బాలీవుడ్ ఓటీటీ బ్యూటీ క్రితికా కమ్రా ఇప్పుడు కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా గోల్డెన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఒకవైపు తన కొత్త వెబ్ సిరీస్ మట్కా కింగ్ ఓటీటీ రిలీజ్ కాగా.. మరోవైపు తన చిరకాల స్నేహితుడు గౌరవ్ కపూర్ చేతిని అందుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

ముంబైలోని తమ నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో బాయ్‌ఫ్రెండ్ గౌరవ్ కపూర్, క్రితికా కమ్రా వివాహం మార్చి 11న నిరాడంబరంగా జరిగింది. ఈ క్రమంలో తన ప్రయాణం గురించి, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి క్రితికా కమ్రా మనసు విప్పి మాట్లాడింది.
మూలాలను మర్చిపోని మధ్యప్రదేశ్ చిన్నది
క్రితికా బరేలీలో జన్మించినప్పటికీ, ఆమె కుటుంబం మధ్యప్రదేశ్‌లోని సుఖ్‌పూర్ గ్రామానికి చెందినది. ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన క్రితికా కమ్రా టీనేజ్ వయసులోనే టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి ముంబైకి చేరుకున్నారు.
"నేను మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. నా తల్లిదండ్రులు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. నేను ఇప్పుడు విదేశాలకు ప్రయాణిస్తూ, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నా.. నా మనసు మాత్రం ఎప్పుడూ నా సొంత ఊరితోనే ఉంటుంది. నా మూలాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను" అని క్రితికా కమ్రా గర్వంగా చెప్పింది.
37 ఏళ్ల వయసులో పెళ్లి.. ఒత్తిడి లేని నిర్ణయం
సాధారణంగా ఆడపిల్లలకు 20 ఏళ్లు దాటగానే పెళ్లి ఒత్తిడి మొదలవుతుంది. కానీ క్రితికా మాత్రం 37 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితులందరూ దశాబ్దం క్రితమే పెళ్లిళ్లు చేసుకున్నా, తనపై తన తల్లిదండ్రులు ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని ఆమె పేర్కొన్నారు.
"నా స్నేహితులు సామాజిక ఒత్తిడి వల్ల త్వరగా పెళ్లి చేసుకున్నారు. కానీ, నా విషయంలో నా తల్లిదండ్రులు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల మన నిర్ణయాలపై మనకు స్పష్టత ఉంటుంది. నేను, గౌరవ్ ఇద్దరం స్వతంత్రంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం" అని క్రితికా కమ్రా వివరించారు.
ముంబై ఇల్లే మా పెళ్లి వేదిక
{{/usCountry}}"నా స్నేహితులు సామాజిక ఒత్తిడి వల్ల త్వరగా పెళ్లి చేసుకున్నారు. కానీ, నా విషయంలో నా తల్లిదండ్రులు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల మన నిర్ణయాలపై మనకు స్పష్టత ఉంటుంది. నేను, గౌరవ్ ఇద్దరం స్వతంత్రంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం" అని క్రితికా కమ్రా వివరించారు.
ముంబై ఇల్లే మా పెళ్లి వేదిక
{{/usCountry}}సినిమా సెలబ్రిటీలు అంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్, కోట్లు ఖర్చు చేసే ఆర్భాటాలు సహజం. కానీ, క్రితికా-గౌరవ్ మాత్రం ముంబైలోని తమ ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉందట.
"మేమిద్దరం చాలా చిన్న వయసులోనే ఇళ్లు వదిలి ముంబైకి వచ్చాం. ఇక్కడే మా కెరీర్ నిర్మించుకున్నాం. మా పరిచయం, ప్రేమ అన్నీ ఇక్కడే జరిగాయి. అందుకే ఈ నగరంలోనే, మా ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ముంబై లాంటి నగరంలో ఇంట్లో పెళ్లి చేసుకునేంత స్థలం ఉండటం కూడా మా అదృష్టమే" అని క్రితికా కమ్రా సంతోషం వ్యక్తం చేశారు.
గౌరవ్‌ను అలా చూసి షాక్ అయ్యాను
ఇదిలా ఉంటే, గౌరవ్ కపూర్ గత రెండు దశాబ్దాలుగా స్పోర్ట్స్ ప్రజెంటర్, యాంకర్‌గా సుపరిచితుడు. నిత్యం వేలమంది ముందు లైవ్ షోలు చేసే గౌరవ్, పెళ్లి మండపంలో క్రితికను చూడగానే కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆ క్షణం గురించి క్రితికా మాట్లాడుతూ.. "నేను లోపల ముస్తాబై బయటకు వచ్చేసరికి గౌరవ్ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. తను అంత ఎమోషనల్ అవుతాడని నేను అస్సలు ఊహించలేదు. అతనే కాదు, అక్కడ ఉన్నవారందరూ కూడా ఆ క్షణంలో భావోద్వేగానికి లోనయ్యారు. అంతటి అనుభవం ఉన్న వ్యక్తి అలా ఎమోషనల్ అవ్వడం నిజంగా ఒక మర్చిపోలేని అనుభూతి" అని గుర్తు చేసుకున్నారు.
'మట్కా కింగ్'లో కీలక పాత్ర
కాగా, క్రితికా కమ్రా ఓటీటీ సిరీస్‌లతో బాగా క్రేజ్ తెచ్చుకుంది. బొంబై మేరీ జాన్, గ్యారా గ్యారా, తాండవ్ వంటి వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న క్రితికా కమ్రా తాజాగా మట్కా కింగ్ వెబ్ సిరీస్‌తో ఇవాళ (ఏప్రిల్ 17) ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
అమెజాన్ ప్రైమ్‌లో
అమెజాన్ ప్రైమ్‌లో నేటి నుంచి మట్కా కింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 1960ల నాటి బొంబాయి నేపథ్యంలో, మట్కా జూదం సామ్రాజ్యాన్ని ఏలిన రతన్ ఖత్రీ, కళ్యాణ్ జీ భగత్ జీవితాల నుంచి స్ఫూర్తి పొంది ఈ ఓటీటీ సిరీస్ రూపొందించారు. ఇందులో విజయ్ వర్మ ప్రధాన పాత్ర పోషించగా క్రితికా కమ్రా, సాయి తంహంకర్, గుల్షన్ గ్రోవర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు చేశారు.