ఓటీటీలో ఈవారం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలలో కచ్చితంగా చూడాల్సిన ఆరు సినిమాలు ఇవే..

ఈ వారం  అంటే ఫిబ్రవరి రెండో వారం ఓటీటీలో సౌత్ సినిమాల పండగే అని చెప్పొచ్చు. చిరంజీవి, నయనతారల బ్లాక్‌బస్టర్ 'మన శంకర వర ప్రసాద్ గారు'తో పాటు అనగనగా ఒక రాజు.. శివాజీ-లయల క్రైమ్ థ్రిల్లర్, జీవా నటించిన పొంగల్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

Feb 10, 2026, 21:16:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ ప్రేక్షకులూ ఈ వీకెండ్ గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా సినిమాలే రెడీ అవుతున్నాయి. యాక్షన్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, సెటైర్.. ఇలా అన్ని జానర్ల సినిమాలు ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్నాయి. ముఖ్యంగా భారీ టైటిల్స్ ఉన్న మూడు సినిమాలు (తెలుగు, తమిళం) ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. జీ5, నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్, ఈటీవీ విన్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో రాబోయే ఆ 6 సౌత్ సినిమాలు ఇవే.

ఓటీటీలో ఈవారం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలలో కచ్చితంగా చూడాల్సిన ఆరు సినిమాలు ఇవే..
ఓటీటీలో ఈవారం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలలో కచ్చితంగా చూడాల్సిన ఆరు సినిమాలు ఇవే..

మన శంకర వర ప్రసాద్ గారు - జీ5 (ZEE5)

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతి హిట్ ఇది. ఎన్‌ఎస్‌జీ ఆఫీసర్ ప్రసాద్‌గా చిరంజీవి, కేంద్ర మంత్రి కూతురు శశిరేఖగా నయనతార నటించారు. విడిపోయిన భార్యాభర్తల మధ్య జరిగే సరదా సన్నివేశాలు, యాక్షన్ ఈ సినిమా హైలైట్. జీ5 ఓటీటీలో బుధవారం (ఫిబ్రవరి 11) నుంచి చూడొచ్చు.

అనగనగా ఒక రాజు - నెట్‌ఫ్లిక్స్

మరో సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మూవీ అనగనగా ఒక రాజు. నెట్‌ఫ్లిక్స్ లోకి బుధవారం (ఫిబ్రవరి 11) వస్తోంది. ఈ కామెడీ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ సాధించింది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమాను మిస్ కావద్దు.

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని - ఈటీవీ విన్

'#90s' వెబ్ సిరీస్ ఫేమ్ శివాజీ, హీరోయిన్ లయ దాదాపు దశాబ్దం తర్వాత జతకట్టిన సినిమా ఇది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ఆయుధాలు ఉన్న దుండగుల నుంచి ఒక కుటుంబం (భార్య, భర్త, కొడుకు) ఎలా తప్పించుకుంది అనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈటీవీ విన్ ఓటీటీలో గురువారం (ఫిబ్రవరి 12) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

తలైవర్ తంబి తలైమైయిల్ - నెట్‌ఫ్లిక్స్

జీవా హీరోగా నటించిన తమిళ మూవీ ఇది. పొంగల్ కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. ఒక ఊరిలో పెళ్లి జరిపించాల్సిన పంచాయతీ లీడర్.. అదే రోజు పక్కింట్లో చావు సంభవించడంతో పడే ఇబ్బందులు, ఆ గందరగోళం మధ్య పుట్టే హాస్యం ఈ సినిమా కథ. నెట్‌ఫ్లిక్స్ లోకి తెలుగులోనూ గురువారం (ఫిబ్రవరి 12) అడుగుపెట్టనుంది.

బేబీ గర్ల్ - సోనీ లివ్

నివిన్ పాలీ హాస్పిటల్ అటెండెంట్‌గా నటించిన ఈ థ్రిల్లర్ సినిమాలో.. ఆసుపత్రి నుంచి ఒక పసికందు కిడ్నాప్ అవ్వడం, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వెనుక ఉన్న అసలు నిజాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. సోనీ లివ్ ఓటీటీలో గురువారం (ఫిబ్రవరి 12) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

సూర్య: పవర్ ఆఫ్ లవ్ – సన్ నెక్ట్స్

ఇదో కన్నడ మూవీ. అనాథ అయిన కాలేజీ కుర్రాడు సూర్య, తన గర్ల్ ఫ్రెండ్ కోసం చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను నేరస్తుల వలలో చిక్కుకుంటాడు. యాక్షన్, రొమాన్స్ కలగలిసిన చిత్రమిది. ప్రశాంత్ సూర్య, హర్షిత ఎంకే ఇందులో జంటగా నటించారు. సన్ నెక్ట్స్ ఓటీటీలో శుక్రవారం (ఫిబ్రవరి 13) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.