స్ థర్డ్ లా. ఇదో క్రైమ్ థ్రిల్లర్ మూవీ. పోలీస్ వర్సెస్ క్రిమినల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీ ఈ 'న్యూటన్స్ థర్డ్ లా'. ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 28) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తోంది. "యాక్షన్ - రియాక్షన్ అనేది ముగింపు లేని లూప్.. సరిగ్గా పోలీసులు, నేరస్థుల మధ్య ఉండే మైండ్ గేమ్ తరహాలోనే" అనే కాన్సెప్ట్‌తో ఈ కథ సాగుతుంది.

1999లో జరిగిన రెండు హత్యల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ మూవీలో సుమంత్ ఓ పోలీస్ అధికారి పాత్రలో నటించగా.. మెర్క్యురీ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో జగపతి బాలు నటించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ జానర్లను ఇష్టపడే ఓటీటీ లవర్స్‌కు ఈ సినిమా పర్‌ఫెక్ట్ వీకెండ్ ఛాయిస్‌గా మారనుంది.

ఆలియా భట్ రచ్చ.. యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో 'ఆల్ఫా'

ఈ సినిమాలో ఆలియా భట్, శర్వరి ఇంటెన్స్ యాక్షన్ సీన్స్‌లో దుమ్మురేపారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించడంతో ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. బిగ్ స్క్రీన్ పై అలరించిన ఈ స్పై థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ముందుకు ఆగస్టు 28న రాబోతోంది.

వీకెండ్ ఓటీటీ వాచ్‌లిస్ట్‌లో పర్‌ఫెక్ట్ ఆప్షన్స్

నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ విషయాలను కన్‌ఫర్మ్ చేస్తూ స్పెషల్ ప్రోమోలు రిలీజ్ చేశాయి. ఒకే రోజు రెండు డిఫరెంట్ జానర్ల థ్రిల్లర్ సినిమాలను అందుబాటులోకి తెస్తుండటంతో ఓటీటీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

మీరు గనుక సీట్ ఎడ్జ్ యాక్షన్, మైండ్ గేమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడితే ఈ ఆగస్టు 28న నెట్‌ఫ్లిక్స్‌లో రాబోయే ఈ రెండు సినిమాలను మీ వాచ్‌లిస్ట్‌లో యాడ్ చేసుకోవడం మర్చిపోకండి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks