OTT Survival: ఓటీటీలోకి నేరుగా సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్- అడవిలో కొండలు ఎక్కే యువతి, వెంటాడే వేటగాడు- ఎక్కడ చూడాలంటే?

OTT Survival Action Thriller Apex Release: ఓటీటీలోకి నేరుగా సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ అపెక్స్ స్ట్రీమింగ్‌కు వచ్చేయనుంది. దట్టమైన అడవిలో కొండలు ఎక్కే యువతిని పిలిపించుకుని మరి వేటగాడిలా వెంటాడుతాడు సీరియల్ కిల్లర్. స్టార్ హీరోయిన్ చార్లిజ్ థెరాన్ నటించిన అపెక్స్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Apr 21, 2026, 06:11:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Apex OTT Streaming Details: ఓటీటీ కంటెంట్ సినిమాలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాక డిఫరెంట్ జోనర్స్ పుట్టుకొస్తున్నాయి. ఒకే జోనర్‌లో అనేక ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ విభిన్నంగా తెరకెక్కిస్తున్నారు. ఉదాహరణకు హారర్ జోనర్‌లోనే కామెడీ, సర్వైవల్, యాక్షన్, ఫాంటసీ, మిస్టరీ తదితర అంశాలతో విభిన్న సినిమాలు వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి.

ఓటీటీలోకి నేరుగా సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్- అడవిలో కొండలు ఎక్కే యువతి, వెంటాడే వేటగాడు- ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి నేరుగా సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్- అడవిలో కొండలు ఎక్కే యువతి, వెంటాడే వేటగాడు- ఎక్కడ చూడాలంటే?

అలా, సర్వైవల్ జోనర్లలో యాక్షన్ మిళితం చేసి తెరకెక్కించిన సినిమా ఒకటి ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదే అపెక్స్ మూవీ. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ చార్లిజ్ థెరాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మోస్ట్ అవేటెడ్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అపెక్స్ ఓటీటీలోకి నేరుగా వచ్చేందుకు సిద్ధమైంది. అడవిలో వేటగాడి నుంచి ప్రాణాలు కాపాడుకునే ఓ మహిళ పోరాటమే ఈ సినిమా ఇతివృత్తం.

'అపెక్స్' అసలు కథేంటి?

అపెక్స్ సినిమా సాషా అనే యువతి చుట్టూ తిరుగుతుంది. సాషా ఒక రాక్ క్లైంబర్ (కొండలు ఎక్కే యువతి). జీవితంలో ఎదురైన ఒక బాధాకరమైన సంఘటన నుంచి కోలుకోవడానికి, మనశ్శాంతి కోసం ఆమె ఎవరికీ చెప్పకుండా దట్టమైన అడవిలోకి వెళ్తుంది. అయితే అక్కడ ఆమెకు ఊహించని ప్రమాదం ఎదురవుతుంది.

ఒక క్రూరమైన వేటగాడు (సీరియల్ కిల్లర్) ఆమెను వేటాడటం ప్రారంభిస్తాడు. లోకంతో సంబంధం లేని ఆ అడవిలో, చేతిలో ఎలాంటి ఆయుధాలు లేని సాషా ఆ కిల్లర్ నుంచి ఎలా తప్పించుకుంది? తన ప్రాణాలను ఎలా కాపాడుకుంది? అనేదే ఈ 'క్యాట్ అండ్ మౌస్' గేమ్ క్లైమాక్స్. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ దట్టమైన అడవి గురించి సాషాకు చెప్పి పంపించేది ఆ సీరియల్ కిల్లరే.

తెర వెనుక దిగ్గజాలు

అడవిలోకి పిలిపించుకుని మరి అమ్మాయిలను వేటాడటం ఆ సీరియల్ కిల్లర్ హాబీగా అపెక్స్ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు జెరెమీ రాబిన్స్ కథను అందించగా, విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను ఎన్రిక్ పవ్దేజా పర్యవేక్షించారు. గతంలో దర్శకుడు కోర్మాకర్‌తో కలిసి 'బీస్ట్', 'ఎవరెస్ట్' వంటి విజువల్ వండర్స్‌ను రూపొందించిన 'ఫ్రేమ్‌స్టోర్' సంస్థే ఈ సినిమాకు కూడా పని చేయడం విశేషం.

దీనివల్ల సినిమాలో అడవి అందాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు ఎంతో సహజంగా ఉంటాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు బల్తాసర్ కోర్మాకర్ తెరకెక్కించిన అపెక్స్ ఓటీటీలోకి ఏప్రిల్ 24 నుంచి అందుబాటులో ఉండనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా అపెక్స్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రిలీజ్ చేసిన అపెక్స్ ట్రైలర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి నేరుగా

"ఒంటరిగా అడవికి వెళ్లిన ఓ మహిళ, అక్కడ ఒక సీరియల్ కిల్లర్ వేటలో చిక్కుకుంటే పరిస్థితి ఏంటి?" అనే ఆసక్తికరమైన లైన్‌తో ఈ సినిమాను రూపొందించారు. చార్లిజ్ థెరాన్ తన అద్భుతమైన నటనతో మరోసారి ప్రేక్షకులను అంచున కూర్చోబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

నటీనటుల విషయానికి వస్తే.. చార్లిజ్ థెరాన్‌తో పాటు టారన్ ఎగర్టన్, ఎరిక్ బానా కీలక పాత్రల్లో నటించారు. డెన్వర్ అండ్ డెలిలా ప్రొడక్షన్స్, చెర్నిన్ ఎంటర్టైన్మెంట్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు ఈ భారీ ప్రాజెక్టును నిర్మించాయి. తెలుగు ప్రేక్షకులకు కూడా 'సర్వైవల్ థ్రిల్లర్స్' అంటే ఎంతో ఇష్టం. కాబట్టి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ప్రీమియర్‌కు రానున్న అపెక్స్ మూవీ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More