...
...
Next Story

OTT Views: బండ భూతం కథేంటీ? ఓటీటీని ఉపేస్తున్న తెలుగు హారర్ థ్రిల్లర్.. 100 మిలియన్స్ దాటిన స్ట్రీమింగ్ మినిట్స్

తెలుగు హారర్ థ్రిల్లర్ శంబాల ఓటీటీలో అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో దూసుకెళ్తోంది. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ఈ మూవీ ఓటీటీ లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది. బండ భూతం కథేంటీ? అని ఆడియన్స్ శంబాలను తెగ చూసేస్తున్నారు.

Published on: Feb 1, 2026, 19:50:20 IST
Advertisement

హీరో ఆది సాయికుమార్ కు చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ ఇచ్చిన మూవీ ‘శంబాల’. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో అదరగొట్టింది. సీనియర్ హీరో సాయి కుమార్ కొడుకైన ఆది కెరీర్ లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది ఈ మూవీ.

శంబాల ఓటీటీ

ఓటీటీలో అదరగొడుతున్న హారర్ థ్రిల్లర్ (x/ahavideoIN)
ఓటీటీలో అదరగొడుతున్న హారర్ థ్రిల్లర్ (x/ahavideoIN)

ఆది సాయి కుమార్ హీరోగా నటించిన శంబాల జనవరి 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా వీడియోలో ఇది అందుబాటులో ఉంది. ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ ను ఆహా వీడియో గోల్డ్ సబ్ స్క్రైబర్లు మాత్రం ఒక రోజు ముందు నుంచే చూశారు. ఇప్పుడు శంబాల చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ లో అరుదైన మైలురాయిని అందుకుంది.

100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్

శంబాల సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటిందని ఆహా వీడియో సోషల్ మీడియాలో ప్రకటించింది. ‘‘100 మిలియన్ ప్లస్ మినిట్స్ స్ట్రీమింగ్. ఆ భయం మరింత పెద్దగా మారింది. శంబాలను ఇప్పుడే ఆహాలో మాత్రమే చూడండి’’ అని ఎక్స్ లో పోస్టు చేసింది.

అత్యధిక కలెక్షన్లు

సైన్స్ కు, మూఢ నమ్మకాలకు మధ్య జరిగే పోరాటమే శంబాల మూవీ. ఈ సినిమా కథ 1980లో శంబాల అనే గ్రామ నేపథ్యంలో సాగుతుంది. ఒక రోజు ఆకాశంలో నుంచి ఓ ఉల్క ఆ గ్రామంలో పడుతుంది. ఆ తర్వాత విలేజ్ లో వింత సంఘటనలు జరుగుతాయి. వరుస హత్యలు చోటు చేసుకుంటాయి.

గ్రామానికి ఏదో కీడు జరిగిందని గ్రామస్తులు భయపడతారు. కొంతమందేమో దైవ శక్తి అంటే మరికొందరు దుష్ట శక్తి అంటారు. బండ భూతం అని వణికిపోతారు. ఆ టైమ్ లోనే విక్రమ్ (ఆది సాయి కుమార్) ఎంట్రీ ఇస్తాడు. అతనో జియాలజిస్ట్. ఈ మిస్టరీని సైన్స్ తో ఛేదించేందుకు ప్రయత్నిస్తాడు. మరి అతని ప్రయత్నం సక్సెస్ అయిందా? అసలు ఈ రహస్యం ఏంటీ? అన్నది శంబాల మూవీలో చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks