Today OTT Release Movies: ప్రతి వారం కొత్త సినిమాలతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ముస్తాబవుతుంటాయి. అయితే, ఇవాళ (జూలై 2) ఒక్కరోజు 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ డ్రామా, కామెడీ వంటి జోనర్లలో నేడు ఓటీటీలోకి వచ్చేసిన ఆ సినిమాలేంటో లుక్కేద్దాం.
సూపర్ సుబ్బు ఓటీటీ

తెలుగు ఓటీటీ ప్రపంచంలో ఇవాళ రెండు భిన్నమైన జోనర్లు పోటీ పడుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెలుగు రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక బోల్డ్ అండ్ వినూత్న డార్క్ కామెడీ డ్రామా సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
'సూపర్ సుబ్బు' పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ గ్రామీణ ప్రాంతంలో సెక్స్ ఎడ్యుకేషన్ అంశం చుట్టూ తిరుగుతుంది. తెలుగు డిజిటల్ స్పేస్‌లో ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుండటంతో ఆడియన్స్‌లో దీనిపై మంచి ఆసక్తి నెలకొంది.
పగ-ప్రతీకారాల చుట్టూ
మరోవైపు, అమెజాన్ ప్రైమ్ వీడియో పక్కా లోకల్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ను నమ్ముకుంది. 'ఇసకపట్నం' పేరుతో వచ్చిన రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్ నేటి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓడరేవు నగరం నేపథ్యంలో సాగే అండర్ వరల్డ్ మాఫియా, రాజకీయ కుట్రలు, పగ-ప్రతీకారాల చుట్టూ ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా మలిచారు. రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఈ వీకెండ్ ఇదొక పర్ఫెక్ట్ ఆప్షన్ కానుంది.
అంతర్జాతీయ డ్రామాలు.. మైండ్ బెండింగ్ జపనీస్ థ్రిల్లర్
గ్లోబల్ కంటెంట్ ప్రియుల కోసం నెట్‌ఫ్లిక్స్ ఈసారి రెండు విభిన్న వెబ్ సిరీస్‌లను ఒకే రోజు విడుదల చేసింది. అందులో మొదటిది 'హ్యుమన్ వెపర్'. జపనీస్ భాషలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఫాంటసీ డ్రామా సిరీస్ సరికొత్త కాన్సెప్ట్‌తో సాగుతుంది. సైన్స్ ఫిక్షన్‌తో పాటు అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్ ఈ సిరీస్‌లో ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
అలాగే, ఇంగ్లీష్ కామెడీ డ్రామా ఇష్టపడే వారి కోసం 'సర్వైవల్ ఆఫ్ ది థికెస్ట్' (Survival of the Thickest) సీజన్ 3ని కూడా నెట్‌ఫ్లిక్స్ నేడే స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. గత రెండు సీజన్లకు మంచి ఆదరణ దక్కడంతో ఈ కొత్త సీజన్‌పై భారీ క్రేజ్ ఉంది.
ప్రాంతీయ వినోదం.. పంజాబీ సినిమాలు
{{/usCountry}}అలాగే, ఇంగ్లీష్ కామెడీ డ్రామా ఇష్టపడే వారి కోసం 'సర్వైవల్ ఆఫ్ ది థికెస్ట్' (Survival of the Thickest) సీజన్ 3ని కూడా నెట్‌ఫ్లిక్స్ నేడే స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. గత రెండు సీజన్లకు మంచి ఆదరణ దక్కడంతో ఈ కొత్త సీజన్‌పై భారీ క్రేజ్ ఉంది.
ప్రాంతీయ వినోదం.. పంజాబీ సినిమాలు
{{/usCountry}}తెలుగు, గ్లోబల్ కంటెంట్‌తో పాటు ప్రాంతీయ సినిమాలను ఆదరించే వారి కోసం కూడా ఈ వారం ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి. పంజాబీ రొమాంటిక్ డ్రామాగా మంచి గుర్తింపు తెచ్చుకున్న 'రబ్ ద రేడియో 3' సినిమా చౌపల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.
అలాగే, కేబుల్‌వన్ ఓటీటీ యాప్‌లో 'ఏక్ అనోఖి దుల్హాన్ సావి' అనే పంజాబీ డ్రామా చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. విభిన్నమైన కథాంశాలు, వినోదాన్ని కోరుకునే వారు తమకు నచ్చిన ప్లాట్‌ఫామ్‌లలో ఈ సరికొత్త సినిమాలను, సిరీస్‌లను చూసి ఎంజాయ్ చేయవచ్చు.
నేటి ఓటీటీ రిలీజ్ సినిమాల జాబితా:
| సినిమా / సిరీస్ పేరు | భాష / జోనర్ | ఓటీటీ ప్లాట్‌ఫామ్ | ఓటీటీ రిలీజ్ డేట్ |
|---|---|---|---|
| సూపర్ సుబ్బు | తెలుగు (రూరల్ సెక్స్ ఎడ్యుకేషన్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్) | నెట్‌ఫ్లిక్స్ | జూలై 2 |
| హ్యుమన్ వెపర్ | జపనీస్ (సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్) | నెట్‌ఫ్లిక్స్ | జూలై 2 |
| సర్వైవల్ ఆఫ్ ది థికెస్ట్ (సీజన్ 3) | ఇంగ్లీష్ (కామెడీ డ్రామా వెబ్ సిరీస్) | నెట్‌ఫ్లిక్స్ | జూలై 2 |
| ఇసకపట్నం | తెలుగు (పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్) | అమెజాన్ ప్రైమ్ | జూలై 2 |
| రబ్ ద రేడియో 3 | పంజాబీ (రొమాంటిక్ డ్రామా సినిమా) | చౌపల్ ఓటీటీ | జూలై 2 |
| ఏక్ అనోఖి దుల్హాన్ సావి | పంజాబీ (డ్రామా చిత్రం) | కేబుల్‌వన్ ఓటీటీ | జూలై 2 |
ఇంట్రెస్టింగ్‌గా 2 తెలుగులో
ఇలా ఇవాళ (జూలై 2) 6 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో చూసేందుకు అన్నీ చాలా స్పెషల్‌గానే ఉన్నాయి. అయితే, తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన సూపర్ సుబ్బు, ఇసకపట్నం మాత్రం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాగా, ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఏకంగా 3 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.