OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ లవ్ డ్రామా- మూడో యానివర్సరీ రోజే బ్రేకప్- ఎక్కడ చూడాలంటే?

OTT Telugu Movie Release Today Veduka: ఓటీటీలోకి ఇవాళ తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ ఎమోషనల్ లవ్ డ్రామా చిత్రం వేడుక స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మూడో లవ్ యానివర్సరీ రోజు నాడే బ్రేకప్ చెప్పుకునే ప్రేమజంట కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మరి వేడుక ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Apr 19, 2026, 14:33:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Veduka OTT Streaming From Today: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా తెలుగు కంటెంట్‌ను ప్రోత్సహించడంలో ఆహా, ఈటీవీ విన్ రెండు ఓటీటీ సంస్థలు ఎప్పుడూ ముందుంటున్నాయి. ఎన్నో రకాల జోనర్లలో, విభిన్న అంశాలతో తెలుగు కంటెంట్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ లవ్ డ్రామా- మూడో యానివర్సరీ రోజే బ్రేకప్- ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ లవ్ డ్రామా- మూడో యానివర్సరీ రోజే బ్రేకప్- ఎక్కడ చూడాలంటే?

ప్యూర్ అండ్ లవ్ ఎమోషనల్ డ్రామా

అలాగే, ఇవాళ (ఏప్రిల్ 19) తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ ఎమోషనల్ లవ్ డ్రామా చిత్రంగా ఓ మూవీ ఓటీటీ రిలీజ్ అయింది. ఆ సినిమానే వేడుక. ప్రేమ, జ్ఞాపకాలు, బంధాల కలయికతో సాగే అందమైన ప్రయాణమే వేడుక. ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నేటి నుంచి ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

వేడుక చిత్రం ఒక ఎమోషనల్ జర్నీ. ప్రేమలో ఉండే తీపి జ్ఞాపకాలు, బంధాలను వదులుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే వేదన, చివరకు వాస్తవాన్ని అంగీకరించే మనస్తత్వం.. ఈ అంశాల చుట్టూ దర్శకుడు సాయి కృష్ణ కథను అల్లారు. ఈ సినిమాలో అర్జున్ జబ్నవిస్, నందిని హీరో హీరోయిన్లుగా నటించారు. వీరితోపాటు బిందు చంద్రమౌళి, ఉదయ్, ప్రణయాంజలి, శశి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

వీకెండ్‌కు బెస్ట్ ఛాయిస్

ఒక స్వచ్ఛమైన ప్రేమకథ కోసం ఎదురుచూసే ప్రేక్షకులకు ఈ వీకెండ్ 'వేడుక' మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు. ప్రొడ్యూసర్ సురేష్ కొమ్మినేని నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకు సుహాస్ అందించిన సంగీతం ప్రాణం పోసింది. సిద్ధార్థ్ స్వయంభూ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా చూపించగా, సూర్య తేజ లంక ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

వేడుక ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై యువతలో మంచి బజ్ ఏర్పడింది. ఇక వేడుక కథలోకి వెళితే.. హీరో మ్యూజిక్ కంపోజ్ చేస్తూ పాటలు పాడుతుంటాడు. సినిమాల్లో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. హీరో హీరోయిన్లు ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఇద్దరి మధ్య రొమాంటిక్ జర్నీ చాలా మ్యూజికల్‌గా సాగుతుంది.

యానివర్సరీ రోజునే బ్రేకప్

అయితే, హీరోయిన్ తల్లి మాత్రం హీరో కెరీర్‌కు నిలకడ ఉండదని, తనకు సెట్ అవ్వదని రెజెక్ట్ చేస్తుంది. హీరోయిన్ మాత్రం తల్లి మాట వినదు. మరోవైపు హీరో కంపోజ్ చేసిన సంగీతంలో మేకర్స్ ఒక చిన్న మార్పు చెబుతారు. కానీ, అందుకు హీరో ఒప్పుకోడు. అదే విషయంపై హీరోయిన్ గొడవ పడుతుంది. కట్ చేస్తే మూడో లవ్ యానివర్సరీ రోజునే హీరో హీరోయిన్లు బ్రేకప్ చెప్పుకుంటారు.

ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో జరిగిన సంఘర్షణ ఏంటీ?, ఇద్దరిలో ఏర్పడిన మార్పులు ఏంటీ? చివరికి ఈ ప్రేమ జంట కలిసిందా? లేదా అనేదే వేడుక సినిమా స్టోరీ. లవ్ మ్యూజికల్ అంశాలతో సాగే వేడుక ఓటీటీలోకి నేడు ఈటీవీ విన్‌లోకి వచ్చేసింది. ఈటీవీ విన్ కథా సుధాలో భాగంగా నేటి నుంచి వేడుక ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈటీవీ విన్ ఓటీటీలో

ప్రతివారం ఈటీవీ విన్ కథా సుధా ఓటీటీ వీక్లీ సిరీస్‌లో భాగంగా అతి తక్కువ రన్‌టైమ్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 38 నిమిషాల నిడివితో ఈటీవీ విన్‌లో వేడుక ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More