Letterboxd App For Sale Netflix Sony Liv: ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర అభిమానులు, సినీ విమర్శకులు ఎంతో ఇష్టపడే సోషల్ నెట్‌వర్కింగ్ ఓటీటీ యాప్ 'లెటర్‌బాక్స్‌డి' (Letterboxd) త్వరలోనే కొత్త యజమాని చేతికి వెళ్లనుంది. దాదాపు 250 మిలియన్ డాలర్ల (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 2,100 కోట్లు) భారీ విలువతో ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను విక్రయించేందుకు యాప్ యజమానులు సన్నాహాలు చేస్తున్నారు.
రేసులో హెవీవెయిట్స్.. నెట్‌ఫ్లిక్స్, సోనీ పోటీ

ఈ డీల్ కోసం ప్రముఖ లయన్ ట్రీ (LionTree) మర్చంట్ బ్యాంకింగ్ సంస్థ చర్చలు జరుపుతోంది. ఈ డిజిటల్ రివ్యూ ప్లాట్‌ఫామ్‌ను దక్కించుకునేందుకు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix), హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్, పారామౌంట్ స్కైడాన్స్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ (TPG) పోటీ పడుతున్నాయి.
వీరితో పాటు ప్రసిద్ధ సోషల్ మీడియా సైట్ 'రెడ్డిట్' సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్ కూడా ఈ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే, "నేను చిన్నగా తుమ్మినా సరే ఎవరో ఒకరు దాని గురించి పెద్ద వార్తగా మాట్లాడేస్తున్నారు లాల్" అని ఈ కొనుగోలు వార్తలపై అలెక్సిస్ ఒహానియన్ సరదాగా స్పందించారు.
ఏంటీ 'లెటర్‌బాక్స్‌డి'? ఎందుకింత క్రేజ్?
2011లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ వేదికగా మాథ్యూ బుకానన్, కార్ల్ వాన్ రాండో ఈ యాప్‌ను ప్రారంభించారు. యూజర్లు తాము చూసిన సినిమాలను రికార్డు చేయడానికి, రివ్యూలు రాయడానికి, మిత్రులతో 'వాచ్‌లిస్ట్‌లు' పంచుకోవడానికి ఇది ఒక ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లా పనిచేస్తుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దీనికి 2.6 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ముఖ్యంగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువత ఈ ఓటీటీ యాప్‌ను విపరీతంగా వాడుతున్నారు. హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు మార్టిన్ స్కోర్సేస్, ప్రముఖ నటి ఆయో ఎడెబిరి, పాప్ స్టార్ చార్లీ ఎక్స్ సీఎక్స్ వంటి సెలబ్రిటీలు కూడా తమ రివ్యూలను ఈ ప్లాట్‌ఫామ్‌పై క్రమం తప్పకుండా షేర్ చేస్తూ ఉంటారు.
మూడేళ్లలో 5 రెట్ల మార్కెట్ విలువ
దీనివల్ల సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ యాప్‌కు విపరీతమైన ఆదరణ పెరిగింది. కెనడాకు చెందిన 'టైని' (Tiny) హోల్డింగ్ కంపెనీ 2023లో దాదాపు 50 నుంచి 60 మిలియన్ డాలర్ల విలువ వద్ద లెటర్బాక్స్డిలో 60 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. మిగిలిన 40 శాతం వాటా మూల వ్యవస్థాపకుల వద్దే ఉంది. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే దీని మార్కెట్ విలువ ఐదు రెట్లు పెరగడం గమనార్హం.
{{/usCountry}}దీనివల్ల సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ యాప్‌కు విపరీతమైన ఆదరణ పెరిగింది. కెనడాకు చెందిన 'టైని' (Tiny) హోల్డింగ్ కంపెనీ 2023లో దాదాపు 50 నుంచి 60 మిలియన్ డాలర్ల విలువ వద్ద లెటర్బాక్స్డిలో 60 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. మిగిలిన 40 శాతం వాటా మూల వ్యవస్థాపకుల వద్దే ఉంది. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే దీని మార్కెట్ విలువ ఐదు రెట్లు పెరగడం గమనార్హం.
{{/usCountry}}అయితే, ఏదైనా బడా హాలీవుడ్ స్టూడియో లేదా నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రొడక్షన్ కంపెనీ ఈ యాప్‌ను దక్కించుకుంటే 'కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్' (స్వార్థ ప్రయోజనాల ఘర్షణ) తలెత్తుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి.
కొత్త యజమాని వస్తే సమస్యలేంటి?
తమ సొంత సినిమాలకు ఎక్కువ రేటింగ్స్ వచ్చేలా లేదా ప్రత్యర్థి కంపెనీల సినిమాలను తక్కువ చేసి చూపేలా యాప్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని సినిమా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
గతంలో ప్రముఖ మూవీ రేటింగ్ సైట్ 'రాటన్ టొమాటోస్'ను ఎన్‌బీసీ యూనివర్సల్ కొనుగోలు చేసినప్పుడు, 'ఐఎమ్‌డీబీ' (IMDb)ని అమెజాన్ చేజిక్కించుకున్నప్పుడు కూడా ఇటువంటి విమర్శలే వచ్చాయి. అంటే, కొత్త యజమాని వస్తే నిజాయితీ లేని రివ్యూలు, రేటింగ్‌లను చూడాల్సి వస్తుందని విశ్లేకులు అంచనా వేస్తున్నారు.