OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు- చూసేందుకు 12 చాలా స్పెషల్, తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 6!
Friday OTT Release Movies Today: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలోకి ఇవాళ ఏకంగా 20 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో చూసేందుకు 12 చాలా స్పెషల్‌గా అందులోనూ తెలుగులో 6 ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
OTT Streaming Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి ఆ ఓటీటీ మూవీస్, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
హ్యాపీ రాజ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- ఏప్రిల్ 24
నాటీ బిజినెస్ (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 24
మార్టీ సుప్రీమ్ (ఇంగ్లీష్ ఫిక్షనలైజ్‌డ్ బయోపిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 24
న్యూ బండిట్స్ సీజన్ 2 (బ్రెజిలియన్ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 24
ఇమ్మోర్టల్ కాంబాట్ (ఇంగ్లీష్ హిస్టారిక్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 24
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
అపెక్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 24
నుక్కడ్ నాటక్ (హిందీ డ్రామా సినిమా)- ఏప్రిల్ 24
ఇఫ్ విషెస్ కుడ్ కిల్ (కొరియన్ యంగ్ అడల్ట్ సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 24
నీ ఫరెవర్ (తెలుగు డబ్బింగ్ తమిళ మోడర్న్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 24
సోనిక్ 3 ది హెడ్జ్‌హాగ్ (ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్)- ఏప్రిల్ 24
అన్‌కామన్ వాలర్ (ఇంగ్లీష్ వార్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 24
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ప్రతిఛాయ (తెలుగు డబ్బింగ్ మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 24
24 (హిందీ స్పై సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 24
జీ5 ఓటీటీ
బ్యాండ్ మేళం (తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 24
జెరాక్స్ (కన్నడ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 24
గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పోస్ట్ అపోకలిప్టిక్ డిజాస్టర్ సర్వైవల్ యాక్షిన్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఏప్రిల్ 24
మై బ్రదర్ ది మినోటర్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఏప్రిల్ 24
నో అదర్ ఛాయిస్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- హులు ఓటీటీ- ఏప్రిల్ 24
సౌండ్ ఆఫ్ ఫాలింగ్ (ఇంగ్లీష్ హిస్టారికల్ సైకలాజికల్ డ్రామా చిత్రం)- ముబీ ఓటీటీ- ఏప్రిల్ 24
జేసీ ది యూనివర్సిటీ (కన్నడ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- సన్ నెక్ట్స్ ఓటీటీ- ఏప్రిల్ 24
ఓటీటీలోకి ఇవాళ 20 సినిమాలు
ఇలా ఇవాళ (ఏప్రిల్ 24) ఒక్కరోజు ఏకంగా 20 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో చూసేందుకు హ్యాపీ రాజ్, ప్రతిఛాయ, అనిల్ కపూర్ 24, బ్యాండ్ మేళం, జేసీ ది యూనివర్సిటీ, నీ ఫరెవర్, ఇఫ్ విషెస్ కుడ్ కిల్, న్యూ బండిట్స్ సీజన్ 2, గ్రీన్ ల్యాండ్ 2, నో అదర్ ఛాయిస్, జెరాక్స్, అపెక్స్‌తో కలిపి 12 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
తెలుగులో 6 ఇంట్రెస్టింగ్
వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 6 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అయితే ఈ 20 సినిమాలో అన్నిటికంటే ఎక్కువగా ఆరు మూవీస్ ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ప్రీమియర్ అవడం విశేషం. ఆ తర్వాత 5 సినిమాలతో రెండో స్థానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


